అన్వేషించండి

Prasanth Varma: అనుపమ 'ఆక్టోపస్' రీ-షెడ్యూల్? 'హను-మాన్' డైరెక్టర్ నెక్స్ట్ మూవీ 'జై హనుమాన్' కాదా?

Prasanth Varma's Next: 'హనుమాన్' చిత్రంతో హిట్టు కొట్టిన ప్రశాంత్ వర్మ.. 'జై హనుమాన్' అనే సీక్వెల్ ను ప్రకటించారు. అయితే ఇప్పుడు దీని కంటే ముందు మరో మూవీతో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Prasanth Varma’s Next: టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కాన్సెప్ట్స్ తో కమర్షియల్ సినిమాలను రూపొందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. డెబ్యూ మూవీతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు.. కెరీర్ ప్రారంభం నుంచీ కొత్త తరహా సినిమాలనే తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఇటీవల 'హను-మాన్' చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి, బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాడు. దీంతో టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన సూపర్ హీరో మూవీ 'హనుమాన్' ఘన విజయం సాధించిన తర్వాత, దానికి సీక్వెల్ గా 'జై హనుమాన్' అనే చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పిన దర్శకుడు.. త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను కూడా రిలీజ్ చేస్తామని తెలిపారు. 2025లో రాబోతోందని ప్రకటించబడిన ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు దీని కంటే ముందు ప్రశాంత్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. 

'జై హనుమాన్' సినిమా కథంతా హనుమంతుడి చుట్టూ తిరుగుతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీంతో హనుమాన్ రోల్ లో ఏ హీరో నటిస్తారనే దాని గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ వర్మ ఇంకా ఏ నటీనటులను లాక్ చేయలేదట. ప్రస్తుతం క్యాస్టింగ్ ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న యువ దర్శకుడు.. ఈ గ్యాప్ లో అసంపూర్తిగా మిగిలిపోయిన 'ఆక్టోపస్' అనే సినిమాని కంప్లీట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. 

'ఆక్టోపస్' అనేది ప్రశాంత్ వర్మ చాలా కాలం క్రితమే సెట్స్ మీదకు తీసుకెళ్లిన ప్రాజెక్ట్. ఇందులో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వర కథానాయికగా నటిస్తోంది. గతంలో 65 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారని టాక్. అయితే ఇన్నాళ్లకు మళ్ళీ ఈ చిత్రాన్ని తిరిగి  సెట్స్ పైకి తీసుకొస్తున్నారట. 10 రోజులు షూటింగ్ చేస్తే సినిమా అంతా పూర్తవుతుందని, అందుకే హనుమాన్ దర్శకుడు ముందుగా ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ను ఫినిష్ చేయనున్నారని, దీని తర్వాత 'జై హనుమాన్'ను ప్రారంభిస్తారని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే, దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ వచ్చే వరకూ ఆగాల్సిందే. 

హీరో నాని నిర్మాణంలో వచ్చిన 'అ!' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ వర్మ.. 'కల్కి' సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించాడు. బాలనటుడిగా పేరు తెచ్చుకున్న తేజ సజ్జని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ, భారతదేశపు తొలి జాంబి మూవీగా 'జాంబీ రెడ్డి' తీసి హిట్టు కొట్టాడు. ఆ తర్వాత 'అద్భుతం' సినిమాకు అద్భుతమైన కథ అందించారు. ఇదే క్రమంలో తొలి తెలుగు సూపర్ హీరో సినిమాగా 'హను-మాన్' ను తెరకెక్కించి, పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. తేజ హీరోగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 300 కొట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ సంచలనం సృష్టిస్తోంది. 

ఇదిలా ఉంటే 'జై హనుమాన్' కంటే ముందు 'అధీరా' అనే మరో సూపర్ హీరో మూవీని ప్రకటించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో RRR నిర్మాత డీవీవీ దానయ్య తనయుడిని హీరోగా లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ ప్రాజెక్ట్ చేతులు మారిందని, ప్రశాంత్ వర్మ అందించిన కథని మరొక డైరెక్టర్ తెరక్కిస్తారని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు టాలెంటెడ్ దర్శకుడి నుంచి 'ఆక్టోపస్' మూవీ రానుందని అంటున్నారు. త్వరలోనే వీటన్నింటిపై స్పష్టత వస్తుందేమో చూడాలి.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్‌’ తెలుగు వెర్షన్‌ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Thiruppavi pasuralu: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
ధనుర్మాసం స్పెషల్: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
Embed widget