అన్వేషించండి

Disha Patani: ఆ టాటూ సీక్రెట్ చెప్పేసిన దిశా పటానీ - డార్లింగ్ ఫ్యాన్స్ ఇది విన్నారా!

దిశా పటానీ టాటూ మిస్ట్రీకి చెక్ పెట్టింది. ఆమె చేతిపై వేయించుకున్న టాటూ వెనుక అసలు కథ చెప్పేసింది. ఆ టాటూకు ప్రభాస్ కు అస్సలు సంబంధం లేదని తేల్చి చెప్పేసింది.

Disha Patani’s Tattoo Mystery: ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 AD’లో కీలక పాత్ర పోషించింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. రాక్సీ పాత్రతో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ఈ మూవీలో ఆమె ప్రభాస్ వెనకాల తిరిగే అమ్మాయిగా కనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎడమ చేతిపై వేయించుకున్న టాటూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ‘PD’ ఉన్న ఈ టాటూపై రకరకాలుగా ప్రచారం జరిగింది. ప్రభాస్ తో ప్రేమలో ఉందని, అతడి పేరుతోనే ‘ప్రభాస్ డార్లింగ్’ టాటూ వేయించుకుందంటూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరోవైపు ఆమె పేరునే అటు ఇటుగా రాయించుకుందని మరికొంత మంది వెల్లడించారు.  తను నటించబోయే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ అయి ఉంటుందని ఇంకొంత మంది అభిప్రాయపడ్డారు.

టాటూ వెనుకున్న అసలు స్టోరీ చెప్పిన దిశా పటానీ

తాజాగా ఈ టాటూ వెనుకున్న అసలు కథను బయటపెట్టింది దిశా పటానీ. తన చేతికి ఉన్న టాటూకు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. అంతేకాదు, ఈ టాటూకు సంబంధించి ఏ ఒక్కరూ సరైన గెస్ చేయలేదని చెప్పుకొచ్చింది. తన టాటూ ఓటీటీ దిగ్గజం ప్రమోషన్ లో భాగంగా వేయించుకున్నట్లు తాజాగా వివరించింది. అమెజాన్ ప్రైమ్ డే 2024 ప్రమోషన్‌ కోసమే టెంపరరీ టాటూ వేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ‘PD’ అంటే ‘ప్రైమ్ డే’ అని వివరించింది. ఈ మేరకు ఇన్ స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

సూర్య పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా దిశా

దిశా పటానీ తెలుగు ప్రేక్షకులనూ అలరించింది. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ వరుస సినిమా అవకాశాలతో కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. తాజాగా ‘కల్కి’ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సూర్యతో కలిసి ప్రతిష్టాత్మక చిత్రంలో ‘కంగువ’లో నటిస్తుంది. శివ సిరుత్తై దర్శకత్వంలో ఈ పాన్ ఇండియన్ మూవీ రూపొందుతుంది.

బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సూర్య ఏకంగా ఐదు క్యారెక్టర్లు చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 10, 2024లో విడుదల కానుంది. తాజాగా పాటల రచయిత వివేక ఈ సినిమాకు సంబంధించి రివ్యూ ఇవ్వడం విశేషం. రీసెంట్ గా ఈ సినిమా చూసినట్లు చెప్పిన ఆయన, ‘కంగువ’ చాలా థ్రిలింగ్ గా ఉందని వెల్లడించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ సినిమా కనీవినీ ఎరుగని కీర్తిని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. డైరెక్టర్ శివ ఈ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో సూర్య నటన మరో లెవల్ అన్నారు.  

Read Also: ఎదురు దాడికి బదులు చర్చ పెడితే బాగుండేది, డబ్బు కోసం అలా చెయ్యలేదు - సమంత

టాప్ హెడ్ లైన్స్

Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget