Varun Tej Lavanya Tripathi Wedding: ఓటీటీలో వరుణ్, లావణ్య పెళ్లి వీడియో - డీల్ విలువ అన్ని కోట్లా?
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియోని ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయనున్నట్లు సమాచారం.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. నవంబర్ 1న వరుణ్ - లావణ్య పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అది కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వరుణ్ - లావణ్య వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో ఈ జంట పెళ్లి జరిగింది. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు చాలా ఘనంగా జరిగాయి. వీరి పెళ్లికి మెగాస్టార్ దంపతులు, రాంచరణ్ ఉపాసన, అల్లు అర్జున్ దంపతులు, నితిన్ ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. కాగ టైల్ పార్టీతో మొదలై హాల్ది, సంగీత వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పెళ్లికి ముందే హైదరాబాదులో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి.
పెళ్లి చేసుకుని తాజాగా హైదరాబాద్ కి తిరిగి వచ్చిన ఈ కొత్త కొత్త జంట గ్రాండ్ గా రిసెప్షన్ వేడుకలు నిర్వహించారు. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ రిసెప్షన్ పార్టీలో లావణ్య త్రిపాఠి గోల్డ్ కలర్ సారీ లో ట్రెడిషనల్ లుక్ తో సింపుల్ గా కనిపించి ఆకట్టుకుంది. పార్టీకి వచ్చిన అతిధులందరితో ఎంతో ఓపికగా వరుణ్, లావణ్య ఫోటోలు దిగారు. ప్రస్తుతం రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా అభిమానుల కోసం వరుణ్ తేజ్ ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అదేంటంటే వరుణ్ - లావణ్య పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను ఓటీటీలో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో వరుణ్ తేజ్ - లావణ్య కి సంబంధించిన పెళ్లి వీడియో ప్రసారం కానున్నట్లు సమాచారం. ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ సంబంధించిన వీడియోను అభిమానులు అందరూ చూసేలా ఓటిటిలో ప్రసారం చేయనున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా వీరి పెళ్లి వీడియో ప్రసార హక్కులను దాదాపు రూ.8 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా గతంలో కోలీవుడ్ కపుల్స్ నయనతార - విగ్నేష్ శివన్, హన్సిక - సోహెల్ వంటి సెలబ్రిటీస్ తమ మ్యారేజ్ వేడుకలను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుణ్, లావణ్య పెళ్లి వేడుక కూడా ఓటీటీ లో ప్రసారం కాబోతుందనే వార్త తెలిసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా 'గాండీవ దారి అర్జున'(Gandeevadhari Arjuna( సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మెగా హీరో ప్రస్తుతం 'ఆపరేషన్ వాలెంటైన్'(Operation Valentine) అనే సినిమాలో నటిస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ఇలాంటి పరిస్థితి రావడం భయానకం - మార్ఫింగ్ వీడియోపై రష్మిక స్పందన ఇదే
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial