Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో మహేష్ బాబు, సూర్య? ప్రభాస్ మూవీలోని ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
ప్రస్తుతం దేశవ్యాప్త ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రస్టింగ్ హిడెన్ డీటెయిల్స్ ను ఇక్కడ సూచించాము. ఓ లుక్ వేసేయండి.
Kalki 2898 AD: ఇండియాలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ సినిమాలలో ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. మొన్నటి వరకూ ‘ప్రాజెక్ట్ కె’ అని పిలుచుకున్న ఈ మూవీకు ఇటీవలే అమెరికాలో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్ లో ఒరిజినల్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ మూవీకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకోణ్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొన్నటి వరకూ మూవీపై ఉన్న ఊహాగానాలు అన్నీ ఒక్క గ్లింప్స్ వీడియోతో తీరిపోయాయనే చెప్పాలి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సన్నివేశాలతో హిందూ పురాణాల స్పూర్తితో తెరకెక్కించిన ఒక అద్భుతమైన విజువల్ వండర్ అని గ్లింప్స్ వీడియో చూస్తూ అర్థమవుతుంది. అయితే రీసెంట్ గా విడుదల అయిన గ్లింప్స్ వీడియోలో సినిమా గురించి, దాని కథ గురించి తెలియజేసే డీటెయిల్స్ చాాలా ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి.
1. అద్భుతమైన తారాగణం
నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో భారీ తారాగణాన్ని తీసుకున్నారు. ప్రభాస్, దీపికా పదుకోణ్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు ఈ మూవీ ఫ్రదాన పాత్రలుగా కనిపించనున్నారు.
2. కథ
‘కల్కి 2898 ఏడీ’ సినిమా టైటిల్ లోనే ఇది ఒక మైథలాజికల్ ఫిల్మ్ అని తెలుస్తుంది. వివిధ యుగాల్లో దుష్టశిక్షణ కోసం శ్రీ మహా విష్ణువు అనేక అవతారాలు ఎత్తుతాడని, అందులో భాగంగానే కలియుగం అంతంలో కల్కిగా అవతారంగా కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ‘కల్కి 2898 ఏడీ’ తెరకెక్కిందని తెలుస్తోంది. ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినపుడు ప్రభాస్ ప్రపంచాన్ని కాపాడే ఆశాకిరణం కల్కి లా వస్తాడని గ్లింప్స్ వీడియోలో చూపించారు. ప్రపంచాన్ని జయించడానికి ఆధునిక ఆయుధాలను సంపాదించుకోవాలని దుష్టశక్తులు ప్రయత్నిస్తుంటాయి. వారిని కల్కి ఎలా అడ్డుకుంటున్నాడన్నది ఈ మూవీ కథ అని సమాచారం.
3. ఊహించని అతిథులు..
ఈ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ప్రస్తుతం ఉన్న నటీనటులే కాకుండా మరికొంత మంది స్టార్ నటులు మూవీలో అతిథి పాత్రల్లో ప్రత్యక్షమవుతారని తెలుస్తోంది. వాళ్లలో మహేష్ బాబు, సూర్య, దుల్కర్ సల్మాన్ స్టార్ నటులు ఇందులో కనిపించనున్నారని సమాచారం. అయితే, ఇది నేషనల్ మీడియాలో వస్తోన్న రూమర్. దీన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
4. భారీ బడ్టెట్.
‘కల్కి 2898 ఏడీ’ మూవీను అత్యాధునిక టెక్నాలజీ, గ్రాఫిక్స్ ను ఉపయోగించి తెరకెక్కించారు. ఈ మూవీ నిర్మాణానికి సుమారు రూ.600 కోట్ల వరకూ ఖర్చు అయిందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ భారత దేశంలో తెరకెక్కిన అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఇది కూడా ఒకటి అని టాక్.
5. ప్రభాస్ రెమ్యునరేషన్
ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మూవీలో నటించిన నటీనటులకు కూడా భారీ స్థాయిలోనే పారితోషికాలు ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ మూవీ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ.150 కోట్లు తీసుకున్నాడని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
6. మెయిన్ విలన్
ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కమల్ హాసన్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఇదే విషయంపై అమెరికాలో జరిగిన ఈవెంట్ కమల్ ప్రస్తావించారు కూడా. ఈ మూవీలో ఆయన నటించినందుకు గానూ రూ.40 కోట్లు తీసుకున్నారని సమాచారం.
7. ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ మీనింగ్..
హిందూ పురాణాల్లో మహా విష్ణువు అవతారాల్లో పదో అవతారం కల్కి. ఓ సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వీర ఖడ్గంతో, తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ, దుష్టులను శిక్షిస్తాడని కల్కి అవతారం గురించి పురాణాలు వివరిస్తున్నాయి. దీనినే ఆధారంగా తీసుకొని దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను తెరకెక్కించారట. అందుకే ఈ మూవీకు కల్కి అనే టైటిల్ ను పెట్టామని హాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్.
8. మల్టీ లాంగ్వేజెస్ లో మూవీ రిలీజ్..
ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీను భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీ 2024 లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఆంగ్లంలో విడుదల కానుంది.
Also Read: ‘భోళా శంకర్’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది - మెగా ఫ్యాన్స్‌కు పండగే!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial