అన్వేషించండి

Director Vijaya Bhaskar: క‌త్రినాను డైరెక్ట్ చేయ‌డం చాలా క‌ష్టం, మీరు నన్ను చీట్ చేశారని అంది - దర్శకుడు విజ‌య్ భాస్క‌ర్

Vijaya Bhaskar: డైరెక్ట‌ర్ విజ‌య్ భాస్క‌ర్. ఎన్నో హిట్ సినిమాల‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. 'మ‌ల్లీశ్వ‌రి' సినిమాతో క‌త్రీనా కైఫ్ ని తెలుగులో ప‌రిచ‌యం చేశారు. ఆమె గురించి చెప్పుకొచ్చారు.

Director Vijaya Bhaskar About Actress Katrina Kaif : 'మ‌ల్లీశ్వ‌రి' సినిమా.. వెంక‌టేశ్ కెరీర్ లోని ది బెస్ట్ సినిమాల్లో ఒక‌ట‌ని చెప్పొచ్చు. ఆ సినిమాలో వెంక‌టేశ్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇక ఆ సినిమాలో హిరోయిన్ క‌త్రీనా కైఫ్ యాక్టింగ్ కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. రాజ‌కుమారి లాగా ఆమెను చూసిన అబ్బాయిలు ఎంతోమంది ఫిదా అయ్యారు. అయితే, ఆ సినిమా డైరెక్ట‌ర్ విజ‌య్ భాస్క‌ర్ మాత్రం క‌త్రీనాను ఒప్పించేందుకు చాలా ఇబ్బందులు ప‌డ్డార‌ట‌. అంతేకాదు ఆమెను డైరెక్ట్ చేయ‌డం చాలా క‌ష్టం అయ్యింద‌ట ఆయ‌న‌కి. కానీ, క‌త్రీనా చాలా హార్డ్ వ‌ర్క‌ర్ అని, ఆమె చాలా విష‌యాలు నేర్చుకున్నార‌ని, ఆమె క‌ష్ట‌మే ఇప్పుడు ఆమెను స‌క్సెస్ ఫుల్ గా న‌డిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఆయ‌న ఏమ‌న్నారంటే? 

డైరెక్ట్ చేయ‌డం చాలా క‌ష్టం.. 

"క్ర‌తీనా కైఫ్ ని డైరెక్ట్ చేయ‌డం చాలా క‌ష్టం. కానీ, త‌ను చాలా హార్డ్ వ‌ర్క‌ర్. త‌న‌కు తెలుసు ఆమెకు యాక్టింగ్ స‌రిగ్గా రాద‌ని. కానీ, ప్ర‌తి చిన్న విష‌యాన్ని క‌చ్చితంగా నేర్చుకుంటుంది, తెలుసుకుంటుంది. ఆమెకు తెలుసు త‌న‌కు ఏమీ తెలీద‌ని అది గొప్ప జ్ఞానం. బాడీ లాంగ్వేజ్ కూడా ఉండ‌దు. ఒక‌సారి నేను చెప్పాను వెంట‌నే తెలుసుకుంది. వాళ్లు అంతా పెరిగిన ప్ర‌దేశాలు వేరు క‌దా. ఇక ఈ సినిమాలోకి ఆమెను తీసుకుందాం అనేది నా ఛాయిస్. ఆ అమ్మాయిని ఒక యాడ్ లో చూశాం. న‌చ్చి, ముంబై వెళ్లి క‌థ చెప్పాను. ఆమె ఓకే చెప్పింది. ఇక్క‌డికి వ‌చ్చి ఫొటో షూట్ కూడా చేసింది. త‌ర్వాత సైలెంట్ అయిపోయింది. అడ్వాన్స్ ఇచ్చినా కూడా తీసుకోలేదు. దీంతో వేరేవాళ్ల‌ని చాలామందిని చూశాం. కానీ, నాకు క‌త్రీనా కైఫ్ మాత్ర‌మే సూట్ అవుతుంది అనిపించింది. చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కానీ, వాళ్లు ఎవ్వ‌రూ వ‌ద్దు అని చెప్పాను. ఎందుకంటే మ‌ల్లీశ్వ‌రి అనే అమ్మాయి మ‌న ఊహ‌ల్లో ఉన్న అమ్మాయి కావాలి. ముందే స్క్రీన్ మీద  చూసేసిన అమ్మాయి కావ‌ద్దు. ఎందుకంటే ఆ ప్రిన్సెస్ లుక్, ఆ గ్రేస్ ఉండాలి." 

అలా ఒప్పించాను.. 

క‌త్రీనా కైఫ్ మాత్ర‌మే త‌న సినిమాలో ఉండాల‌నే ఉద్దేశంలో త‌న‌ని చివ‌రిసారి మాట్లాడి ఒప్పించాన‌ని చెప్పారు విజ‌య్ భాస్క‌ర్. ఆమె ఎంత‌కి ఒప్పుకోక‌పోయే స‌రికి చివ‌రిసారి మాట్లాడాలి అనుకున్నాను. అలా ఒక మాట నేను మాట్లాడ‌తాను. చివ‌రిసారిగా మాట్లాడ‌తాను అని అన్నాను. నిజానికి అప్ప‌టికే సురేశ్ గారు సోనాలి బింద్రేతో అగ్రిమెంట్ కి వెళ్లిపోయారు. ఎందుకంటే మూడు నెల‌లు అయిపోయింది. వెంక‌టేశ్ గారి డేట్స్ కి ఇబ్బంది అవుతుంది. సోనాలి గారంటే నాకు చాలా ఇష్టం. చాలా ప్రొఫెష‌న‌ల్ గా ఉంటారు. చాలామంచి యాక్ట‌ర్. కానీ, మ‌ల్లీశ్వ‌రికి ఎవ‌రైనా కొత్త‌గా ఉంటే బాగుంటుంది. అందుకే, చివ‌రిసారి మాట్లాడుకుందాం అని ర‌మ్మ‌న్నాను.  ఆమె వ‌చ్చింది. "ఏంటి క‌త్రీనా? ఏమైంది?"  అని అడిగాను. "చాలా ఎగ్జైట్ అయ్యావు క‌థ విని ఏమైంది? పేమెంట్ ఇబ్బందా?" అని అడిగాను. దానికి ఆమె 'నాకు భయంగా ఉంది' అని చెప్పింది. "ఎందుకు అంటే.. 'నాకు తెలుగు రాదు' అని చెప్పింది. అది నా ప్రాబ్ల‌మ్ క‌దా? స‌రే రెండు రోజులు చేయి.. ఇబ్బంది అయితే, వ‌ద్దు అనిపిస్తే వ‌దిలేద్దాం అని అన్నాను. రెండే రెండు డ్ర‌స్సులు తెప్పించి షూట్ చేశాం వైజాగ్ లో. డైలాగ్స్ ఏమీ లేవు. కేవ‌లం ఆమె చిన్న ఎక్స్ ప్ర‌ష‌న్స్ ఇవ్వ‌డం. రెండోరోజు కొంచెం కంఫ‌ర్ట్ అయ్యింది. ఇలా డైలాగ్స్ లేకుండా అయితే నాకు కంఫ‌ర్ట్ అని చెప్పింది. అలాంటిది చివ‌రికి క్లైమాక్స్ లో మూడు పేజీల డైలాగ్ మొత్తం నేర్చుకుని చెప్పింది. మీరు న‌న్ను చీట్ చేశారు. ఏమీ డైలాగులు లేవ‌ని ఇప్పుడు మూడు పేజీల డైలాగ్ ఇచ్చారు అని చెప్పింది. అలా క‌త్రీనా కైఫ్ ఈ సినిమా చేసింది" అని చెప్పుకొచ్చారు డైరెక్ట‌ర్ విజ‌య్ భాస్క‌ర్ గారు.     

ఆ సినిమా ఇన్ స్పిరేష‌న్.. 

ఇక 'మ‌ల్లీశ్వ‌రి' సినిమా రోమ‌న్ హాలిడే నుంచి ఇన్ స్పైర్ అయ్యి తీసుకున్న సినిమా అని, ద‌ర్శ‌కులు ఇన్ స్పైర్ అవుతారు కానీ, కాపీ కొట్ట‌రు అని అన్నారు విజ‌య్ భాస్క‌ర్. "రోమ‌న్ హాలిడే' అనే సినిమా అంటే నాకు పిచ్చి. ఒక కామ‌న్ మ్యాన్, ప్రిన్సెస్ మ‌ధ్య ల‌వ్ అనే కాన్సెప్ట్ అక్క‌డ నుంచి తీసుకున్నాం. సినిమా నుంచి ఇన్ స్పైర్ అవుతాం కానీ, కాపీ కొట్టం. అలా బ్యాంక్ ఎంప్లాయ్, ప్రిన్సెస్ మ‌ధ్య ల‌వ్ పెట్టాం. వెంక‌టేశ్ గారితో చాలా సినిమాలు చేశాం. ఆయ‌న చాలా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటారు. ఇప్పుడు ఇంకోటి ఏదో కొత్త క‌థ చేయాలి. అందుకే, పెళ్లి కాని ప్ర‌సాద్ క్యారెక్ట‌ర్ చేశాం. నువ్వు నాకు న‌చ్చావు లాగా కాకుండా డిఫ‌రెంట్ గా చేయాలి. అందుకే, అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాం. ఆ సినిమా క‌థ సేమ్ కాదు.. కాన్సెప్ట్ మాత్ర‌మే తీసుకున్నాం. ఏ సినిమాలో అయినా కాన్సెప్ట్, క్యారెక్ట‌రైజేష‌న్ చాలా ముఖ్యం. అది నా ఫీలింగ్. క్యారెక్ట‌ర్ లో ఉండాలి, కామెడీ, రొమాన్స్ ఏదైనా" అని సినిమాల గురించి చెప్పారు విజ‌య్ భాస్క‌ర్.

Also Read: పవన్‌ కళ్యాణ్‌-రవితేజతో మల్టీస్టారర్‌ - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన హరీశ్‌ శంకర్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
First Flight Experience : మొదటిసారి విమానంలో ప్రయాణిస్తుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఆ విషయం అస్సలు మరచిపోకండి
మొదటిసారి విమానంలో ప్రయాణిస్తుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఆ విషయం అస్సలు మరచిపోకండి
Perni Nani Wife: బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు
బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు
AP Govt Good News ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
Embed widget