Darling Release Trailer: మొగుడు పెళ్ళాల గొడవలోకి సందీప్ రెడ్డి వంగాను తీసుకొచ్చారుగా - వాటీజ్ థిస్ డార్లింగ్
Priyadarshi Nabha Natesh: ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన 'డార్లింగ్' ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే... సందీప్ రెడ్డి వంగా టచ్ ఇచ్చారు.

Darling Movie 2024: టాలెంటెడ్ ఆర్టిస్ట్, కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) నటించిన లేటెస్ట్ సినిమా 'డార్లింగ్'. ఇందులో ఇస్మార్ట్ పోరి నభా నటేష్ హీరోయిన్. రెండేళ్ల విరామం తర్వాత ఆవిడ నటించిన చిత్రమిది. ఈ నెల 19న థియేటర్లలోకి వస్తుందీ సినిమా. సోమవారం రాత్రి ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. అందులో రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.
సందీప్ రెడ్డి వంగా చెప్పిన దాని ప్రకారం...
Darling Movie Release Trailer Review: 'డార్లింగ్' రిలీజ్ ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు, చివర్లో 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' 'యానిమల్' సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను ప్రస్తావిస్తూ చెప్పిన డైలాగ్ మరొక ఎత్తు.
'అకార్డింగ్ టు సందీప్ రెడ్డి వంగా... నీ పెళ్ళాం నిన్ను కొట్టొచ్చు. నా పెళ్ళాం నన్ను కొట్టొచ్చు. కానీ, నీ పెళ్ళాం నిన్ను కొట్టి, నీ స్నేహితులను కూడా కొట్టుడు ఏందిరా? ఇది ఏ డైరెక్టర్ చెప్పలేదు' అని హీరోతో అతని స్నేహితుడు చెబుతాడు. ఇది ఒక రేంజ్‌లో పేలింది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య చెయ్యి చేసుకునే సన్నివేశాలు ఉన్నాయి. వాటిపై విమర్శలు సైతం వచ్చాయి. ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్ఛ లేనప్పుడు అది ప్రేమ ఎలా అవుతుందని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. అది గుర్తు చేసేలా డైలాగ్ రాశారు అన్నమాట.
దేవుడు దెయ్యం ఉన్నట్టు పెళ్ళాం కూడా!
''ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు. దెయ్యం ఉంది. అలాగే, పెళ్ళాం కూడా'' అని హీరో ఫ్రెండ్ చెప్పే డైలాగుతో 'డార్లింగ్' రిలీజ్ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పెళ్ళాం రోల్ చేసిన హీరోయిన్ నభాను దెయ్యం టైపులో చూపించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ చూస్తే... నభా నటేష్ అపరిచితురాలు రోల్ చేశారని అర్థం అవుతోంది. మ్యాడ్ మ్యాక్స్ మ్యారేజ్ అండ్ ఫన్ ఫిల్మ్ అని 'డార్లింగ్' నమ్మకం కలిగించింది.
Also Read: తేజుకు అనసూయ రిప్లై... సైలెంట్‌గా ఇచ్చి పడేసిన స్ట్రాంగ్ లేడీ
'హనుమాన్' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత కె నిరంజన్ రెడ్డి తన శ్రీమతి చైతన్యతో కలిసి ప్రొడ్యూస్ చేసిన సినిమా 'డార్లింగ్'. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు.
Also Read: కిరణ్ అబ్బవరం 2.0 - కాంతార రేంజ్‌లో 'క' టీజర్, ఆ విజువల్స్ చూశారా?
Darling Movie 2024 Cast And Crew: ప్రియదర్శి పులికొండ, నభా నటేష్ జంటగా నటించిన 'డార్లింగ్' సినిమాలో బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల ప్రధాన తారాగణం. ఈ సినిమాకు రచన - దర్శకత్వం: అశ్విన్ రామ్, నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య, నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, సంగీతం: వివేక్ సాగర్, ఛాయాగ్రహణం: నరేష్ రామదురై, కూర్పు: ప్రదీప్ ఇ రాఘవ, మాటలు: హేమంత్, ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

