Chandreshwara: ఆర్కియాలజీ నేపథ్యంలో డివోషనల్ టచ్ ‘చంద్రేశ్వర’... రిలీజ్ అప్డేట్ ఇదే
Chandreshwara Movie: ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషనల్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘చంద్రేశ్వర’. ఈ మూవీ విడుదలకు సంబంధించిన మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే

Chandreshwara Movie Update: ‘చంద్రేశ్వర’.. టైటిల్ వింటేనే ఇదొక డివోషనల్ మూవీ అనేది అర్థమవుతోంది. మంచి కంటెంట్‌తో వచ్చే డివోషనల్ మూవీస్‌కు ప్రేక్షకులు బ్రహ్మారథం పడతారనే విషయం ఇప్పుడు కాదు... ఎప్పటి నుంచో తెలుస్తూనే ఉంది. ‘దేవుళ్లు’, ‘శ్రీరామదాసు’, ‘అన్నమయ్య’ నుంచి ఇటీవల వచ్చిన ‘కార్తికేయ’ వరకు చూసుకుంటే... ప్రేక్షకులు ఈ సినిమాలను ఎలా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడలాంటి డివోషనల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘చంద్రేశ్వర’ మూవీ.
శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరోహీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డాక్టర్ రవీంద్ర చారి నిర్మిస్తున్నారు. సస్పెన్స్‌తో కూడుకున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘అఖిల నన్ను పట్టించుకోవే’ సాంగ్ సరిగమ మ్యూజిక్ సంస్థ ద్వారా విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. రాబోయే ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు, సినిమా కూడా ప్రేక్షకులని అత్యద్భుతంగా అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ పి. సరిత మాట్లాడుతూ, ‘చంద్రేశ్వర’ మూవీలో ఆడియెన్స్‌ని అలరించే, మెప్పించే కంటెంట్, సాంగ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్‌ని ఆదరించినట్లే, సినిమాను కూడా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రేక్షకుల మద్దతు మా సినిమాకు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. కో ప్రొడ్యూసర్ వి. బాలకృష్ణ మాట్లాడుతూ, ఇటీవల మా ‘చంద్రేశ్వర’ మూవీలోని పాటను విడుదల చేశాం. ఆ పాటకు చాలా మంచి స్పందన వస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ‘చంద్రేశ్వర’ మూవీని అంతా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.
చిత్ర నిర్మాత డాక్టర్ రవీంద్ర చారి మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాను. మధ్యలో కొన్ని కథలు విన్నాను కానీ, ‘చంద్రేశ్వర’ మూవీతో నేను పరిశ్రమలోకి అడుగుపెట్టాలని రాసి ఉంది. ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషనల్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఏ టెక్నాలజీ లేని కాలంలో మన పూర్వీకులు గొప్ప గొప్ప దేవాలయాలు చాలా గొప్పగా నిర్మించారు. అప్పటి వారి జీనవ విధానం ఎలా ఉండేది? అనే అంశాలను ఇందులో అత్యద్భుతంగా చెప్పబోతున్నాం. డివోషనల్ టచ్‌తో పాటు మంచి కామెడీ కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఈ ఏప్రిల్‌లోనే మా ‘చంద్రేశ్వర’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. సురేష్ రవి, ఆశ వెంకటేష్, నిలగల్ రవి, బోసే వెంకట్, ఆడుకాలం మురుగదాస్ గజరాజ్, జెఎస్కే గోపి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.





















