అన్వేషించండి

Jabardasth Promo: రష్మీని ఆడుకున్న బుల్లెట్ భాస్కర్... శివాజీ పెద్ద ఆటగాడు అంటోన్న నూకరాజు

ప్రతి శుక్ర, శనివారం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న జబర్దస్త్ షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ వారం మరింత ఫన్ తో ఆకట్టుకోబోతోంది.

Jabardasth Latest Promo: దశాబ్దానికి పైగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న కామెడీ షో జబర్దస్త్. ప్రతివారం మాదిరిగానే ఈవారం మరింత కామెడీ పంచేందుకు రెడీ అవుతోంది. ఈవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజా విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ప్రోమో ప్రారంభం కాగానే, రాఘవ టీమ్ చేసిన స్కిట్ నవ్వుల్లో ముంచెత్తింది. “నేనో అమ్మాయిని ప్రేమించాను. తను మంచిది కాదని తెలిసింది. ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు” తోటి కమెడియన్ అనగానే, “సిన్సియర్ గా లవ్ చెయ్ తనే వదిలేస్తుంది” అని రాఘవ చెప్పడంతో అందరూ నవ్వుతారు. శాంతి, రాఘవ కలిసి చేసిన లవ్ ట్రాక్ కామెడీ అందరినీ భలే నవ్వించింది. 

శివాజీని పంచ్ తో కొట్టిన నూకరాజు

ఇక నూకరాజు మరోసారి ప్రపంచ యాత్రికుడిగా కామెడీతో అదరగొట్టాడు. “నమస్కారం సర్.. నేను ఎవరంటే?” అని నూకరాజు అనగానే, “ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు” అని శివాజీ అంటారు. “నా కంటే మీరే పెద్ద ఆటగాడని బయట టాక్ ఉంది” అని నూకరాజు అనడంతో అందరూ నవ్వుతారు. “శివాజీకి ఒకే రోజు సినిమా షూటింగ్, జబర్దస్త్ షూటింగ్ ఉంటే, ఏ షూటింగ్ కు వెళ్తారు?” అని నూకరాజును అడగడంతో, “కచ్చింతగా జబర్దస్త్ షోకే వస్తారు. అక్కడైతే ఒక్కరే హీరోయిన్. ఇక్కడైతే షెడ్యూల్ కో హీరోయిన్. లయ గారు, లైల గారు, ఖుష్బూ గారు” అనడంతో పడీపడీ నవ్వుతారు.

భార్యలను విస్తరాకులతో పోల్చిన రామ్ ప్రసాద్ టీమ్

ఇక ఆటో రామ్ ప్రసాద్ టీమ్ ఫ్యాక్షనిస్టుల ఫస్ట్ నైట్ స్కిట్ అందరినీ నవ్వించింది. ముగ్గురు అన్నదమ్ములు ఫస్ట్ నైట్ సందర్భంగా భార్యలపై వేసిన పంచ్ లు పటాసు మాదిరిగా పేలాయి. రామ్ ప్రసాద్ తన భార్యను చూసి “విస్తరాకులో వడ్డించిన ఐటెమ్స్ లా ఉన్నావ్” అంటాడు. అప్పుడే “నేనెలా ఉన్నాను” అంటుంది శాంతి. “ఎవడో తినేసిన వదిలేసిన ఆకులా ఉన్నావు” అనడంతో అందరూ నవ్వుతారు. అటు మరో తమ్ముడి భార్య “నేను ఎలా ఉన్నాను?” అని అడగడంతో “అసలు నువ్వు ఆకులాగే లేవు” అని చెప్పడంతో ఫుల్ గా నవ్వుతారు. ఇమ్మాన్యుయేల్, ఢీ పండు ఉపేంద్ర గెటప్స్ లో ఫుల్ ఫన్ తో ఆకట్టుకున్నారు.ఇక కెవ్వు కార్తిక్ మాంత్రికుడి గెటప్ లో ఆకట్టుకున్నాడు.

రష్మీతో ఆడుకున్న బుల్లెట్ భాస్కర్

ఇక బుల్లెట్ భాస్కర్ చేసిన స్కిట్ అందరినీ ఫుల్ గా నవ్వించింది. ఖుష్బూ చందమామలా ఉందంటూ మాంచి బిస్కెట్ వేశాడు. భాస్కర్ పొగడ్తలకు ఆమె సంతోషంలో తేలిపోయారు. రష్మీ మీద భాస్కర్ వేసిన పంచులు బాగా నవ్వించాయి. కర్త, కర్మ, క్రియకు ఆమెను ఎగ్జాంఫుల్ గా చూపిస్తూ ఆటాడేసుకున్నారు. “ఇంత పెద్ద షోకు యాంకర్ చేస్తున్న రష్మి కర్త. 11 ఏండ్లుగా యాంకరింగ్ చేయడం క్రియ. ఇన్నేండ్లు మనం చూడటం మన కర్మ” అనడంతో అందరూ నవ్వుతారు. ఇక “ నేను కిటికీల జాకెట్ కుట్టించుకుంటా. ఎవరైనా డిజైనర్ ఉన్నారా?” అని సత్య అడగడంతో.. “వర్ష ఉంది” అంటాడు భాస్కర్. “తను కిటికీలు బాగా కుట్టిస్తదా?” అనడంతో “కిటికీలు కాదు పెద్ద తలుపులు పెట్టేస్తది” అనడంతో అందరూ నవ్వుతారు. ఈ షో ఫుల్ ఎపిసోడ్ ఈనెల 8, 9న రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.

Read Also: నాని, శ్రీకాంత్ ఓదెల రెండో సినిమాకు ఆసక్తికర టైటిల్... షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Embed widget