అన్వేషించండి

Dhanya Balakrishna: ఈటీవీ విన్‌లో కొత్త సిరీస్ - ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా ‘శర్మ అండ్ అంబానీ’

Sharma And Ambani: ధన్య బాలకృష్ణ.. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్‌లతో కూడా బిజీగా ఉంటుంది. రెండేళ్ల తర్వాత ‘శర్మ అండ్ అంబానీ’ అనే సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

Sharma And Ambani Web Series: ప్రస్తుతం ఈటీవీ విన్‌లో బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్‌లు సబ్‌స్క్రైబర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. యూత్‌ను మెప్పించే, మిడిల్ క్లాస్‌కు కనెక్ట్ అయ్యే వెబ్ సిరీస్‌లతో ఈటీవీ విన్ దూసుకుపోతోంది. తాజాగా మరో వెబ్ సిరీస్ కూడా ఈటీవీ విన్ సబ్‌స్క్రైబర్స్ ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. అదే ‘శర్మ అండ్ అంబానీ’. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. ఇందులో నటించే హీరోయిన్ తప్పా మిగిలిన యాక్టర్లతో పాటు డైరెక్టర్ కూడా కొత్తవాడే. అయితే తనలాంటి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నందుకు ‘శర్మ అండ్ అంబానీ’ మేకర్స్‌కు ధన్యవాదాలు చెప్పుకున్నాడు దర్శకుడు కార్తిక్ సాయి.

క్రైమ్ కామెడీ!

భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న వెబ్ సిరీసే ‘శర్మ అండ్ అంబానీ’. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. అందులో స్కూటర్‌పై ధన్య, భరత్ ఉండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో డైమండ్, కొన్ని కరెన్సీ నోట్లు కనిపిస్తాయి. దీన్ని బట్టి చూస్తే ఇదొక క్రైమ్ కామెడీ సిరీస్ అయ్యిండవచ్చని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ‘శర్మ అండ్ అంబానీ’ ద్వారా యంగ్ ఫిల్మ్ మేకర్.. కార్తిక్ సాయి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. టాలీవుడ్ పాపులర్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల చేతుల మీదుగా ‘శర్మ అండ్ అంబానీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ సిరీస్‌తో రెండేళ్ల తర్వాత ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది ధన్య బాలకృష్ణ. ఏప్రిల్ 11న ‘శర్మ అండ్ అంబానీ’ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్‌లు..

ఇప్పటికే ఈటీవీ విన్ ఖాతాలో ‘#90స్’, ‘తులసి వనం’ లాంటి సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్‌లు ఉండగా.. ‘శర్మ అండ్ అంబానీ’ కూడా అదే లిస్ట్‌లో యాడ్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక ధన్య బాలకృష్ణకు కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు వెబ్ సిరీస్‌లలో హీరోయిన్‌గా నటించి తన నటనతో మెప్పించింది ఈ భామ. ఓవైపు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్‌లవైపు అడుగులు వేసింది. అసలు సిరీస్‌లు.. ప్రేక్షకులకు పెద్దగా అలవాటు లేని సమయం నుండే తను వెబ్ సిరీస్‌లలో హీరోయిన్‌గా నటించడం మొదలుపెట్టింది. 2022లో ఆహాలో విడుదలయిన ‘మ్యాడ్ హౌజ్’ సిరీస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ధన్య.. ఇప్పుడు ‘శర్మ అండ్ అంబానీ’తో మరోసారి వెబ్ సిరీస్ లవర్స్‌ను పలకరించనుంది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్‌గా..

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంటర్ అయిన ధన్య బాలకృష్ణకు తమిళ చిత్రాలు మంచి బ్రేక్‌ను ఇచ్చాయి. కానీ అక్కడ చాలాకాలం పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కెరీర్‌ను కొనసాగించాల్సి వచ్చింది. అదే సమయంలో తనకు తెలుగు నుండి హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. ‘చిన్ని చిన్ని ఆశ’ అనే తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా మారింది ధన్య. కానీ తను హీరోయిన్‌గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన సినిమాలే హిట్ అవ్వడంతో అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఇటు హీరోయిన్‌గా రెండు రకాల పాత్రలను ఒప్పుకుంటూ ముందుకెళ్తోంది. ఇప్పుడు ‘శర్మ అండ్ అంబానీ’ వెబ్ సిరీస్‌తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Also Read: కాంగ్ అన్నకి శుభాకాంక్షలు - ‘గాడ్జిల్లా x కాంగ్’పై ‘బేబి’ దర్శకుడు ఫన్నీ పోస్ట్

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Eshwar Sai Reaction : నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Embed widget