Esha Deol Divorce: విడాకులు తీసుకున్న హీరోయిన్ - 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి
Esha Deol: ప్రముఖ హీరోయిన్ ఈషా చేదు వార్త చెప్పింది. తాజాగా భర్త నుంచి విడిపోయానంటూ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆమె విడాకుల వార్తలు బాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి.
Esha Deol Confirms Divorce: బాలీవుడ్ నుంచి మరో చేదు వార్త వచ్చింది. ప్రముఖ సీనియన్ నటి కూతురు, హీరోయిన్ ఈషా భర్త నుంచి విడిపోయింది. తాజాగా ఈ విషయాన్ని ఆఫీషియల్‌గా ప్రకటించింది ఆమె. దీంతో ఆమె అభిమానులంతా షాక్ అవుతున్నారు. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని పెద్ద కూతురు ఈషా డియోల్. తాజాగా ఆమె తన 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పింది. దీంతో ఆమె విడాకుల ప్రకటన విని బి-టౌన్‌లో హాట్‌టాపిక్ అయ్యింది.బాలీవుడ్ స్టార్ కపుల్ ధర్మేంద్ర-హేమమాలిని పద్ద కుతురు ఈషా డియోల్. తల్లిదండ్రుల వారసత్వంగా అతి చిన్న వయసులోనే ఆమె ఇండస్రీలో అడుగుపెట్టింది.
పెళ్లి తరువాత మూడేళ్లు నటనకు బ్రేక్
స్టార్ హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ ఉండగానే 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మూడేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో ఇద్దరు బిడ్డలకు తల్లయింది. అయితే బాలీవుడ్ క్యూట్ కపుల్లో ఈ జంట కూడా ఒకటి. గతేడాది వరకు భర్తతో అన్యోన్యంగా కనిపించిన ఆమె సడెన్‌గా విడాకుల తీసుకున్నట్టు ప్రకటించడం అందరిని సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇదేంటి అంటూ అంతా షాకావుతున్నారు. గతేడాది వెడ్డింగ్ యానివర్సరీకి ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటో షేర్ చేస్తూ భర్తకు మ్యారేజ్ డే శుభకాంక్షలు తెలిపింది. అదే భర్తతో షేర్ చేఇసన లాస్ట్ పోస్ట్ అయ్యింది. ఆ తర్వాత ఈషా సింగిల్ పోస్ట్స్ మాత్రమే షేర్ చేసింది. ఎలాంటి వెకేషన్, పండుగ అయినా భర్త, పిల్లలతో కలిసి జరుపుకునే ఈషా గత కొద్ది రోజులుగా సింగిల్‌గా జరుపుకుంటుంది. ఆమె పోస్ట్‌లో పిల్లలు, ఆమె మాత్రమే ఉంటున్నారు. మరోవైపు భర్త లేకుండా సింగిల్‌గా స్నేహితులతో కలిసి పార్టీలు, వెకేషన్స్‌కు వెళుతుంది.
View this post on Instagram
Also Read: అయితే ఆలోచించాల్సిందే - ఆ రూమర్‌పై ఘాటుగా స్పందించిన రష్మిక
దీంతో వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో పిల్లలతో కలిసి వేరుగా జీవిస్తోందని సన్నిహితుల నుంచి సమాచారం అందింది. ఈ విషయం కాస్తా బయటకు తెలియడంతో విడాకులు తీసుకుందంటూ గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఇదంతా అబద్ధమని అభిమానులంతా ఆశపడ్డారు. కానీ స్వయంగా ఈషానే డైవోర్స్ విషయాన్ని తేల్చేయడంతో రూమర్స్ కాస్తా నిజమయ్యాయి.
పరస్పర అంగీకారంతోనే విడాకులు.. పిల్లల గురించే ఆలోచన
"పరస్పరం అంగీకారంతోనే భరత్-నేను విడిపోయాం. కానీ, పిల్లలు మాత్రం మాకు చాలా ముఖ్యం. భార్యభర్తలుగా విడిపోయినా.. వారికి మాత్రం తల్లిదండ్రులుగా ఎలాంటి ఇబ్బంది రానీవ్వం" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈషా డైవోర్స్ అంశం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అయితే విడాకులు కారణం ఏంటనేది మాత్రం ఆమె స్పష్టం చేయలేదు . కాగా పెళ్లి తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చిన ఈషా ఇటీవలె ఓటీటీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే సౌత్‌లో ఈషా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో హీరో సూర్య సరసన ఆమె అలరించింది.
View this post on Instagram