అన్వేషించండి

SJ Suryah: 'ఖుషీ 2' స్క్రిప్ట్‌ విని చేయనన్న పవన్‌ కళ్యాణ్‌ - కారణమేంటో చెప్పిన ఎస్‌జే సూర్య

Kushi 2 Pawan Kalyan: ఎస్‌జే సూర్య పవన్‌ కళ్యాణ్‌ 'ఖుషీ 2'పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇప్పటికే మూవీ స్క్రిప్ట్‌ రాశానని, పవన్‌ కళ్యాణ్‌కి వినిపించానన్నారు. కానీ ఆయన చేయనన్నారని చెప్పి షాకిచ్చారు.

SJ Suryah About Kushi 2 and Pawan Kalyan: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌లో యూత్‌లో యమ క్రేజ్‌ తెచ్చిపెట్టిన చిత్రం 'ఖుషీ' అనే చెప్పాలి. తమిళ దర్శకుడు, నటుడు  ఎస్‌ జే సూర్య దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌-భూమిక చావ్లా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ అప్పట్లో యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఇందులో పాటలు కూడా బాగా హిట్‌ అయ్యాయి. 2001లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో ఇదోక మైలు స్టోన్ చిత్రంగా నిలిచింది. అంతటి హిట్‌ మూవీకి సీక్వెల్‌ కూడా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్‌, మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

షాకిచ్చిన డైరెక్టర్

అంతేకాదు ఖుషీ 2 పై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తరచూ ఈ సినిమా డైరెక్టర్‌ ఖుషీ 2పై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు ఆయన నోరు విప్పలేదు. కానీ తాజాగా ఆయన ఖుషీ 2 గురించి ఆసక్తికర విషయం చెప్పారు. ప్రస్తుతం ఎస్‌జే సూర్య నాని సరిపోదా శనివారం సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నాని, హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ఆరుళ్‌, ఎస్‌ జే సూర్యలు ముగ్గురితో ప్రత్యేక డిబెట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక మరోసారి ఎస్‌జే సూర్యను ఖుషీ 2 ఎప్పుడు చేస్తున్నారని అడగ్గా.. ఆయన చెప్పిన సమాధానం పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ని షాక్‌కు గురి చేసింది.

స్క్రిప్ట్ బాగా ఎంజాయ్ చేశారు

"ఖుషీ 2 స్క్రిప్ట్‌ ఎప్పుడో అయిపోయింది. దానిని ప్రత్యేకంగా పవన్‌ సార్‌ కోసమే రాసుకున్నాను. ఇప్పటికే ఆయనకు స్క్రిప్ట్‌ కూడా వినిపించింది. కథ బాగా వచ్చింది. చాలా ఎంజాయ్‌ చేస్తూ రాశాను. పవన్‌ సర్‌ కూడా స్క్రిప్ట్‌ని బాగా ఎంజాయ్‌ చేశారు. కానీ, ఈ సినిమా చేయనన్నారు. "ప్రస్తుతం నేను లవ్‌ స్టోరీస్‌ చేసే మైండ్‌ సెట్‌లో లేనని, ఆ స్టేజ్‌ దాటేశాను. చేయను సూర్య అన్నారు" అని చెప్పారు. దీంతో అలాంటిది ఏం లేదు సర్‌. మీ లాంటి హీరోలు ఎప్పుడైనా ప్రేమకథలు తీయొచ్చు. ఇక్కడ ఎన్టీఆర్‌లు, తమిళంలో ఎంజీఆర్ లాంటి హీరోలు చాలా వయసు, గ్యాప్ తర్వాత కూడా సూపర్‌ లవ్‌స్టోరీలు చేశారు. మీరు చేయొచ్చు అంటే. లేదు చేయను అన్నారు.

కానీ, సినిమా ఆయన చేస్తే మాత్రం చలా సూపర్‌గా వచ్చేది" అని చెప్పుకొచ్చారు.  కాగా పవన్‌ కళ్యాణ్‌ని మళ్లీ 'ఖుషీ' సిద్దార్థ్‌ రాయ్‌గా చూడాలి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఇది గట్టి షాక్‌ అనే చెప్పాలి. ప్రస్తుతం ఎస్‌జే సూర్య కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ కాకుండ ఖుషీ 2కి ఏ హీరో అయితే బాగుంటుంది అని ప్రశ్నించగా ఆయన ఇలా అన్నారు. హీరో నాని, రామ్‌ చరణ్‌, దళపతి విజయ్‌ చేస్తే బాగుంటుంది. ఈ ముగ్గురు హీరోలకు ఖుషీ 2 కథ బాగా ఆప్ట్‌ అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 Also Read: 'గేమ్ ఛేంజ‌ర్' రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget