Happy Birthday Fahadh Faasil: షెకావత్ సార్ కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, ‘పుష్స 2‘ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
Pushpa 2: ఫహాద్ ఫాజిల్ కు ‘పుష్ప 2‘ మేకర్స్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. లుంగీ కట్టుకుని, ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో రివాల్వర్ తో ఆకట్టుకున్నారు.

First Look Of Fahadh Faasil From Pushpa 2: దేశ వ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప 2‘. ఆగష్టు 15న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా, షూటింగ్ లో జాప్యం కారణంగా వాయిదా పడింది. డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కనీవినీ యాక్షన్ సీన్లను షూట్ చేస్తున్నట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
షెకావత్ సార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ నటుడు ఫహాద్ ఫాజిల్ బర్త్ డే కావడంతో ‘పుష్ప 2‘ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేశఆరు. ‘పుష్ప’ సినిమాలో పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్ అదిరిపోయే నటనతో అలరించారు. ‘పుష్ప 2’లో ఆయన క్యారెక్టర్ మరింత పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంలో షెకావత్ సార్ పాత్ర ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారట. ఇవాళ (ఆగష్టు 8) ఆయన బర్త్ డే కావడంతో ‘పుష్ప 2’ నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఊరమాస్ పోలీస్ లుక్ లో ఆకట్టుకున్నారు. పైనా పోలీస్ చొక్కా, కింద లుండీ, ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో రివాల్వర్ పట్టుకుని కనిపించారు. కలప స్మగ్లర్లను వేటాడుతున్నట్లు అర్థం అవుతోంది. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ అవమానానికి ఈ చిత్రంలో ఆయన గట్టిగా ప్రతీకారం తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆయన మాస్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.
View this post on Instagram
డిసెంబర్ 6న ‘పుష్ప 2‘ విడుదల
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ‘పుష్ప 1’ కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకోవడంతో ‘పుష్ప 2’పై ఓ రేంజిలో హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 2021 డిసెంబర్ 17న ‘పుష్ప’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, మూడు సంవత్సరాల తర్వాత 2024 డిసెంబర్ 6న ‘పుష్ప 2’ విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Also Read: కేజీఎఫ్2 విడుదలైన 847 రోజులకు... కొత్త సినిమా టాక్సిక్ షూట్ స్టార్ట్ చేసిన రాకింగ్ స్టార్ యశ్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

