Hari Hara Veera Mallu: వీరమల్లు... హరి హర వీరమల్లు... ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు - సాంగ్ చూశారా?
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ మూవీ నుంచి ‘ఎవరది ఎవరది’ అనే పవర్ ఫుల్ సాంగ్‌ని చిత్ర నిర్మాతలు వదిలారు. 5 భాషల్లో విడుదలైన ఈ పాట ఎలా ఉందంటే..

Hari Hara Veera Mallu Evaradi Evaradi Song Out: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా జూలై 24న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. రీసెంట్‌గా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాను చూసే కోణమే మారిపోయింది. అప్పటి వరకు నత్తనడకన నడిచిన ఈ చిత్ర బిజినెస్.. ట్రైలర్ విడుదల తర్వాత ఒక్కసారిగా ఊపందుకుంది. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు, ఇప్పటి వరకు ఆయన చేయని జానర్ కావడంతో ఈ సినిమాపై మాములుగా అంచనాలు లేవు. నిర్మాత ఎఎమ్ రత్నం కూడా.. సినిమాపై బీభత్సమైన హైప్‌ని పెంచుతూ వస్తున్నారు.
రీసెంట్‌గా జరిగిన ట్రైలర్ విడుదల వేడుకలో దర్శకుడు జ్యోతి కృష్ణ ఇచ్చిన ఎలివేషన్స్‌తో ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం వేచి చూసేలా చేయగలిగారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో చెప్పే సినిమా ఇది అవుతుందని, రికార్డులు బద్దలవుతాయని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్లుగానే ట్రైలర్ కూడా ఇప్పటి వరకు ఉన్న రికార్డులను తుడిచిపెట్టి హిస్టరీని క్రియేట్ చేసింది. ఆ దెబ్బతో ఫ్యాన్స్‌కు కూడా ఈ సినిమాపై భారీగా నమ్మకం ఏర్పడింది. ‘ఓజీ’ కంటే ముందే కొడుతున్నాం అంటూ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. ఇక జూలై 24లోపు సాధ్యమైనంతగా ఈ సినిమాను జనాల్లో ఉంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగానే ఈ సినిమాకు రెండు ప్రీ రిలీజ్ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారనేలా వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఒకటి వారణాసిలో, మరొకటి తిరుపతిలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం మేకర్స్ ‘ఎవరది ఎవరది’ అనే పవర్ ఫుల్ సాంగ్‌ని వదిలారు. ఈ సాంగ్ సినిమాపై మరింతగా హైప్ పెంచేస్తుంది. కొత్తగా విజువల్స్ ఏమీ చూపించలేదు కానీ, పాట లిరిక్స్ మాత్రం వినగానే ఎక్కేస్తున్నాయి.
‘‘ఎవరది ఎవరది.. అతగాడో పొడుపు కథ
దొరకనే దొరకడే.. అతగాడో మెరుపు కథ
సూర్యుడికే కన్నుగప్పి సంచరించే యోధుడు
చందురునే సంచికెత్తి తస్కరించే ధీరుడు
దోచుకునే విద్యలో అహో సిద్ధహస్తుడు.. దాచుకునే ధ్యాసలో మహాబద్ధకస్తుడు
పరుల కొరకే ప్రతి పైసా ఖర్చు పెట్టే చోరుడు
హరి హర వీరమల్లు.. హరి హర వీరమల్లు.. ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు
హరి హర వీరమల్లు.. హరి హర వీరమల్లు.. ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు’’ అంటూ రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన తూటాల్లా పదాలు పేలుతున్నాయి. ఈ తూటాలకు గన్ ఎవరో తెలుసుగా? ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి. ఆయన స్వరపరిచిన ఈ గీతం పవన్ కళ్యాణ్ పర్సనల్ వ్యక్తిత్వాన్ని కూడా చాటేలా ఉందంటే అతిశయోక్తి కానే కాదు. సాయి చరణ్ భాస్కరుని, హేమత్ మహమ్మద్, లోకేశ్వర్ ఈదర, పివిఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read: నయనతారకు కొత్త చిక్కులు... లీగల్ నోటీసులు పంపిన 'చంద్రముఖి' నిర్మాతలు... ఎందుకంటే?




















