Gargi Movie - Sai Pallavi: ఆడపిల్లను కదా, నన్ను నమ్మవు! - 'గార్గి' ఫస్ట్ లుక్‌తో సర్‌ప్రైజ్ చేసిన సాయి పల్లవి
సాయి పల్లవి ప్రధాన పాత్రలో 'గార్గి' సినిమా రూపొందుతోంది. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
సాయి పల్లవి కొత్త సినిమాలు అంగీకరించడం లేదని పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందని ప్రశ్నలు వినిపించాయి. అన్నిటికీ ఒక్క ఫస్ట్ లుక్‌తో సమాధానం లభించింది. ఒక మేకింగ్ వీడియోతో క్లారిటీ వచ్చేసింది.
సాయి పల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'గార్గి' (Gargi Movie). గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సాయి పల్లవి పుట్టినరోజు (Sai Pallavi Birthday) సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ (Sai Pallavi First Look In Gargi Movie) విడుదల చేశారు. అలాగే, మేకింగ్ వీడియో కూడా! తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రూపొందుతోంది.
చక్కటి చీర కట్టు... భుజాన ఒక బ్యాగ్... వెనుక న్యాయదేవత... 'గార్గి' ఫస్ట్ లుక్, అందులో సాయి పల్లవిని చూస్తే మహిళా ప్రాధాన్య చిత్రమని అర్థం అవుతోంది. మేకింగ్ వీడియోలో 'నువ్వు టైమ్, రాత, విధి... అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ, నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే... నేను మగపిల్లాడిని కాదుగా, ఆడపిల్లను' అని సాయి పల్లవి డైలాగ్ చెప్పడం చూస్తుంటే... న్యాయం కోసం ఓ మహిళ చేసిన పోరాటాన్ని చుపిస్తున్నారేమో అనిపిస్తోంది!? కన్నడ డబ్బింగ్ చెప్పడం కోసం సాయి పల్లవి పడిన కష్టాన్ని కూడా మేకింగ్ వీడియోలో చూపించారు.
Also Read: సాయి పల్లవికి పేరు తీసుకొచ్చిన క్యారెక్టర్లు
''ఈ సినిమా గురించి మాట్లాడటం కోసం కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ, నా పుట్టినరోజు నాడు 'గార్గి' గ్లింప్స్ విడుదల చేయాలని టీమ్ డిసైడ్ చేసింది'' అని సాయి పల్లవి పేర్కొన్నారు.
Also Read: వెంకీకి రేచీకటి, వరుణ్‌కు నత్తి - ఎక్స్‌ట్రాడినరీ ఫన్‌తో 'ఎఫ్ 3' ట్రైలర్
View this post on Instagram