Dhandoraa Teaser : చావు బతుకుల మధ్య ఎమోషన్ - ఆసక్తికరంగా 'దండోరా' టీజర్
Dhandoraa Teaser Reaction : తెలంగాణ గ్రామీణ నేపథ్యం, సామాజిక అంశాలే ప్రధానంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'దండోరా'. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Sivaji's Dhandoraa Teaser Review : శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'దండోరా'. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన లుక్స్ ఆకట్టుకుంటుండగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తుండగా... సమాజంలో అసమానతలు, తెలంగాణ గ్రామీణ నేపథ్యం బ్యాక్ డ్రాప్‌లో డైలాగ్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది.
టీజర్ ఎలా ఉందంటే?
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లోని ఓ గ్రామంలో ఓ అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీతో ప్రారంభమైన టీజర్... ఆర్థిక అసమానతలు, సమాజంలో కుల వివక్ష అంశాలను టచ్ చేస్తూ ఆలోచింపచేస్తోంది. 'చావుకు కూడా మ్యాచింగ్ డ్రెస్‌లు వేసుకోవాలని ఎవరు చెప్పారు?' అంటూ నందు చెప్పే డైలాగ్, 'మేం తంతే లేవనోళ్లు... అయినొచ్చి గోకితే లేస్తరాని ఎందివయా ఇది' అని వెటకారంగా నవదీప్ చెప్పే డైలాగ్... పల్లెటూర్లో సర్పంచ్‌గా నవదీప్ దర్బం... ఇలా కొన్ని సీన్స్ కామెడీ టచ్‌తో సాగేలా ఉన్నాయి.
వేశ్యగా బిందు మాధవి
ఈ మూవీలో బిందు మాధవి శ్రీలత పాత్రలో వేశ్యగా నటిస్తున్నారు. 'ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని... వాళ్లు డబ్బులిస్తున్నారు... నేను వాళ్లకు సర్వీస్ చేస్తున్నా.' అంటూ శివాజీతో చెప్పే డైలాగ్‌తో టీజర్‌లో ఆమె పాత్రను పరిచయం చేశారు. పల్లెటూరి కామెడీ టచ్‌తో పాటు కుల వివక్షను సైతం ఎమోషనల్‌గా చూపించారు. ఓ శవాన్ని ఊరి చివరకు తీసుకెళ్తుండగా... మా అవ్వను ఎందుకు అంత దూరం తీసుకెళ్తున్నారని ప్రశ్నించడం... టీజర్ క్లైమాక్స్‌లో శవాన్ని దించుతుండగా అది కింద పడిపోవడం హార్ట్ టచింగ్ అనిపించాయి. చావు బతకుల మధ్య మనిషి ఎదుర్కొనే పరిణామాలతో పాటు కుల వివక్ష, ఎమోషన్స్ అన్నింటినీ టచ్ చేసేలా 'దండోరా' రూపొందుతోందని తెలుస్తోంది.
అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నా... అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతుందనే అంశాలను ఇందులో చూపించినట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యం, మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వెటకారం, కామెడీ, హార్ట్ టచింగ్ ఎమోషన్ కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు.
క్రిస్మస్ బరిలో...
'కలర్ ఫోటో', 'బెదురులంక 2021' మూవీస్ నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ రవీంద్ర బెనర్జీ 'దండోరా'ను నిర్మిస్తున్నారు. శివాజీ, బిందు మాధవి, నవదీప్‌లతో పాటు రవికృష్ణ, మౌనికా రెడ్డి, అనూష, మనికా చిక్కాల, రాద్యా తదితరులు కీలకపాత్రలు పోషించారు. అలాగే, అదితి భావరాజు సైతం కీ రోల్ ప్లే చేశారు. కె రాబిన్ మ్యూజిక్ అందించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
A Dramatic End To The Year and it begins with the powerful #DhandoraaTeaser💥
— Loukya entertainments (@Loukyaoffl) November 17, 2025
Get ready to witness a powerful tale unfold IN CINEMAS from 25-12-25 ❤️🔥#Dhandoraa Teaser Out Now
Link : https://t.co/UrRIXQ2tQY
A @iamMarkKRobin musical 🎵
Event by @Jmedia_factory@Afilmby_Murali pic.twitter.com/z3jYu0swwT





















