Sai Rajesh: కాంగ్ అన్నకి శుభాకాంక్షలు - ‘గాడ్జిల్లా x కాంగ్’పై ‘బేబి’ దర్శకుడు ఫన్నీ పోస్ట్
Godzilla x Kong: ‘గాడ్జిల్లా x కాంగ్’ ఫ్రాంచైజ్‌కు తెలుగులో చాలామంది ప్రేక్షకులు ఉన్నారు. అందులో ‘బేబి’ దర్శకుడు సాయి రాజేశ్ కూడా ఒకడని తను తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బయటపడింది.
Sai Rajesh About Godzilla x Kong: హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. సినీ సెలబ్రిటీలు సైతం ఈ యాక్షన్ సినిమాలను ఎంతో ఇష్టంగా చూస్తారు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఈ చిత్రాలను ఫస్ట్ డే చూడాలని ఆశపడేవారు కూడా ఉంటారు. అందులో దర్శకుడు సాయి రాజేశ్ కూడా ఒకరని తాజాగా బయటపడింది. ఇటీవల ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సందర్భంగా ‘బేబి’ దర్శకుడు సాయి రాజేశ్ సినిమాపై చేసిన పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన స్టైల్‌లో కొన్ని ఏ సర్టిఫికెట్ పదాలను ఉపయోగిస్తూ కాంగ్‌పై సాయి రాజేశ్ చేసిన పోస్ట్‌ను నెటిజన్లు తెగ షేర్ చేసేస్తున్నారు.
కాంగ్ అన్న దర్శనం..
‘బేబి’ మూవీతో ఒక రేంజ్‌లో హిట్ సాధించి మోస్ట్ వాంటెడ్ దర్శకులలో ఒకడిగా మారాడు సాయి రాజేశ్. తనకు సూటిగా మాట్లాడే అలవాటు ఉందని ఇప్పటికీ చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగా ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ చేసిన పోస్ట్‌తో ఈ విషయం మరోసారి స్పష్టమయ్యింది. ‘మూడేళ్ల నిరీక్షణ తర్వాత మా కాంగ్ అన్న దర్శనం. ముష్టి ముండాకొడుకులతో కలవద్దన్నా అని ఫ్యాన్స్ చెప్పినా వినకుండా స్థాయి లేని వాళ్లలో మల్టీ స్టారర్ చేస్తూ, చిన్న నటులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో మన ముందుకు వస్తున్న కాంగ్ అన్నకి ఇవే మా శుభాకాంక్షలు. నీలం సాయి రాజేశ్. కన్వీనర్. గ్రేటర్ హైదరాబాద్ కింగ్ కాంగ్ సేవా సమితి’ అని ఒక వ్యంగ్యమైన పోస్ట్‌ను షేర్ చేశాడు సాయి రాజేశ్.
కాంగ్‌కు వందనాలు..
పోస్ట్‌కు షేర్ చేసిన క్యాప్షన్ మాత్రమే కాదు.. దానికి పెట్టిన ఫోటో కూడా ఫన్నీగానే ఉంది. కారులో నుండి కాంగ్ దిగుతుండగా.. ప్రజలంతా తనకు చేతులెత్తి దండం పెడుతున్నట్టుగా ఫోటోను ఎడిట్ చేశాడు సాయి రాజేశ్. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ అనేది హాలీవుడ్‌లోని ఫేమస్ యాక్షన్ ఫ్రాంచైజ్‌లలో ఒకటి. తాజాగా ఈ ఫ్రాంచైజ్ నుండి ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ విడుదలయ్యింది. ఈ సినిమాకు సంబంధించి రెండు రకాల ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లే టీమ్ కాంగ్, టీమ్ గాడ్జిల్లా. దర్శకుడు సాయి రాజేశ్ పోస్ట్‌ను బట్టి చూస్తే తను టీమ్ కాంగ్ అని అర్థమవుతోంది. అందుకే కాంగ్‌కు సపోర్ట్ చేస్తూ గాడ్జిల్లాను తిడుతూ తన స్టైల్‌లో పోస్ట్‌ను షేర్ చేశాడు ఈ దర్శకుడు.
View this post on Instagram
మీమర్‌గా మారిన దర్శకుడు..
టీమ్ కాంగ్ తరపున సాయి రాజేశ్ పోస్ట్ చేయగా.. కామెంట్స్‌లో టీమ్ గాడ్జిల్లాకు సంబంధించిన ఫ్యాన్స్.. తనపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కాంగ్ కంటే గాడ్జిల్లానే గ్రేట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం సాయి రాజేశ్ మీమర్‌గా మారిపోయాడంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారు. మొత్తానికి హాలీవుడ్ యాక్షన్ సినిమాలపై అమితంగా ప్రేమ పెంచుకున్న టాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్‌లో సాయి రాజేశ్ కూడా ఒకరని తను షేర్ చేసిన పోస్ట్ ద్వారా బయటపడింది.
Also Read: స్టార్ హీరోల రేంజ్‌లో దుమ్ము రేపుతున్న టిల్లన్న - ‘టిల్లు స్క్వేర్’ రెండో రోజు కలెక్షన్స్!