Allu Arjun: ఫేస్ చూసుకోమని కామెంట్ చేశారు... కట్ చేస్తే నేషనల్ అవార్డు కొట్టాడు!
Allu Arjun Birthday Special: స్టైల్‌కు చిరునామాగా, ఫ్యాన్స్‌కు 'ఐకాన్ స్టార్'గా ఎదిగిన బన్నీ కెరీర్ స్టార్టింగ్‌లో విమర్శలు ఎదుర్కొన్నారు. కట్ చేస్తే నేషనల్ అవార్డు తెచ్చిన తొలి తెలుగు హీరోగా ఎదిగాడు.
తొమ్మిది దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తొలి కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun). మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ హీరోలు ఉన్నారు. అయితే, స్టైల్ అంటే చిరునామాగా మారిన హీరో బన్నీ. ఇప్పుడు అభిమానులు ఆయన్ను ముద్దుగా 'ఐకాన్ స్టార్' అని పిలుస్తున్నారు. కానీ, ఆ పిలుపు వెనుక పడిన కష్టం ఎంతో ఉంది. ఫేస్ చూసుకోమని కామెంట్ చేసిన హేటర్స్ చేత క్లాప్స్ కొట్టించిన కథానాయకుడు బన్నీ.
కెరీర్ ప్రారంభంలో విమర్శలు ఎన్నో!
అల్లు రామలింగయ్య మనవడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్ మేనల్లుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి అల్లు అర్జున్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అతడి మొదటి 'గంగోత్రి' సూపర్ హిట్ అయ్యింది. కానీ, అతడి లుక్స్ బాగా ట్రోల్ అయ్యాయి. ఫేస్ అలా ఉందేంటని కామెంట్ చేశారు హేటర్స్. ఆ సినిమా చేసినప్పుడు బన్నీ ఏజ్ 21. విమర్శలకు అతడు కుంగిపోలేదు. సినిమా సినిమాకు తనను తాను మార్చుకున్నాడు.
డ్యాన్స్, ఫైట్స్, డ్రస్... ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. కేవలం నటనతో మాత్రమే కాకుండా సంథింగ్ స్పెషల్ ప్రేక్షకులకు ఇవ్వడానికి ట్రై చేశాడు. సూపర్ సక్సెస్ అయ్యాడు. 'గంగోత్రి' తర్వాత 'ఆర్య', 'బన్నీ', 'హ్యాపీ'... చేసిన ప్రతి సినిమా సక్సెస్. 'ఆర్య'లో డ్యాన్సులు, 'బన్నీ'లో ఫైట్లు, 'హ్యాపీ'లో డ్రస్సింగ్ స్టైల్... టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. అయితే, అల్లు అర్జున్ అసలు మేకోవర్ 'దేశముదురు'తో మొదలైందని చెప్పాలి.
'దేశముదురు'తో రూటు మార్చిన బన్నీ
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బన్నీ చేసిన మొదటి సినిమా 'దేశముదురు'. పూరితో ఏ సినిమా హీరో చేసినా సరే ఆయన స్టైల్‌లోకి వెళతారు. బట్, బన్నీ రూటులోకి పూరి వచ్చారనేలా 'దేశముదురు' ఉంటుంది. ఆ సినిమాతో బన్నీ రూటు కూడా మారింది. హెయిర్ పెంచారు, డ్రస్సింగ్ స్టైల్‌కు మరింత సొగసు అద్దారు. డైలాగ్ డెలివరీలో ఛేంజ్ చూపించారు. స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్ అన్నట్లు కనిపించారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్. అయితే, తర్వాత వచ్చిన 'పరుగు' ఆశించిన విజయం సాధించలేదు. కానీ, సాధారణ యువకుడిగా బన్నీ నటనకు పేరు వచ్చింది.
Also Read: నాగ చైతన్య, అల్లు అరవింద్ సేఫ్ - కర్మ అనేది వదిలి పెట్టదురా పెట్ల!
క్యారెక్టర్ క్యారెక్టర్‌కు వేరియేషన్ చూపించిన బన్నీ!
'ఆర్య 2', 'వరుడు', 'వేదం', 'బద్రీనాథ్'... ప్రతి సినిమాకు, క్యారెక్టర్ క్యారెక్టర్‌కు బన్నీ వేరియేషన్ చూపించారు. 'వరుడు' ఫ్లాప్ కావచ్చు. కానీ,అతడు ఆ క్యారెక్టర్ చేసిన తీరు బావుంటుంది. నటుడిగా బన్నీ ప్రయాణంలో ఆ నాలుగు సినిమాలూ చాలా స్పెషల్. వేరియేషన్స్ పరంగా పేరు వచ్చింది.
'జులాయి'తో అల్లు అర్జున్ కమర్షియల్ జోన్‌లో మరింత ఎదిగారు. 'రేసు గుర్రం' టు 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సరైనోడు', 'డీజే' వరకు వరుస విజయాలు సొంతం అయ్యాయి. ఒక వైపు కమర్షియల్ కథానాయకుడిగా కంటిన్యూ అవుతూ మధ్యలో 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్ చేసి క్లాప్స్ కొట్టించుకున్నాడు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'కు కమర్షియల్ సక్సెస్ రాలేదు. కానీ, అతడి ఎఫర్ట్స్ అల్టిమేట్. లుక్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు కొత్త బన్నీ స్క్రీన్ మీద కనిపించాడు. 'అల వైకుంఠపురములో' గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ యాక్టర్ కనిపించాడు. 'పుష్ప'తో తెలుగు సినిమాకు నేషనల్ అవార్డు తెచ్చాడు.
Also Read: ఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?
బన్నీ సక్సెస్ ఒక్క రోజులో వచ్చింది కాదు. నటన పరంగా, స్టైల్ పరంగా, డ్యాన్సుల పరంగా ప్రతి సినిమాకు తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి కష్టపడ్డాడు. ఇంకా కష్టపడుతూ ఉన్నాడు. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకంగా పేరు తెచ్చుకున్నాడు. తన గురించి కామెంట్ చేసిన వారు ఇప్పుడు తనను ఫాలో అయ్యేలా చేశాడు. దటీజ్ బన్నీ.
Also Read: 'టిల్లు స్క్వేర్' సక్సెస్, గ్లామర్ రోల్ తర్వాత స్ట్రాటజీ మార్చిన అనుపమ - బ్యాక్ టు కేరళ!