Deepika Padukone: 'కల్కి' డబ్బింగ్ వర్క్ పూర్తి చేసుకున్న దీపికా - ఆ మూడు భాషల్లో స్వయంగా వాయిస్..
Deepika Padukone Dubbing: దీపికా పదుకొనె కల్కిలో తన పాత్రకు డబ్బింగ్ వర్క్ పూర్తి చేసిందట. ఆ మూడు భాషల్లో స్వయంగా ఆమె వాయిస్ ఇచ్చినట్టు సమాచారం.
Deepika Padukone Compeletes Kalki Dubbing Work: ప్రభాస్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ 'కల్కి 2898 AD' రిలీజ్‌కి అంతా సిద్ధమవుతుంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో కల్కి టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను మొదలుపెట్టేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ఈ సినిమాతోనే దీపికా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని తన షూటింగ్ పూర్తి చేసుకున్న దీపికా తాజాగా తన డబ్బింగ్ వర్క్‌ను కూడా పూర్తి చేసుకున్నారట. హిందీ, కన్నడ భాషల్లో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పినట్టు చెప్పినట్టు సమాచారం.
కాగా ప్రస్తుతం దీపికా గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అయిదు నెలల గర్భంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి జూన్ నెల నుంచి విశ్రాంతి తీసుకోనుందట. అందుకే కల్కిలోని తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ వర్క్‌ని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అలాగే దీపికా కోసం స్పెషల్ ఇంటర్వ్యూలని చిత్ర యూనిట్ ముందుగానే ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక హిందీ, తెలుగు, కన్నడ వెర్షన్‌లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న దీపికాకు ఇతర భాషల్లో వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించనున్నారని సమాచారం. హీరో రణ్‌వీర్ సింగ్–దీపికా పదుకోనెలు 2018 నవంబర్ 14న వీరి వివాహం జరిగింది. పెళ్లయిన ఆరేళ్లకు ఈ జంట గుడ్‌న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేశారు. కాగా కల్కి మూవీ వరల్డ్ వైడ్‌గా జూన్ 27న విడుదల కానుంది.
మహేష్ వాయిస్ ఓవర్
అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్, టీజర్‌లతో మూవీ మరింత హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు ఈ సినిమాలో భారీ తారాగణం ఈ చిత్రంలో భాగమైంది. విశ్వనటుడు లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దుల్కర్ సల్మాన్, దిశ పటాని వంటి అగ్రనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటూ ఓ వార్త ఇటీవల బయటకు వచ్చింది.
Also Read: నాగబాబు టార్గెట్ ఎవరు? పరాయివాడు అన్నది మేనల్లుడు బన్నీనా?
ఈ విషయమై నాగ్ అశ్విన్ మహేష్‌ని కూడా కలిసినట్టు టాక్. ఒకవేళ ఇదే నిజమయితే మాత్రం ప్రభాస్, మహేష్ ఫ్యాన్సకి మత్రమే పండగే అని చెప్పాలి. కల్కి మూవీని హిందూ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా నాగ్ అశ్విన్ సోషియో ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నారు. ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉంటుందో చూపిస్తూ విజువల్ వండర్‌గా ఊహాజనిత ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారట. కల్కి కథ మహాభారతం కాలం నుంచి క్రీ.శ. 2898 మధ్య జరిగే 6000 సంవత్సరాల చూపిస్తుందని, దీంట్లో ప్రధాన పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టూ ఉంటాయని సినీవర్గాలు అంటున్నాయి.