కన్నడ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన దీపికా ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ స్టార్ అయ్యారు.
దీపికా పదుకోన్ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాయి. దీపిక నటించిన 9 కమర్షియల్ హిట్ సినిమాలు ఇవే.
దీపికా పదుకోన్, ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఈ సినిమా కలెక్షన్స్ రూ. 1200 కోట్లు. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' రికార్డు సృష్టించింది.
హాలీవుడ్ యాక్షన్ చిత్రమిది. పాండోర్స్ బాక్స్ అనే ఒక ఆయుధాన్ని కనుగొనేందుకు గవర్నమెంట్ జాండర్ కేజ్ అనే డేర్ డెవిల్ లాంటి ఏజెంట్ ని నియమిస్తుంది. ఇక ఈ సినిమా దాదాపు రూ.2350 కోట్ల కలెక్షన్ సాధించింది.
దీపికా పదుకోన్, షారూఖ్ ఖాన్ కలిసి నటించిన సినిమా 'పఠాన్'. ఈ సినిమా రూ.1050 కోట్ల కలెక్షన్ రాబట్టింది. టెర్రరిస్ట్ లు ఇండియాపై అటాక్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా దాన్ని ఇండియన్ ఏజెంట్ షారుక్ ఖాన్ తిప్పడికొడతాడు.
'చెన్నై ఎక్స్ ప్రెస్' కలెక్షన్లు రూ.423 కోట్లు. ఈ సినిమాలో కూడా షారుక్ ఖాన్, దీపికా పదుకోన్ కలిసి నటించారు. తన తాత కోరిక తీర్చేందుకు హీరో ప్రయాణం అవ్వగా అనుకోకుండా అది అడ్వంచరస్ ట్రిప్ అవుతుంది.
'హ్యాపీ న్యూఇయర్ ' సినిమాను ఫరా ఖాన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా దాదాపు రూ.408 కోట్లు వసూళ్లు సాధించింది.
ముస్లిం యువరాణి మస్తానీ, మరాఠ పోరాటయోథుడు బాజీరావ్ కి మధ్య చిగురించిన ప్రేమ కథ 'బాజీరావ్ మస్తానీ'. ఈ సినిమా దాదాపు రూ.356 కోట్ల కలెక్షన్లు సాధించింది.
'ఫైటర్' సినిమాని ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఇది హై ఆక్టైన్ ఏరియల్ యాక్షన్ ఫిలిం. ఈ సినిమాకి దాదాపు రూ.337 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, దీపిక జంటగా నటించారు. ఈ సినిమా రూ.320 కోట్ల కలెక్షన్ రాబట్టింది. స్నేహం, ప్రేమ గురించి తెలియజేసే సినిమా ఇది.
ఖిల్జీ హయాంలో రాణి పద్మావత్ చూపించిన ధైర్య సాహసాలు, ఆమె తెగువ గురించి తెలియజేస్తూ ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకి రూ.302 కోట్ల కలెక్షన్ వచ్చింది.