Hebah Patel - Mario: రూటు మార్చిన హెబ్బా పటేల్... ఈసారి గ్లామర్ కాదు, కామెడీతో!
Hebah Patel Upcoming Movies: హెబ్బా పటేల్ అంటే గ్లామర్ గుర్తుకు వస్తుంది. కానీ, ఆవిడ ఈసారి రూటు మార్చింది. కామెడీతో హిట్టు కొట్టాలని ట్రై చేస్తోంది. అందులో 'మారియో' మొదటి మెట్టు అనుకోవాలి.

హెబ్బా పటేల్... టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్లలో ఒకరు. ఆవిడ పేరు చెబితే యూత్ అందరికీ ముందుగా 'కుమారి 21ఎఫ్' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా తెచ్చిన ఇమేజ్ అటువంటిది. దాని తర్వాత కూడా హెబ్బా పటేల్ గ్లామర్ రోల్స్ చేశారు. ఈ అందాల భామ ఇప్పుడు రూటు మారుస్తోంది. గ్లామర్ ఇమేజ్ దాటి కొత్త జానర్, కొత్త క్యారెక్టర్ సినిమాలు చేయాలని అనుకుంటోంది. అందుకు 'మారియో' మొదటి మెట్టు అనుకోవాలి.
హెబ్బా పటేల్ గ్లామర్ కాదు... కామెడీ హైలైట్!
'నాటకం', 'తీస్ మార్ ఖాన్' సినిమాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ తనకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'మారియో'. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ సంస్థల మీద రిజ్వాన్ నిర్మాతగా రూపొందుతోంది. ఇందులో అనిరుధ్ హీరో. అతనికి మొదటి సినిమా ఇది. అనిరుధ్ జోడీగా గ్లామరస్ హీరోయిన్ హెబ్బా పటేల్ యాక్ట్ చేస్తున్నారు.
సాధారణంగా హెబ్బా పటేల్ హీరోయిన్ అంటే గ్లామర్ హైలైట్ చేయాలని చూస్తారు. కానీ, 'మారియో' మేకర్స్ ఆ దిశగా వెళ్లడం లేదు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే... రోడ్డు మీద స్పీడుగా వెళుతున్న కారు, దాన్ని వెంబడిస్తున్న పోలీస్ కారు ఉన్నాయి. మరి, ఈ కథ ఏమిటో అందరికీ తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలని యూనిట్ చెబుతోంది. ఇదొక కామిక్ థ్రిల్లర్ అంటోంది.
Here it is! 🔥 The title is #MARIO—a crime thriller packed with comic twists and turns! ⚡
— Ramesh Bala (@rameshlaus) February 14, 2025
Get ready for a wild ride! 🎭🕵️@kalyankumarraja #MNbalreddy @ihebahp@ImSaiKartheek @Iamkalpika@yashnamuthuluri @RakenduMouliV #Madeemanepalli #Lathareddy@ibhargavt @Sairam79995490… pic.twitter.com/aozJ2qpdl2
'మారియో'కి ఫన్ రైడ్ అని క్యాప్షన్ ఇచ్చారు. హెబ్బా పటేల్ రోల్ కూడా గ్లామర్ కంటే కామెడీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుందట. ఆవిడ రోల్, డైలాగ్స్ అన్నీ మన తెలుగు ఆడియన్స్ అందరికీ కొత్తగా ఉంటాయని కళ్యాణ్ జీ గోగణ చెప్పారు.
నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ... ''ఇదొక కామిక్ థ్రిల్లర్. మా సినిమాకు సాయి కార్తీక్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఈ కథ రాయడంలో, మాటల్లో మా దర్శకుడు కళ్యాణ్ జీ గోగణకు రాకెందు మౌళి చక్కటి సహకారం అందించారు. ప్రస్తుతం కామెడీ, థ్రిల్ మిక్స్ అయిన సినిమాలకు ఆడియన్స్ ఆదరణ బావుంటోంది. అటువంటి కొత్త కంటెంట్ సినిమా ఇది. కళ్యాణ్ జీ గోగణ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా 'మారియో' తీస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలో మిగతా అన్ని వివరాలు అనౌన్స్ చేస్తాం'' అని చెప్పారు.
Mario Cast and Crew: అనిరుధ్, హెబ్బా పటేల్, రాకేందు మౌళి, మౌర్య సిద్దవరం, యష్ణ, కల్పిక, మదీ, లతా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: మదీ మన్నెపల్లి, ఛాయాగ్రహణం: ఎంఎన్ రెడ్డి, సంగీత దర్శకుడు: సాయి కార్తీక్,కథా రచన - మాటల సహకారం: రాకేందు మౌళి, నిర్మాణ సంస్థలు: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ - కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్, నిర్మాత: రిజ్వాన్, దర్శకుడు: కళ్యాణ్ జీ గోగణ.





















