Alka Yagnik: సింగర్ అల్కా యాగ్నిక్‌కు అరుదైన వినికిడి సమస్య - ఈ వ్యాధి మీకూ రావచ్చు, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
Alka Yagnik: ఇటీవల బాలీవుడ్ లెజెండరీ సింగర్ అల్కా యాగ్నిక్.. తనకు ఒక అరుదైన వినికిడి వ్యాధి ఉందని సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించారు. ఇంతకీ ఏంటా వ్యాధి? లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా అని మీరూ చూసేయండి.
Alka Yagnik: ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌లో సింగర్‌గా పనిచేస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్నారు అల్కా యాగ్నిక్. తాజాగా తనకు ఒక అరుదైన వ్యాధి ఉందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు అల్కా. తనకు అరుదైన వినికిడి లోపం (సెన్సోన్యూరల్ డెఫ్‌నెస్) ఉందని ప్రకటించారు. దీంతో అసలు ఈ వ్యాధి ఏంటి, ఎలా వస్తుంది, దీనికి చికిత్స ఏంటి అని ఫ్యాన్స్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
సెన్సోన్యూరల్ డెఫ్‌నెస్ అంటే ఏంటి?
కళ్లు తరహాలోనే చెవులు కూడా చాలా సెన్సిటివ్ పార్ట్స్. పెద్ద పెద్ద శబ్దాలను తట్టుకోలేవు. అలాగే, ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరిగి కొత్త రోగాలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. నరాలు దెబ్బతిని శాస్వతంగా చెవిటివాళ్లుగా మారిపోయే ప్రమాదం ఉంది. తాజాగా అల్కాకు వచ్చిన సమస్య కూడా అలాంటిదే. దీన్ని సెన్సోన్యూరల్ డెఫ్‌నెస్ (sensorineural deafness) అంటారు. చెవులోని ఒక నరం దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. దీని వల్ల వినికిడి శక్తిని కొంచెంకొంచెం కోల్పోతారు.
ఈ వ్యాధిని వెంటనే గుర్తించలేరా?
స్టీరియోసిలియా ద్వారా సౌండ్ వేవ్స్ నుంచి వచ్చే వైబ్రేషన్స్.. ఆడిటరీ నరం ద్వారా బ్రెయిన్‌కు చేరుస్తాయి. తరచుగా 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని వింటూ ఉంటే ఈ స్టీరియోసిలియా డ్యామేజ్ అవుతుంది. ఇది 30 నుంచి 50 శాతం డ్యామేజ్ అయ్యేవరకు ఈ వ్యాధి గురించి కనుక్కోవడం చాలా కష్టమంటున్నారు డాక్టర్లు. ఇక చుట్టూ ఉండే శబ్దాలను బట్టి ఆ డ్యామేజ్ ఏ రేంజ్‌లో జరిగిందో కనుక్కోవచ్చని చెప్తున్నారు. కొందరికి ఈ వినికిడి లోపం చాలా తక్కువగా ఉంటే, కొందరికి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సెన్సోన్యూరల్ డెఫ్‌నెస్ వ్యాధిలో కూడా వివిధ స్టేజెస్ ఉంటాయి.
వ్యాధి ఎలా వస్తుంది.?
సెన్సోన్యూరల్ డెఫ్‌నెస్ వ్యాధి అనేది ఒకేసారి రెండు చెవులపై ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి ఒక్కసారిగా అయినా రావచ్చు లేదా కొంచెంకొంచెంగా తీవ్రంగా మారుతుండొచ్చు. ఉదయం లేవగానే చెవిలో భరించలేనంత శబ్దం రావడం ఈ వ్యాధిలో సహజంగా జరిగే విషయమని చెప్తున్నారు డాక్టర్లు. ఇన్ఫెక్షన్స్, ఆందోళన, ఆటోఇమ్యూన్ లోపం, వాటికోసం తీసుకున్న మందుల వల్ల కూడా సెన్సోన్యూరల్ డెఫ్‌నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చాలా అరుదైన కేసుల్లో కొందరు పిల్లలు పుట్టడంతోనే సెన్సోన్యూరల్ డెఫ్‌నెస్‌తో పుడతారని తెలుస్తోంది. అంతే కాకుండా వయసు పైబడుతున్న కొద్దీ జెనటిక్ సమస్యల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందట. ఇక ఈ వ్యాధి గురించి కనుక్కునే మార్గాల గురించి కూడా వైద్యులు బయటపెట్టారు.
వ్యాధి లక్షణాలు..
గట్టిగా చెప్తున్నా కూడా ఇతరులు మాట్లాడేది అర్థం చేసుకోలేకపోవడం, బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువగా సౌండ్ ఉంటే ఇతర శబ్దాలు వినిపించకపోవడం, తరచుగా కళ్లు తిరిగినట్టుగా ఉండడం, ఊరికే చెవిలో ఏదో శబ్దం రావడం.. ఇవన్నీ సెన్సోన్యూరల్ డెఫ్‌నెస్ లక్షణాలని డాక్టర్లు చెప్తున్నారు. వయసు పెరుగుతూ జెనటిక్ సమస్యలకు దారితీయడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. కానీ ఈ వ్యాధి లక్షణాలు అనేవి ముందు కామన్‌గా అనిపించినా రోజులు గడుస్తున్నకొద్దీ పరిస్థితి దారుణంగా మారుతూ ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ వినికిడి లోపం రావడం సహజం. అందుకే ముందు నుండే చెవులను జాగ్రత్తగా కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. హెడ్‌ఫోన్స్‌లో 60 శాతానికి మించి సౌండ్ పెట్టుకోవద్దని, తరచుగా టెస్ట్స్ చేయించుకుంటూ ఉండమని వారు సలహా ఇస్తున్నారు.
Also Read: బాలీవుడ్ సింగర్ అల్కా యాగ్నిక్‌కు అరుదైన వ్యాధి - షాక్‌లో మ్యూజిక్ ఇండస్ట్రీ, ఫ్యాన్స్