Hansika Motwani: భర్తకు దూరంగా స్టార్ హీరోయిన్ హన్సిక? - డివోర్స్ రూమర్స్‌పై క్లారిటీ ఇదే
Hansika Sohael: స్టార్ హీరోయిన్ హన్సిక తన భర్త సోహైల్‌తో డివోర్స్ తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ రూమర్స్‌ను సోహైల్ ఖండించినా... హన్సిక ఇప్పటివరకూ స్పందించలేదు.

Hansika Motwani Sohael Reacts On Divorce Rumours: ఇటీవల సెలబ్రిటీల డివోర్స్ రూమర్స్ ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువవుతోంది. స్టార్ హీరోయిన్ హన్సిక తన భర్త సోహైల్‌తో విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. నేషనల్ మీడియాలో ఈ మేరకు కథనాలు వచ్చాయి.
మూడేళ్ల వివాహ బంధం... క్యూట్ కపుల్
2022లో హన్సిక - సోహైల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లైన కొత్తలో హనీమూన్, వెకేషన్ టూర్స్ ఫోటోస్‍ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా వైరల్ అయ్యాయి. సో క్యూట్ కపుల్ అంటూ పేరొందారు. ప్రతి ఏటా పెళ్లి రోజున హన్సిక స్పెషల్ ఫోటోస్ కూడా షేర్ చేస్తారు. గతేడాది డిసెంబర్‌లోనూ మ్యారేజ్ మెమొరీస్‌ను పంచుకున్నారు. అయితే, ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని... ఇద్దరూ విడివిడిగా ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది.
విడివిడిగా...
హన్సిక తన తల్లితో ఉంటే సోహైల్ తన పేరెంట్స్‌తో ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. అప్పట్లో తన భర్తతో కలిసి ఉండే బెస్ట్ మూమెంట్స్ ఫోటోస్‍ను షేర్ చేసుకునే హన్సిక ఇటీవల సింగిల్‌గా ఉన్న ఫోటోస్ మాత్రమే పంచుకుంటోంది. దీంతో ఇద్దరూ విడివిడిగా ఉన్నారనే వార్తలకు బలం చేకూరినట్లవుతోంది.
సోహైల్ రియాక్షన్
డివోర్స్ రూమర్స్‌పై సోహైల్ రియాక్ట్ అయ్యారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కానీ... వేర్వేరుగా ఎందుకు ఉంటున్నారు? అన్న దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు, హన్సిక ఇప్పటివరకూ ఈ రూమర్స్‌పై స్పందించలేదు. తన భర్తకు దూరంగా ఉంటున్నారా? వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే దానిపై రియాక్ట్ కావాల్సి ఉంది.
Also Read: నగలతో మోహన్ లాల్ డ్యాన్స్ - క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అంటూ నెటిజన్స్... యాడ్ వీడియో వైరల్
తన అందం, యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను మెప్పించి తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు హన్సిక. 'దేశముదురు' మూవీతో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల సరసన నటించారు. మూడేళ్ల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతురియాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తన భర్తతో ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటూ ఫోటోస్‌ను షేర్ చేసుకుంటుండే వారు. బర్త్ డే, వెకేషన్ ట్రిప్స్, బెస్ట్ మూమెంట్స్ అంటూ ఇన్ స్టా వేదికగా ఫోటోస్ పంచుకునేవారు. గత కొంతకాలంగా ఆమె సింగిల్‌గా ఉన్న ఫోటోస్ మాత్రమే షేర్ చేస్తుండడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది.
సోహైల్‌కు రెండో పెళ్లి
సోహైల్ తన చిన్ననాటి స్నేహితురాలు రింకీ బజాజ్‌ను ముందు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి హన్సిక కూడా హాజరయ్యారు. అయితే, పెళ్లైన కొన్ని రోజులకే మనస్పర్థలు వచ్చి ఆమెతో డివోర్స్ తీసుకున్నారు సోహైల్. ఆ తర్వాత తన మనసుకు సోహైల్ నచ్చడంతో ఆయన్ను వివాహం చేసుకున్నారు హన్సిక. జైపూర్‌లో జరిగిన పెళ్లి విశేషాలను 'లవ్ షాదీ డ్రామా' పేరిట ఓటీటీలో రిలీజ్ చేసిన ఆమె... సోహైల్ గతం గురించి తనకు తెలుసని... విడాకులతో తనకు సంబంధం లేదంటూ ఎమోషన్ అయ్యారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. ప్రస్తుతం సోహైల్‌తో హన్సిక విడాకులు అంటూ రూమర్స్ హాట్ టాపిక్‌గా మారగా ఆమెనే స్వయంగా స్పందించాల్సి ఉంది.






















