News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Guntur Karam Movie : సంక్రాంతికే 'గుంటూరు కారం' - డౌట్స్‌కు చెక్ పెట్టిన మహేష్ ప్రొడ్యూసర్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'గుంటూరు కారం' సంక్రాంతికి వస్తుందా? లేదా? అని ప్రేక్షకుల్లో సందేహాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మహేష్ అభిమానుల్లో! వాటికి నిర్మాత నాగవంశీ చెక్ పెట్టారు!

FOLLOW US: 
Share:

'ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు' - 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటుడు ప్రకాష్ రాజ్ డైలాగ్ ఇది. ఆ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మంచి హిట్ అందుకున్నారు. ఆ చిత్రానికి ముందు సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. పెద్ద పండక్కి ఆయన ట్రాక్ రికార్డ్ బావుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి 'గుంటూరు కారం' (Guntur Karam Movie) సినిమాతో ఆయన రానున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే... 

సంక్రాంతికి మహేష్ సినిమా విడుదల అవుతుందా?
'గుంటూరు కారం' సినిమా విడుదల సంక్రాంతికి అని అనౌన్స్ చేశారు. కానీ, మహేష్ ఫ్యాన్స్ అందరూ కూడా గత కొన్నాళ్లుగా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. వై? ఎందుకు? అంటే... 'గుంటూరు కారం' టీం నుంచి ఎలాంటి అప్డేటూ ఉండటం లేదు కాబట్టి! పైగా, కథ మారిందని పుకార్లకు తోడు హీరోయిన్ పూజా హెగ్డే బదులు మీనాక్షి చౌదరిని ఎంపిక చేయడం వంటి విషయాల వలన సినిమా సంక్రాంతికి రాదనే రూమర్స్ విని చాలా మంది బాధపడే ఉంటారు. 

పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన నిర్మాత నాగవంశీ!
'గుంటూరు కారం' సినిమా చుట్టూ గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న రూమర్లకు, పుకార్లకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఒక్కసారిగా చెక్ పెట్టేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'గుంటూరు కారం' రెండు వందల శాతం సంక్రాంతికే వస్తుందని తేల్చి చెప్పేశారు. అక్టోబర్ 20వ తేదీకి టాకీ పోర్షన్ షూటింగ్ పూర్తి అవుతుందని, అప్పటికి ఇంకో నాలుగు సాంగ్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుందని ఆయన వివరించారు. 

రికార్డు రేటుకు నైజాం రేట్స్ కొన్న 'దిల్' రాజు
'గుంటూరు కారం' సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 'దిల్' రాజు రికార్డు రేటుకు కొన్నారని, నాన్ రాజమౌళి సినిమాల్లో ఇదే హయ్యస్ట్ బిజినెస్ అని నాగవంశీ చెప్పారు. అలాగే సినిమా నుంచి ఫస్ట్ పాటను 99 శాతం దసరాకు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. మహేష్ బాబును ఈ మధ్య కాలంలో చూడనంత ఎనర్జిటిక్ పాత్రలో అభిమానులు చూస్తారని సినిమాపై హైప్ మరింత పెంచారు. 

తమన్... పూజా హెగ్డే... క్లారిటీ!
'గుంటూరు కారం' నుంచి నుంచి సంగీత దర్శకుడిగా తమన్ బదులు మరొకరిని తీసుకుంటారని, అతడిని తీసేయాలని బలంగా పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే. వాటిపై కూడా నాగవంశీ వివరణ ఇచ్చారు. తమన్ ను తీసేయాలని ఎప్పుడూ అనుకోలేదని, మరోవైపు పూజా హెగ్డే డేట్స్ బాలీవుడ్ సినిమాతో క్లాష్ అవడం వల్లే తప్పుకోవాల్సి వచ్చిందని నాగవంశీ వివరించారు.

Also Read : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) 'గుంటూరు కారం' ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. 

Also Read : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 03 Oct 2023 08:46 AM (IST) Tags: Mahesh Babu Trivikram Guntur Karam Movie Latest Telugu News Sankranti 2024 Movies

ఇవి కూడా చూడండి

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా

Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా

Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!

Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!

రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’ - నేటి టాప్ సినీ విశేషాలివే!

రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’  - నేటి టాప్ సినీ విశేషాలివే!

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

టాప్ స్టోరీస్

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
×