అన్వేషించండి

Kalki 2898 AD - Disha Patani: భైరవను బుట్టలో వేసుకునే రాక్సీ - 'కల్కి' నుంచి దిశా పటానీ క్యారక్టర్ పోస్టర్ వచ్చేసింది!

Kalki 2898 AD - Disha Patani: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD'. తాజాగా హీరోయిన్ దిశా పటానీ క్యారక్టర్ పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

Kalki 2898 AD - Disha Patani: ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో 'కల్కి 2898 AD' ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ ఫాంటసీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం వైజయంతీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ ఖర్చు చేస్తోంది. ఇందులో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకునే, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈరోజు (జూన్ 13) దిశా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ, చిత్ర బృందం ఆమె క్యారక్టర్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

'కల్కి 2898 ఏడీ' చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన క్యారెక్టర్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భైరవ అనే సూపర్ హీరో పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా.. ఆయనకు జోడీగా రాక్సీ అనే పాత్రలో దిశా పటానీ నటిస్తోంది. తాజాగా వదిలిన పోస్టర్ లో దిశా నుదుటన పొడవాటి బొట్టు పెట్టుకొని తీక్షణంగా చూస్తూ వుంది. తన నడుము అందాలు చూపిస్తూ ఓవైపు గ్లామరస్ గా కనిపిస్తూనే, మరోవైపు లేడీ వారియర్ లా పవర్ ఫుల్ లుక్ లో ఆకట్టుకుంటోంది.

దాదాపు 9 ఏళ్ల తర్వాత తెలుగులో...
2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' సినిమాతో దిశా పటానీ హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ ఫ్లాప్ అవ్వడంతో అమ్మడికి తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ కు చెక్కేసి, అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' సినిమాతో సౌత్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ప్రభాస్ కు జంటగా అందాలు ఆరబోస్తూనే, రిస్కీ యాక్షన్ సీన్స్ కూడా చేసినట్లుగా ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. మరి రాక్సీగా ఈ బ్యూటీ ఎలాంటి నటన కనబరుస్తుందో చూడాలి.

'కల్కి' మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఇటీవల వదిలిన ట్రైలర్ అనూహ్య స్పందన తెచ్చుకొని అందరిలో అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా కచ్ఛితంగా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని రెబల్ స్టార్ డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హిందూ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా సోషియో ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' ను తీర్చిదిద్దుతున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. మహాభారతం కాలం నుంచి క్రీ.శ. 2898 మధ్య జరిగే 6 వేల ఏళ్ల కథను చెప్పబోతున్నారు. అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ విభాగాలను నిర్వహిస్తున్నారు.

Also Read: డైరెక్టర్ చెప్పాడని బ్లాక్ కలర్ అండర్‌వేర్‌ కూడా వేసుకోవడం లేదు: హీరో సుధీర్ బాబు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Embed widget