అన్వేషించండి

Genelia Birthday: రితేష్‌తో జెనీలియా ప్రేమ ఎలా మొదలైందో తెలుసా? - అచ్చం తమ తొలి మూవీ స్టోరీనే.. వీరి ప్రేమకథ..!

Happy Birthday Genelia: అంతేనా..  వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ అంటూ ప్రేక్షకుల మదిలో నిలిచింది జెనీలియా. నేడు ఈ క్యూట్‌ హీరోయిన్‌ పుట్టిన రోజు.

Genelia Birthday Special: హా..హా.. హాసిని అంటూ కుర్రకారు గుండెల్లో గూడుకట్టుకుంది హీరోయిన్‌ జెనీలియా. ఆమె ఇండస్ట్రీకి దూరమైన దాదాపు 12 ఏళ్లు అవుతుంది. కానీ ఇప్పిటికీ ప్రేక్షకుల్లో ఆమె క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. బొమ్మరిల్లు ఆమె పోషించిన హాసిని పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. ఈ సినిమాలో ఆమె చేసిన అల్లరి చేష్టలు, క్యూట్‌ క్యూట్‌ డైలాగ్స్‌తో ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. గర్ల్‌ఫ్రెండ్‌ అలా ఉండాలంటూ కుర్రాకరు ఇప్పటికి 'బొమ్మరిల్లు' హాసిని తలుచుకుంటూ ఉంటారు. అంతగా తన నటన, స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది జెన్నీ.

ఇది మాత్రమే కాదు 'రెడీ' సినిమాలోనూ పూజాగా సీరియస్‌ రోల్లో మెప్పించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోయే ప్రత్యేకమైన పాత్రలు చేసింది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌, రామ్‌ చరణ్‌ వంటి స్టార్స్‌ నటించి అతితక్కువ టైంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. నేడు ఈ హాసిని పుట్టిన రోజు. ఆగష్టు 5న జెనీలియా బర్త్‌డే సందర్భంగా ఆమె పర్సనల్‌, ప్రొఫెషనల్‌ లైప్‌పై ఓ లుక్కేద్దాం. 

బాయ్స్ తో పరిచయం.. సత్యంతో ఎంట్రీ

'అంతేనా.. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ' హీరో సిద్దార్థ్‌ గుండెల్లో గంట కొట్టిన ఈ హాసిని.. ఇండస్ట్రీకీ దూరమైన దాదాపు 12 ఏళ్లపైనే అవుతుంది. కానీ ఇప్పటికే హా.. హా హాసిని ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఆగష్టు 5, 1987లో ముంబైకి చెందిన క్రిస్టియన్‌ ఫ్యామిలీలో జన్మించింది జెనీలియా. తమిళ డబ్బింగ్‌ మూవీ 'బాయ్స్‌' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. కానీ నేరుగు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది మాత్రం సుమంత్‌ 'సత్యం' మూవీతోనే. నిజానికి బాలీవుడ్‌ 'తుజే మేరీ కసమ్‌' జన్నీ సినీరంగ ప్రవేశం చేసింది. రితేష్‌ దేశ్‌ముఖ్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

'తుజే మేరీ కసమ్‌' సినీరంగ ప్రవేశం

'నువ్వే కావాలి' సినిమాకు ఇది రీమేక్‌ జోడి కానీ, ఆమె సౌత్‌లోనే వరుస సినిమాలు చేసి ఇక్కడ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కెరీర్‌ ఫుల్‌ స్వీంగ్‌లో ఉండగానే రితేశ్‌ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుపెట్టింది. తమ తొలి సినిమాతో ప్రేమలో పడ్డ వీరు తొమ్మిదేళ్ల పాటు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.  2012 ఫిబ్రవరి 3న వీరిద్దరు వివాహ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు. అయితే తన తొలి సినిమా షూటింగ్‌ టైంలో రితేష్‌ దేశ్‌ముఖ్‌కి దూరంగా ఉండేదాన్ని జెన్నీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

రితేశ్ తో పరిచయం ఇలా

తన ప్రేమ గురించి చెబుతూ.. రితేశ్ ఓ సీఎం కుమారుడు కావడంతో అతని స్వభావం కూడా రాజకీయ నాయకుల మాదిరిగానే ఉంటుందనుకునేదాన్నని, దాంతో సెట్‌లో రితేశ్‏తో మాట్లాడటానికి ఆసక్తి చూపించేదాన్ని కాదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.  కానీ తను అనుకున్న దానికి భిన్నంగా రితేశ్ సెట్‏లో అందరితో కలిసిపోయి, అల్లరిగా ఉండేవాడు. తనని అలా చూసి షాక్‌ అయ్యానని, ఇక ఆ తర్వాత తమ మధ్య మాటలు కలిశాయని తెలిపింది. అది కాస్తా స్నేహం మారింది. అయితే మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరిగింది. మూవీ షూటింగ్‌ పూర్తి కాగానే రితేశ్‌ ముంబై వెళ్లిపోయాడు.. తాను ఇక్కడే సినిమాలు చేసుకుంటూ బిజీగ ఉండేదాన్ని అని చెప్పింది.

డెబ్యూ మూవీతో రితేశ్ తో జోడీ

అప్పుడు రితేష్‌ని చాలా మిస్‌ అవుతున్నా ఫీలింగ్‌ వచ్చిందని చెప్పింది. కానీ, అలాంటి ఫీలింగ్‌ రితేష్‌కు ఉందో లేదో తెలియదు. అందుకే అతడితో మాట్లాడేందుకు సాహసించలేదు. కానీ రితేష్‌ ఒకసారి ఫోన్‌ చేసి తనని మిస్‌ అవుతున్నట్టు చెప్పాడని, అలా తాను కూడా తన ప్రేమని భయపెట్టానని అని తెలిపింది. అలా తొమ్మిదేళ్లు ఇద్దరు సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్నామని, మొదట తమ పెళ్లికి పెద్దలు నిరాకరించిన ఆ తర్వాత ఒప్పుకోవడంతో భార్యభర్తలం అయ్యామని పేర్కొంది. అలా తమ తొలి సినిమా 'తుజే మేరీ కసమ్‌' సినిమాలాగే దూరంగా అయ్యాక తమ ప్రేమ బయటపెడ్డిందంటూ జెన్సీ చెప్పుకొచ్చింది.  

Also Read: 'తంగలాన్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్‌ సుమకు షాక్‌ - స్టేజ్‌పైనే కిస్‌ ఇచ్చిన నటుడు, అవాక్కైన యాంకర్

టాప్ హెడ్ లైన్స్

Vadhandhi 2 Series Trailer : మృగాన్ని మించిపోయేలా బ్రూటల్ మర్డర్స్ - అసలు నిందితుడు ఎవరు?... ఓటీటీలోకి అవెయిటెడ్ థ్రిల్లర్ సిరీస్
మృగాన్ని మించిపోయేలా బ్రూటల్ మర్డర్స్ - అసలు నిందితుడు ఎవరు?... ఓటీటీలోకి అవెయిటెడ్ థ్రిల్లర్ సిరీస్
Rashmika : రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget