అన్వేషించండి
Director Sanjeev Reddy Interview: రుక్సార్ కాకుండా చాందినీని తీసుకోవడానికి కారణం అదొక్కటే... ప్రజల్లో భయాలు వద్దని వినోదాత్మకంగా వెళ్ళా - దర్శకుడు సంజీవ్ ఇంటర్వ్యూ
Santhana Prapthirasthu Release Date: సంతానలేమిపై ప్రజల్లో భయాలు క్రియేట్ చేయకూడదని సీరియస్ కథను వినోదాత్మకంగా చెప్పానని 'సంతాన ప్రాప్తిరస్తు' దర్శకుడు సంజీవ్ తెలిపారు. ఏబీపీ దేశంతో ఆయన ఇంటర్వ్యూ...

'సంతాన ప్రాప్తిరస్తు' దర్శకుడు సంజీవ్ రెడ్డి ఇంటర్వ్యూ... విక్రాంత్, చాందినీల కొత్త సినిమా గురించి ఆసక్తికర విషయాలు
'ఏబీసీడీ' సినిమా, 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా సంజీవ్ రెడ్డి సత్తా చాటుకున్నారు. ఆయన దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరి ప్రసాద్ రెడ్డి నిర్మించిన సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించారు. శుక్రవారం (నవంబర్ 14న) సినిమా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏబీపీ దేశంతో దర్శకుడు సంజీవ్ రెడ్డి ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులు...
- నాకు మధుర శ్రీధర్ గారితో మంచి అనుబంధం ఉంది. పదమూడేళ్లుగా ఆయనతో జర్నీ చేస్తున్నాను. నాకు ఏ ఐడియా వచ్చినా కూడా ఆయనతో పంచుకుంటాను. మాకు ఎప్పుడూ కూడా క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తుంది కానీ పర్సనల్‌గా ఎప్పుడూ మాకు ఎలాంటి దూరం ఏర్పడలేదు. 'ఏబీసీడీ' తరువాత 'సంతాన ప్రాప్తిరస్తు'ను ఆయన బ్యానర్‌లో చేయడం ఆనందంగా ఉంది.
- నేను ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో పని చేశాను. అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చాను. ఫైనాన్స్ బ్యాక్ డ్రాప్ నుంచి రావడంతో నాకు బడ్జెట్ మీద అవగాహన ఉండేది. మధుర శ్రీధర్ గారు కూడా చిన్న బడ్జెట్లోనే మంచి క్వాలిటీతో సినిమాల్ని నిర్మిస్తుంటారు.
- 'సంతాన ప్రాప్తిరస్తు' టీజర్, ట్రైలర్ చూసి చాలా మంది అభినందించారు. ఎంతో మంది పర్సనల్‌గా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అన్ని చోట్లా ఫర్టిలిటీ సెంటర్‌లు కనిపిస్తున్నాయి. యువతకు ఒత్తిడి వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి టైంలోనే ఈ కథను చెప్పాలని అనుకున్నాను. ఆరేళ్ల నుంచి ఈ కథను డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను.
- 'సంతాన ప్రాప్తిరస్తు' కథను పూర్తి సీరియస్ నోట్‌లో కూడా చెప్పొచ్చు. కానీ అందరిలో లేనిపోని భయాల్ని క్రియేట్ చేసినట్టు అవుతుందని చాలా సరదాగా, ఫన్నీగా, ఎంటర్టైనింగ్‌గా చెప్పాను. ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీ, కామెడీతో ఈ కథను చెప్పే ప్రయత్నం చేశాను.
Also Read: షూటింగ్‌లో గాయం... ఐదారు నెలలు బెడ్ రెస్ట్... హీరోయిన్ చాందినీ చౌదరి ఇంటర్వ్యూ
- కరోనా తరువాత ఆడియెన్స్ సినిమాల్ని చూసే తీరు మారింది. ఓటీటీకి అలవాటు పడి అన్ని భాషల చిత్రాల్ని చూస్తున్నారు. అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ కోవలో వచ్చిన 'కోర్ట్', 'లిటిల్ హార్ట్స్', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి చిన్న చిత్రాల్ని కూడా ఆడియెన్స్ ఆదరించారు.
- 'సంతాన ప్రాప్తిరస్తు'లో విక్రాంత్ తన పాత్రకు తగ్గట్టుగా ఆహార్యాన్ని తగ్గించుకున్నారు. ఈ మూవీ కోసం దాదాపు పది కేజీల బరువు పెరిగారు. డీ గ్లామర్ లుక్‌లో కనిపించి కథకు తగ్గట్టుగా నటించారు.
- 'సంతాన ప్రాప్తిరస్తు' పట్టాలెక్కడానికి రుక్సార్ థిల్లాన్ ఓ కారణం. నా 'ఏబీసీడీ'లో, మా హీరో విక్రాంత్ మొదటి మూవీ 'స్పార్క్'లోనూ ఆమే హీరోయిన్. చాందినీ చౌదరి ప్రస్తుతం డిఫరెంట్ పాత్రల్ని, కంటెంట్ ఉన్న సబ్జెక్టలను చేస్తూ ఉన్నారు. ఆమె అయితే ఈ 'సంతాన ప్రాప్తిరస్తు' మూవీకి సరిపోతారని అనుకున్నాను. అందుకే చాందినీతోనే ముందుకు వెళ్లాం. భవిష్యత్తులో మళ్లీ రుక్సార్ థిల్లాన్‌తో సినిమా చేస్తాను.
- 'సంతాన ప్రాప్తిరస్తు'కి పని చేసిన విక్రాంత్, మధుర శ్రీధర్ గారు, తరుణ్ భాస్కర్ ఇలా అందరూ దర్శక, రచయితలే. అయితే మధుర శ్రీధర్ గారు నాకు సోదర సమానులు. ఆయన ఇచ్చే సలహాల్ని ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాను. కానీ నా ఆలోచనల్ని కూడా ఆయన గౌరవిస్తుంటారు. నాకు మంచి రైటింగ్ టీం కూడా ఉంది. విక్రాంత్, తరుణ్ భాస్కర్ ఎవ్వరూ కూడా స్క్రిప్ట్‌లో ఇన్వాల్వ్ కాలేదు.
- 'సంతాన ప్రాప్తిరస్తు'లో వెన్నెల కిషోర్ గారి పాత్ర చాలా నవ్విస్తుంది. ఆయన కారెక్టర్‌ను టీజర్, ట్రైలర్‌లో చూసి చాలా మంది సమరం గారికి ప్రతీకగా ఫీల్ అవుతున్నారు. సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ అద్భుతంగా నవ్విస్తారు. ఆయనతో పాటుగా మురళీధర్ గౌడ్, అభినవ్ గోమఠం కారెక్టర్స్ కూడా బాగుంటాయి.
- విక్రాంత్ చేసిన 'స్పార్క్' చూశాను. ఆయన ఓ సెల్ఫ్ మేడ్ స్టార్. ఆయనకు సినిమా పట్ల ఎంతో డెడికేషన్ ఉంది. యాక్టింగ్ కోర్సుల్ని చేశారు. ఇప్పటికీ సినిమాలోని పాత్రలోనే ఉంటున్నారు. ప్రమోషన్స్‌లో కూడా అలానే ప్రవర్తిస్తున్నారు.
- పెళ్లైన మహిళ పాత్రని చాందినీ చేస్తారో లేదో అనుకున్నాను. కానీ కథ చదివిన తరువాత వెంటనే ఓకే చేశారు. మేల్ ఇన్‌ఫర్టిలిటీ అనే పాయింట్ ఆమెకు నచ్చినట్టుంది. ఇంత వరకు మన చిత్రాల్లో ఆడవాళ్లలోనే సమస్య ఉంటుందని చూపిస్తుండేవాళ్లం. కానీ ఇందులో దానికి భిన్నంగా చూపించబోతోన్నాం. సెట్లో చాందినీకి గాయమైనా కూడా మా కోసం రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ చేశారు.
- 'సంతాన ప్రాప్తిరస్తు' మూవీని సెన్సార్ బోర్డ్ వాళ్లు చూసి అభినందించారు. ఎక్కడా కూడా బోధించినట్టుగా కాకుండా వినోదాత్మకంగా చూపించారని మెచ్చుకున్నారు. బీవీఎస్ రవి వంటి వారు కూడా మూవీని చూసి ప్రశంసించారు. మా చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్ కూడా అయిపోయింది.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement





















