Director Bobby : మధురపూడిలోనూ తలలు తెగి పడ్డాయ్ - ట్రైలర్ విడుదల చేసిన బాబీ
Madhurapudi Gramam Ane Nenu Movie : 'మధురపూడి గ్రామం అనే నేను' సినిమా ట్రైలర్ ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) చేతుల మీదుగా విడుదలైంది.
మాస్... ఫైట్... హీరోయిజం అంటే తలలు తెగి పడటం కామన్ అయ్యింది. అది చిన్న సినిమాల్లో కూడా కంటిన్యూ అవుతోంది. 'మధురపూడి గ్రామం అనే నేను' (Madhurapudi Gramam Ane Nenu) ట్రైలర్ చూస్తే ప్రేక్షకులకు కూడా ఆ విషయం అర్థం అవుతోంది. అసలు వివరాల్లోకి వెళితే...
నందమూరి కళ్యాణ్ రామ్ 'కత్తి', శ్రీహరి 'భద్రాద్రి' ఫేమ్ మల్లి దర్శకత్వం వహించిన కొత్త సినిమా 'మధురపూడి గ్రామం అనే నేను'. శివ కంఠమనేని (Siva Kantamaneni) హీరోగా నటించారు. క్యాథలిన్ గౌడ హీరోయిన్. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 13న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు కానుంది. లేటెస్టుగా ఈ సినిమా ట్రైలర్ ప్రముఖ దర్శకులు, ప్రస్తుతం నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా చేస్తున్న బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) చేతుల మీదుగా విడుదలైంది.
మేం ఒకే బండిలో తిరిగాం...
నాకు డబ్బులు ఇచ్చేవారు - బాబీ
ట్రైలర్ విడుదల చేసిన తర్వాత బాబీ మాట్లాడుతూ ''దర్శకుడు మల్లి నాకు బాగా కావాల్సిన వ్యక్తి. నా సొంత మనిషి అని చెబుతా. నేను హైదరాబాద్ సిటీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మేమిద్దరం ఒకే బండి మీద తిరిగేవాళ్లం. అప్పట్లో నాకు ఎంతో అండగా ఉన్నారు. అప్పుడప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసేవారు. నాకు మొదటి అవకాశం ఇచ్చిన శ్రీహరి గారి 'భద్రాద్రి' సినిమాకు మల్లి గారే దర్శకులు. అప్పట్నుంచి ఇప్పటి వరకు మా రిలేషన్షిప్ ఒకేలా ఉంది. ఆయన తీసిన 'మధుర పూడి గ్రామం అనే నేను' సినిమా ట్రైలర్ చూశా. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓ ఊరిలో కథ జరుగుతుంది. మణిశర్మ గారు సంగీతం అందించడం గొప్ప విషయం. గురు సమానులు గౌతమ్ రాజు గారు ఎడిట్ చేస్తున్నారు. హీరో శివ కంఠమనేని బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ క్యాథలిన్ గౌడ, మిగతా ఆర్టిస్టులు చక్కగా చేశారు'' అని చెప్పారు.
Also Read : బోయపాటికి తమన్ భారీ పంచ్ - అంత మాట అనేశారేంటి?
దర్శకుడు మల్లి మాట్లాడుతూ ''మనుషులకు ఒక ఆత్మ ఉన్నట్లు ఒక ఊరికి ఆత్మ ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించి, డిఫరెంట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేద్దామని 'మధురపూడి గ్రామం అనే నేను' తీశా. ఇందులో ప్రేమ, స్నేహం, రాజకీయాలు, యాక్షన్, ఎమోషన్... అన్నీ ఉంటాయి. ఇదొక మట్టి కథ. మన నేటివిటీ చూపించే కథ. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఒంగోలు, చీరాల నేపథ్యంలో కథ సాగుతుంది. రాజమండ్రి, మచిలీపట్నం, హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లోని పలు అందమైన, ఆసక్తికరమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం. హీరో శివ కంఠమనేని అద్బుతమైన నటన కనబరిచారు. హీరోయిన్ క్యాథలిన్ గౌడ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. ప్రేక్షకులకు ఆశ్చర్య పరుస్తారు. భరణి శంకర్, సత్య, నూకరాజు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు'' అని అన్నారు.
Also Read : దోచుకున్న డబ్బుకు ఫ్యామిలీకి ఇవ్వలేదా? నాగేశ్వర రావు ఫ్యామిలీ పరిస్థితి ఇప్పుడెలా ఉంది?
భరణి శంకర్, సత్య, నూకరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూర్పు : గౌతమ్ రాజు, ఛాయాగ్రహణం : సురేష్ భార్గవ్, యాక్షన్ : రామకృష్ణ, స్క్రీన్ ప్లే: నాగకృష్ణ గుండా, మాటలు: ఉదయ్ కిరణ్, సహ నిర్మాతలు: కె శ్రీధర్ రెడ్డి - ఎం జగ్గరాజు, నిర్మాణ సంస్థ : లైట్ హౌస్ సినీ మ్యాజిక్, సమర్పణ: జి రాంబాబు యాదవ్, నిర్మాతలు : కేఎస్ శంకర్ రావు - ఆర్ వెంకటేశ్వరరావు, సంగీతం: మణిశర్మ, రచన - దర్శకత్వం : మల్లి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial