అన్వేషించండి

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

మలయాళం ఇండస్ట్రీలో ఇటీవల విడుదలై సంచలన విషయాన్ని అందుకున్న '2018' మూవీ జూన్ 7 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే అదే రోజు కేరళలోని థియేటర్ ఓనర్స్ నిరసనకు పిలుపునిచ్చారు.

'2018'. రీసెంట్ టైమ్స్ లో మలయాళ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన సినిమా ఇది. 2018వ సంవత్సరంలో కేరళలో వచ్చిన భారీ వరదల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వరదల వల్ల ఎంత నష్టం జరిగింది అనే తదితర అంశాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు మేకర్స్. జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మలయాళ అగ్ర హీరో థామస్ ప్రధాన పాత్రలో నటించగా. కుంచకు బోబన్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి ఇతర కీలకపాత్రలు పోషించారు. మే 5న ఓ చిన్న సినిమాగా మలయాళం లో విడుదలైన మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం విడుదలైన 17 రోజుల్లోనే రూ.138 కోట్లు రాబట్టి మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత మలయాళం లో పెద్ద హిట్ అవ్వడంతో ఇతర భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

ఈ క్రమంలోనే మే 26న '2018' మూవీ తెలుగులో కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తెలుగులో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత బన్నీవాస్ రిలీజ్ చేయగా తెలుగు ఆడియన్స్ ని సైతం ఈ మూవీ విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో తెలుగులోను ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని అందుకోవడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ కి బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ జూన్ 7వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ సోనీ లీవ్ లో 2018 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీలో జూన్ 7 నుంచి సోనీ లీవ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అప్సెట్ అయిన థియేటర్ ఓనర్స్ ఇప్పుడు ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం థియేటర్స్ లో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా కలెక్షన్స్ ని సంపాదిస్తున్న 2018 సినిమాను ఓటీటీ లో అప్పుడే ప్రసారం చేయకూడదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.

అలా చేస్తే తాము నష్టపోతామని జూన్ 7వ తేదీన నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తాజాగా ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ(FEUOK) జూన్ 7, 8 తేదీల్లో థియేటర్స్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 2018 సినిమాని ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తున్న సందర్భంగా ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEUOK) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమా విడుదలైన 42 రోజుల తర్వాతే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని కేరళ అసోసియేషన్ థియేటర్ ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 7, 8 బుధ, గురు వారాల్లో తమ నిరసనను తెలియజేస్తూ థియేటర్స్ ని మూసేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త కాస్త మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు మూవీ టీం స్పందించలేదు. మరి దీనిపై మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Also Read: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లైవ్ - బోరున వర్షం, అయినా వెనక్కి తగ్గని అభిమానులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
More Drink Less Kick : ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Embed widget