By: ABP Desam | Updated at : 22 Feb 2023 01:10 PM (IST)
'వీర సింహా రెడ్డి'లో బాలకృష్ణ
సినిమాల్లో పాటలు ఉండటం కామన్. అభిమానుల కోసం సినిమాల్లో ప్రత్యేకంగా పాటలు చేయించడం కూడా కామన్! ఓటీటీలో సినిమా విడుదల సందర్భంగా స్పెషల్ సాంగ్ చేయిస్తే? న్యూ ట్రెండ్! దీనికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ శ్రీకారం చుట్టింది. నందమూరి అభిమానులకు నయా కానుక రెడీ చేసింది.
ఈ ఏడాది సంక్రాంతి బరిలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నట విశ్వరూపం చూపించారు. ఆ సినిమా భారీ వసూళ్ళు సాధించింది. ఫ్యాక్షన్ బేస్డ్ ఫిలిమ్స్, ఫ్యాక్షన్ లీడర్ రోల్స్ అంటే... బాలకృష్ణ ఎప్పుడూ బెస్ట్ ఇస్తారు. 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy)లోనూ ఆయన విజృంభించారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.
గురువారం సాయంత్రం 6 నుంచి
Veera Simha Reddy On Hostar : 'వీర సింహా రెడ్డి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నెల 23న... గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి సినిమా సందడి చేయనుంది. ఓటీటీలో సినిమా చూడమని నట సింహం బాలయ్య కూడా వీడియో విడుదల చేశారు.
స్పెషల్ సాంగ్ @ 25!
'వీర సింహా రెడ్డి' హంగామా పేరుతో డిస్నీ ప్లస్ హాట్ సస్టార్ ఓటీటీ వేదిక ఓ స్పెషల్ సాంగ్ రెడీ చేయించింది. 'చౌరస్తా' బ్యాండ్ ఫేమ్ యశ్వంత్ నాగ్ ఆ సాంగ్ కంపోజ్ చేశారు. ఈ నెల 25న ఆ పాటను విడుదల చేయనున్నారు. హైదరాబాద్, కర్నూల్, విజయవాడ నగరాల్లో ఫ్యాన్ ఈవెంట్స్ చేస్తున్నారు. అక్కడ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.
Also Read : టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ఇప్పుడు రామ్ చరణ్ - హాలీవుడ్‌లో క్రేజ్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే
Get ready for an electrifying FAN EVENT to launch the #VSRHungamaAnthem! Stay tuned for February 25, it's going to be massive! 🔥🦁 #VSRHungamaOnHotstar begins from February 23 only on #DisneyPlusHotstar. #VeeraSimhaReddyOnHotstar #NandamuriBalakrishna @shrutihaasan pic.twitter.com/5pPNwTZn5s
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 22, 2023
'క్రాక్' విజయం తర్వాత గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రమిది. 'అఖండ' విడుదల తర్వాత బాలకృష్ణ నుంచి వచ్చిన సినిమా కూడా ఇదే. ఇందులో ఫైట్స్ బావున్నాయని, 'వీర సింహా రెడ్డి'గా బాలకృష్ణ యాక్టింగ్ అద్భుతమని రివ్యూ రైటర్లతో పాటు ప్రేక్షకులు చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయిందని టాక్ వచ్చింది.
శ్రుతీ హాసన్ కథానాయికగా... హానీ రోజ్ మరో నాయికగా, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతినాయిక ఛాయలు ఉన్న పాత్రలో, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు నటించారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.
Also Read : ఇంటికి పంపాలనుకున్నా వెళ్ళను, పవర్ స్టార్ స్థాయికి ఎదుగుతా, మీకెందుకు తొందర? - కిరణ్ అబ్బవరం
'వీర సింహా రెడ్డి' సుమారు 1500 థియేటర్లలో విడుదలైంది. నైజాంలో 265, సీడెడ్ ఏరియాలో 200, ఏపీలో 410, ఓవర్సీస్ చూస్తే 500, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 100కు పైగా స్క్రీన్లలో సినిమా విడుదలైంది. అమెరికాలోని డల్లాస్ సిటీలో ఒక థియేటర్ యాజమాన్యానికి మాత్రం బాలకృష్ణ అభిమానులు చేసిన సందడి నచ్చలేదు. సెక్యూరిటీ అధికారులు వచ్చి థియేటర్ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అందుకు కారణం ఏంటో తెలుసా? ప్రేక్షకులు చూపించిన అభిమానమే. స్క్రీన్ మీద పేపర్లు విసురుతూ, గోల గోల చేసే సరికి షో మధ్యలో ఆపేశారు. 'అఖండ' సినిమా విడుదలైన సమయంలో కూడా అమెరికాలో థియేటర్‌లో సౌండ్ విషయంలో కంప్లైంట్స్ వచ్చాయి.
NTR 30 Muhurtam : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..
18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు
Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
Fed Rate Hike: వడ్డీ రేట్లను 25 bps పెంచిన ఫెడ్ - ప్రపంచం ఏమైనా పర్లేదు, తన దారి తనదే!
అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!