అన్వేషించండి

Dulquer Salmaan: ఓ మహిళ నన్ను అక్కడ అసభ్యకరంగా తాకింది, నొప్పితో బాధపడ్డా: దుల్కర్ సల్మాన్

సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల లిస్ట్‌లో దుల్కర్ పేరు కచ్చితంగా ఉంటుంది.

హీరోయిన్లు ఎక్కువగా ప్రజలు ఉన్న ప్రాంతాలకు వెళ్లడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనే విషయం వారికి తెలుసు. అంతమంది ప్రజల్లో ఎవరు తమతో అసభ్యకరంగా ప్రవర్తించినా అక్కడే రియాక్ట్ అయినా కూడా ఆ విషయం వైరల్ అయిపోతుంది. హీరోయిన్స్ మాత్రమే కాదు.. హీరోలు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కుంటారని అంటున్నాడు హీరో దుల్కర్ సల్మాన్. ఒక మహిళ తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ప్రస్తుతం తన ‘కింగ్ ఆఫ్ కోట’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న దుల్కర్.. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

లేడీస్‌లో ఫాలోయింగ్ ఎక్కువ..
దుల్కర్ సల్మాన్.. ఒక మలయాళ నటుడు. కానీ తనకు తెలుగులో, తమిళంలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులోనూ దుల్కర్ అంటే పడి చచ్చిపోయే అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువ. సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల లిస్ట్‌లో దుల్కర్ పేరు కచ్చితంగా ఉంటుంది.  దీనిపై దుల్కర్ స్పందిస్తూ.. ‘ఓకే బంగారం’ లేదా ‘సీతారామం’ సినిమా నుంచి తనకు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రారంభమయ్యిందని అనుకుంటున్నట్టుగా దుల్కర్ సమాధానమిచ్చాడు. తెలుగు, తమిళంలో పక్కన పెడితే.. తనకు కేరళలో ఎక్కువగా అబ్బాయిల ఫ్యాన్ ఫాలోయింగే ఉందని చెప్పాడు. ఇక లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్తూ దాని వల్ల తను పలుమార్లు ఎలా ఇబ్బంది పడ్డాడో తెలిపాడు. ఫోటోలు దిగడానికి వచ్చి చెంపపై ముద్దుపెట్టేవారు ఉన్నారని అన్నాడు. ప్రతీ ఒక్కరు అలా చేయరు కానీ చేసినప్పుడు సర్‌ప్రైజ్ లాగా ఉంటుందని అన్నాడు.

అక్కడ టచ్ చేసింది..
ముద్దుపెట్టడం మాత్రమే కాదు.. ఒకసారి ఓ మధ్య వయసు ఉన్న మహిళ వచ్చి తన వెనుక చేయి పెట్టి, గట్టిగా పట్టుకుందని గుర్తుచేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. ‘‘ఆమె అలా ఎందుకు చేసిందో తెలియదు కానీ.. నాకు మాత్రం చాలా ఇబ్బందికరంగా, విచిత్రంగా అనిపించింది. చాలా నొప్పిగా కూడా అనిపించింది. అది మామూలుగా పట్టుకున్నట్టు కూడా నాకు అనిపించలేదు. అసలు అప్పుడు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. ఆవిడ కాస్త పెద్దావిడలాగానే ఉన్నారు. అప్పుడు స్టేజ్ మీద చాలామంది ఉన్నారు. ఫోటో దిగే సమయంలో చాలామందికి వారి చేయి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అందుకే ఒక్కొక్కసారి వారి చేయి మన వెనుక ఉంటుంది. కానీ ఇలా జరగడం మాత్రం చాలా విచిత్రం. ఇంకా నేను అప్పుడే దాని గురించి మర్చిపోవాలని అనుకున్నాను’’ అంటూ తనకు ఎదురైన విచిత్ర అనుభవం గురించి బయటపెట్టాడు దుల్కర్ సల్మాన్.

పాన్ ఇండియా రిలీజ్..
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్.. అటు సినిమాలతో, ఇటు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. దుల్కర్ ముఖ్య పాత్ర పోషించిన హిందీ వెబ్ సిరీస్ ‘గన్స్ అండ్ గులాబ్స్’ ఆగస్ట్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. ఇక సినిమాల విషయానికొస్తే దుల్కర్.. తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘కింగ్ ఆఫ్ కోట’ సినిమా ఆగస్ట్ 24న థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకే ఈ మూవీ ప్రమోషన్స్‌లో దుల్కర్ బిజీగా పాల్గొంటున్నాడు. అభిలాష్ జోషి తెరకెక్కించిన ఈ చిత్రంలో దుల్కర్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటించింది.

Also Read: సన్నీ డియోల్‌కు షాకిచ్చిన బ్యాంక్, రూ.56 కోట్ల లోన్ కోసం ఆయన బంగ్లా వేలం - ఇంతలోనే ఊహించని ట్విస్ట్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Rashmika Mandanna: సాయి పల్లవి, రుక్మిణీ వసంత్‌ను కాదని రష్మిక దగ్గరకు... లుక్ టెస్ట్ కూడా!
సాయి పల్లవి, రుక్మిణీ వసంత్‌ను కాదని రష్మిక దగ్గరకు... లుక్ టెస్ట్ కూడా!
Kevin Kunta Dance : చికిరి చికిరి పాటకు కెవిన్ కుంట స్టెప్పులు - రామ్ చరణ్ బాడీగార్డ్ సిగ్నేచర్ షాట్
చికిరి చికిరి పాటకు కెవిన్ కుంట స్టెప్పులు - రామ్ చరణ్ బాడీగార్డ్ సిగ్నేచర్ షాట్

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Embed widget