Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’లో కమల్ హాసన్ పాత్ర ఇదేనట - ఆయన స్క్రీన్‌పై ఎంతసేపు కనిపిస్తారంటే?
Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ నుంచి అమితాబ్ క్యారెక్టర్‌ను రివీల్ చేసిన మేకర్స్.. కమల్ హాసన్ పాత్ర గురించి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ గురించి పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
Kamal Haasan In Kalki 2898 AD: ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 AD’ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా చిత్రాల్లో ‘కల్కి 2898 AD’ కూడా ఒకటి కాగా.. అన్నింటికంటే ఈ మూవీపైనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ మేకింగ్ దగ్గర నుంచి క్యాస్టింగ్ వరకు అన్ని అంశాల ద్వారా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న రూమర్ వచ్చినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ‘కల్కి 2898 AD’లో కమల్ హాసన్ పాత్ర గురించి కూడా ఒక వార్త వైరల్ అవుతోంది.
సీక్రెట్..
‘కల్కి 2898 AD’లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు ఉన్నారు. అయితే ఈ మూవీలో అమితాబ్ బచ్చన్.. ఒక స్వామిజీ రూపంలో కనిపించనున్నట్టు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. కానీ ఇందులో కమల్ హాసన్ పాత్రపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ‘కల్కి 2898 AD’లో కమల్ అసలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయాన్ని ఇంకా సస్పెన్స్‌లోనే పెట్టారు మూవీ టీమ్. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ గురించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ పాత్ర అలాంటిదే..
‘కల్కి 2898 AD’లో తను గెస్ట్ రోల్ కాదని, కాస్త ఎక్కువ సమయం ఉండే పాత్రే అని ఇప్పటికే కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. దీంతో గెస్ట్ రోల్ కాదు, కాస్త ఎక్కువ నిడివి ఉన్న పాత్ర అని చెప్పగానే ఆయన స్క్రీన్‌పై ఎంతసేపు ఉండే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతలోనే ‘కల్కి 2898 AD’లో కమల్ హాసన్ క్యారెక్టర్ స్క్రీన్‌పై 12 నిమిషాలు ఉంటుందని, సినిమా కూడా ఆయన పాత్రతోనే ఎండ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి సీక్వెల్‌కు సంబంధించిన హింట్ కూడా కమల్ హాసన్ పాత్రతోనే కనెక్ట్ అయ్యి ఉంటుందని సమాచారం. ఇక ‘కల్కి 2898 AD’లో కమల్ పాత్రలో విలన్ షేడ్స్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.
ప్రమోషన్స్‌లో స్పీడ్..
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ ఇప్పటికే పలుమార్లు విడుదలను పోస్ట్‌పోన్ చేసుకుంది. ఫైనల్‌గా జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే ‘కల్కి 2898 AD’ గురించి క్లారిటీ ఇచ్చే ఒక యానిమేషన్ సిరీస్‌ను విడుదల చేశారు. అంతే కాకుండా జూన్ 10న ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలయిన ప్రతీ అప్డేట్.. ఫ్యాన్స్‌ను సంతోషపెడుతోంది. ప్రేక్షకుల అంచనాలు తగినట్టుగా ‘కల్కి 2898 AD’ను తెరకెక్కించారని నాగ్ అశ్విన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: ప్రభాస్, అనుష్కల పెళ్లిపై క్లారిటీ - కృష్ణంరాజుతో రెండో పెళ్లిపై శ్యామల దేవి ఆసక్తికర వ్యాఖ్యలు