Drishyam 2 Release Date: థియేటర్లలో 'దృశ్యం 2' విడుదల - ఎప్పుడంటే? స్పందన ఎలా ఉంటుందో?
'దృశ్యం 2' సినిమా థియేటర్లలో విడుదలకు రెడీ అయ్యింది. అదీ ఎప్పుడంటే?
'దృశ్యం 2' థియేటర్లలోకి వస్తోంది. అదీ నవంబర్ 18న! దీనికి ఎటువంటి స్పందన వస్తుందోనని చాలా మంది సినిమా ప్రముఖులు ఎదురు చూస్తున్నారు. ''అదేంటి? 'దృశ్యం 2' అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది కదా!'' అని ఆలోచిస్తున్నారా!? మలయాళంలో, తెలుగులో రూపొందిన చిత్రాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. ఇప్పుడు చెబుతున్నది హిందీ 'దృశ్యం 2' గురించి (Hindi Movie Drishyam 2 Release Date) .
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, మీనా నటించిన 'దృశ్యం' కేరళలో ఘన విజయం సాధించింది. తర్వాత ఆ సినిమా తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగణ్ (Ajay Devgan) రీమేక్ చేశారు. ఇంకా పలు భాషల్లో రీమేక్ అయ్యింది. ప్రతి చోట విజయం సాధించింది. 'దృశ్యం'కి సీక్వెల్‌గా 'దృశ్యం 2' చేశారు మోహన్ లాల్. తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు. ఆ రెండూ ఓటీటీలో వచ్చేశారు.
Also Read: చూసేయండి సార్ - కొత్త సినిమాలో 'జాతి రత్నాలు' భామ లుక్ చూసేయండి Faria Abdullah First Look
హిందీలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ (Shriya Saran) భార్యాభర్తలుగా... టబు, అక్షయ్ ఖన్నా, ఇషితా దత్తా కీలక పాత్రల్లో నటించిన 'దృశ్యం 2' థియేటర్లలో నవంబర్ 18, 2022న (Drishyam 2 On Nov 18th) విడుదల కానుంది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు.
Also Read: శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
View this post on Instagram