Deepika Padukone: 'కల్కి' సీక్వెల్ నుంచి తీసేశాక దీపికా ఫస్ట్ పోస్ట్ - షారుక్ మూవీ కోసం ప్రభాస్ సినిమా వదులుకున్నారా?
Deepika Padukone Post: 'కల్కి 2898AD' సీక్వెల్ నుంచి దీపికాను తప్పించడంపై చర్చ సాగుతున్న క్రమంలో దీపికా పోస్ట్ వైరల్‌గా మారింది. షారుక్ తనకు నేర్పిన పాఠం గురించి ప్రస్తావించారు.

Deepika Padukone Insta Post Viral After Remove From Kalki 2898AD: గత 2 రోజులుగా సోషల్ మీడియా ఒకటే టాపిక్ ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ 'కల్కి 2898AD' సీక్వెల్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ను తప్పించడమే. దీనిపై ఇటు ఇండస్ట్రీలో అటు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైతం 'జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ తర్వాత ఏం జరగాలో మీరు మార్చుకోవచ్చు.' అంటూ పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. తాజాగా హీరోయిన్ దీపికా కొత్త మూవీ గురించి పోస్ట్ చేయగా ట్రెండ్ అవుతోంది. ఆమె 'కల్కి' కాంట్రవర్శీ గురించే ఈ పోస్ట్ చేశారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
అది నాకు నేర్పిన పాఠం
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో కలిసి ఆరో మూవీ చేయడంపై దీపికా ఆనందం వ్యక్తం చేశారు. షారుఖ్ తనకు నేర్పిన పాఠం గురించి ఆ పోస్టులో ప్రస్తావించారు. '18 ఏళ్ల క్రితం 'ఓం శాంతి ఓం' మూవీ చేస్తున్నప్పుడు నాకు షారుక్ కొన్ని పాఠాలు నేర్పారు. సినిమా నుంచి మనం ఏం నేర్చుకున్నాం. అందులో ఎవరితో చేస్తున్నామనే విషయాలే... మూవీ సక్సెస్ కంటే ప్రాధాన్యమైన అంశాలని చెప్పారు. నేను ఆ మాటలను పూర్తిగా నమ్ముతాను. అప్పటి నుంచి నేను తీసుకునే ప్రతీ నిర్ణయం వెనుక ఆ పాఠాన్నే అమలు చేస్తున్నా.' అని పోస్ట్ చేశారు.
అయితే, 'కల్కి 2898AD' నుంచి తనను తప్పించడంపైనే దీపికా ఈ పోస్ట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆ పోస్టుకు ప్రాజెక్టు నుంచి ఆమెను తప్పించడానికి సంబంధమే లేదని అంటున్నారు. ప్రస్తుతం దీపికా షారుక్‌తో 'కింగ్' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram
Also Read: ముద్దులతో రెచ్చిపోయిన కిరణ్ అబ్బవరం - ఘాటుగా 'కే ర్యాంప్' టీజర్... చూశారా?
అసలేం జరిగిందంటే?
డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898AD'. సిల్వర్ స్క్రీన్‌పై ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1100 కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో దీపికా పదుకోన్ సుమతి పాత్రలో నటించారు. అయితే, సీక్వెల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో రెండు రోజుల క్రితం చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సీక్వెల్ నుంచి దీపికాను తప్పిస్తున్నట్లు ప్రకటించింది.
రెమ్యునరేషన్, వర్క్ అవర్స్ విషయంలో దీపికా పట్టుబట్టడంతో మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. స్టోరీకి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారనే చర్చ ఇప్పుడు మొదలైంది. దీనిపై మేకర్స్ రియాక్ట్ కావాల్సి ఉంది.





















