Samantha - Gulshan Devaiah: సమంతకు జంటగా 'కాంతార' నటుడు... బాలీవుడ్ నటుడితో పెళ్లి తర్వాత తొలి సినిమా!
Maa Inti Bangaram: రాజ్ నిడిమోరుతో పెళ్లికి ముందు 'మా ఇంటి బంగారం' స్టార్ట్ చేశారు సమంత. పెళ్లి తర్వాత విడుదలయ్యే ఆమె మొదటి సినిమా ఇది. ఇందులో 'కాంతార' నటుడు మెయిన్ లీడ్ చేస్తున్నట్టు తెలిసింది.

Samantha first movie after marriage with Raj Nidimoru: రాజ్ నిడిమోరుతో పెళ్ళికి ముందు 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని పూజతో ప్రారంభించారు సమంత. వివాహం తర్వాత విడుదలయ్యే ఆమె మొదటి సినిమా ఇది. ఇందులో హీరోగా ఎవరు నటిస్తున్నారో తెలుసా? సమంతకు జంటగా నటిస్తున్నది ఎవరు? అంటే...
సమంతకు జంటగా 'కాంతార' నటుడు!
Gulshan Devaiah Telugu Debut With Maa Inti Bangaram: రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కాంతార: ఏ లెజెండ్ - ఛాప్టర్ 1' గుర్తు ఉందా? అందులో జయరామ్ కుమారుడిగా, హీరోయిన్ రుక్మిణీ వసంత్ సోదరుడిగా నటించిన వ్యక్తి గుర్తు ఉన్నారా? అతని పేరు గుల్షన్ దేవయ్య.
గుల్షన్ దేవయ్య హిందీ నటుడు. హిందీలో కొన్ని సినిమాలు చేశారు. 'కాంతార - ఏ లెజెండ్ - ఛాప్టర్ 1'తో కన్నడ చిత్రసీమలో అడుగు పెట్టారు. అతని ఫస్ట్ సౌత్ ఫిల్మ్ అది. ఇప్పుడు సమంత 'మా ఇంటి బంగారం'తో తెలుగు చిత్రసీమకు గుల్షన్ దేవయ్య పరిచయం అవుతున్నారు. సమంతకు జంటగా ఆయన నటిస్తున్నట్లు టాక్. అయితే ఆ సంగతి కన్ఫర్మ్ చేయలేదు. కానీ, సమంతతో సినిమా చేస్తున్నట్లు తెలిపారు.
'మా ఇంటి బంగారం' గురించి గుల్షన్ దేవయ్య మాట్లాడుతూ... ''సమంతతో నటించే అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అటువంటి సమయంలో 'మా ఇంటి బంగారం' వచ్చింది. ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నా రోల్ గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను'' అని తెలిపారు. 'మల్లేశం' దర్శకుడు రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన హిందీ సినిమా '8ఏఎం మెట్రో'లోనూ గుల్షన్ దేవయ్య నటించారు.
'మా ఇంటి బంగారం' సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకం మీద సినిమా రూపొందుతోంది. సమంత సొంత ప్రొడక్షన్ హౌస్ ఇది. ఇందులో దిగంత్, సీనియర్ నటి గౌతమి, మంజూషా ఇతర ప్రధాన తారాగణం.





















