Deepika Padukone: బాలీవుడ్ ఖాన్స్‌ను వెనక్కి నెట్టిన దీపికా పదుకొనె - ఆ విషయంలో ఆమే ఫస్ట్!
IMDb Most Viewed Indian Stars: గత దశాబ్దంలో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినీ సెలబ్రిటీల లిస్ట్‌ను బయటపెట్టింది ఐఎమ్‌డీబీ. ఇందులో బాలీవుడ్ ఖాన్‌లను సైతం వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంది దీపికా
Deepika Padukone: ఐఎమ్‌డీబీ.. ఎప్పటికప్పుడు పాపులర్ సెలబ్రిటీల లిస్ట్‌ను విడుదల చేస్తుంటుంది. ప్రతీ నెల ఈ లిస్ట్‌లో సెలబ్రిటీల ర్యాంక్స్ మారుతూనే ఉంటాయి. మొదటిసారి IMDb గత దశాబ్దంలో బాగా పాపులారిటీ సంపాదించిన టాప్ 100 సెలబ్రిటీల లిస్ట్‌ను ప్రిపేర్ చేసింది. ఈ జాబితాలో మొదటి 10 స్థానాల్లో బాలీవుడ్ సెలబ్రిటీలే ఉండడం విశేషం. అయితే బాలీవుడ్‌లో ఎంతోకాలంగా ఉన్న స్టార్ సెలబ్రిటీలను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని సంపాదించుకుంది దీపికా పదుకొనె. ఐఎమ్‌డీబీలో నెటిజన్లు.. ఏ సెలబ్రిటీలను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అనేదానిపై ఈ లిస్ట్ ప్రిపేర్ అయ్యింది.
రెండో స్థానంలో షారుఖ్..
జనవరి 2014 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఐఎమ్‌డీబీ ర్యాంకింగ్‌ను బట్టి, సెలబ్రిటీల పేజ్ సెర్చ్‌ను బట్టి ఈ లిస్ట్ తయారు చేశామని ఐఎమ్‌డీబీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ నెల ఐఎమ్‌డీబీని చూసేవారి సంఖ్య 250 మిలియన్ ఉంటుందని బయటపెట్టింది. ఇక గత దశాబ్దంలో టాప్ 10 ర్యాంకింగ్ విషయానికొస్తే.. టాప్ 1 స్థానంలోకి దీపికా పదుకొనె నిలిచింది. తన తరువాతి స్థానంలో అంటే టాప్ 2లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఉన్నాడు. టాప్ 3ను మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ దక్కించుకుంది. ఐశ్వర్య రాయ్ సినిమాల్లో నటించకపోయినా తన పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు అనడానికి ఈ లిస్టే నిదర్శనం అంటున్నారు ఫ్యాన్స్.
మరణించినా కూడా..
ఐఎమ్‌డీబీ లిస్ట్‌లో టాప్ 4లో ఆలియా భట్ ఉంది. హీరోయిన్‌గా పరిచయమయినప్పటి నుంచి ఆలియా క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూనే వస్తోంది. ముఖ్యంగా గత దశాబ్దంలో ఆలియా గ్రాఫ్ మరింత పెరిగిపోయింది. దీంతో ఈ లిస్ట్‌లో టాప్ 4 స్థానం తనకు సొంతమయ్యింది. టాప్ 5 స్థానంలో ఇర్ఫాన్ ఖాన్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఉన్నారు. ఇక యంగ్ ఏజ్‌లోని సూసైడ్ చేసుకొని మరణించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. టాప్ 7 స్థానాన్ని దక్కించుకున్నాడు. టాప్ 8 స్థానాన్ని సల్మాన్ ఖాన్, టాప్ 9ను హృతిక్ రోషన్, టాప్ 10 ర్యాంక్‌ను అక్షయ్ కుమార్ దక్కించుకున్నారు.
Presenting the Top 100 Most Viewed Indian Stars of the Last Decade on IMDb, globally! 📣✨
— IMDb India (@IMDb_in) May 29, 2024
Do you spot your favourites?
The Top 100 Most Viewed Indian Stars of the Last Decade on IMDb list is based on the IMDb weekly rankings from January 2014 through April 2024. These… pic.twitter.com/4h8IEEwMAZ
గర్వంగా అనిపిస్తుంది..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలను దాటుకుంటూ వచ్చి ఐఎమ్‌డీబీ లిస్ట్‌లో టాప్ 1 స్థానాన్ని దక్కించుకోవడంపై దీపికా పదుకొనె స్పందించింది. ‘‘ఇలాంటి గుర్తింపు దక్కడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అంతే కాకుండా ఇది.. నేను ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలని, వారు ఇచ్చే ప్రేమను తిరిగి ఇవ్వాలని గుర్తుచేస్తుంటుంది’’ అంటూ తన సంతోషాన్ని బయటపెట్టింది దీపికా. ప్రస్తుతం మెటర్నిటీ లీవ్‌లో ఉన్న దీపికా పదుకొనె.. త్వరలోనే ‘కల్కి 2898 AD’ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా ఈ భామ తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకుంది.
Also Read: ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు రొమాంటిక్ సీన్ షూట్ చేశారు - జాన్వీ కపూర్