Prabhas Maruthi Movie : 'రాధే శ్యామ్' ఫ్లాపైనా అతనికి ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ - నో చేంజ్ డార్లింగ్!
Raja Deluxe Movie Update : ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ని కన్ఫర్మ్ చేశారు.
వినోదానికి కేరాఫ్ అడ్రస్ దర్శకుడు మారుతి (Director Maruthi) తీసే సినిమాలు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే కామెడీ అందించడం ఆయన స్టైల్. ఈ దర్శకుడు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు! ఇప్పుడు చేస్తున్న సినిమా మరో ఎత్తు! పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయలేదు. షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ సినిమా సంగీత దర్శకుడిని కన్ఫర్మ్ చేశారు.
తమన్ సంగీతంలో ప్రభాస్ - మారుతి సినిమా!
ప్రభాస్, మారుతి సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారని తెలిసింది. ఈ విషయంలో హీరో, దర్శకుడు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. 'రాధే శ్యామ్'కు తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఆ సినిమా విడుదలైన తర్వాత ప్రభాస్ అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమన్ బదులు మరొకరిని తీసుకోవచ్చని ప్రచారం జరిగింది. అటువంటిది ఏమీ లేదని, తమన్ (Thaman)ను చేంజ్ చేయడం లేదని తెలిసింది.
తమన్... నో చేంజ్!
యువి క్రియేషన్స్ నిర్మించిన 'భాగమతి'కి తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. అంతే కాదు... మారుతి దర్శకత్వం వహించిన 'మహానుభావుడు', 'ప్రతి రోజూ పండగే' సినిమాలకు కూడా మంచి సంగీతం అందించారు. అందుకని, తమన్ బదులు మరొకరి పేరును కూడా ఆలోచించడం లేదట! ఆల్రెడీ ప్రభాస్ కోసం తమన్ డిఫరెంట్ & ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభాస్, మారుతి సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఆల్రెడీ చేసిన షూటింగ్ నుంచి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. అందులో ప్రభాస్ బొట్టు పెట్టుకుని కనబడుతున్నారు. మారుతి కామెడీ సీన్స్, ప్రభాస్ టైమింగ్ కలిసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడం పక్కా అట!
Also Read : టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ మీడియా - మరీ ఇంత దారుణమా?
ముగ్గురు హీరోయిన్లు ఎవరు?
ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు? అని చర్చ జరుగుతోంది. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లకు చోటు ఉంది. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, 'రాధే శ్యామ్' సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన రాజ్ తరుణ్ 'లవర్స్' ఫేమ్ రిద్ధి కుమార్ ఎంపిక అయ్యారని తెలిసింది. ఆల్రెడీ లీక్ అయిన స్టిల్స్ చూస్తే... ప్రభాస్, రిద్ధీ కుమార్ ఉన్నారు. అయితే, ఎవరి క్యారెక్టర్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. హారర్ కామెడీతో ఈ సినిమా రూపొందుతోంది.
'రాజు డీలక్స్'... టైటిల్ ఖరారు చేసినట్టేనా?
ప్రభాస్, మారుతి సినిమా అనౌన్స్ చేయడానికి ముందు నుంచి 'రాజు డీలక్స్' టైటిల్ ప్రచారంలో ఉంది. దాదాపుగా ఆ టైటిల్ ఖరారు కావచ్చని సమాచారం. శ్రీరాముని పాత్రలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా జూన్ 16న విడుదల కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 28న 'సలార్' సినిమా వస్తుంది. ఆ వెనుక 'ప్రాజెక్ట్ కె' ఉంది. వీటి మధ్యలో 'రాజు డీలక్స్' అప్డేట్స్ ఇవ్వడం ఎందుకు? అని యూనిట్ భావిస్తోందట. దర్శకుడు మారుతికి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది. దీనిపై యువి క్రియేషన్స్ చాలా నమ్మకంగా ఉంది.
Also Read : డింపుల్ వర్సెస్ ఐపీఎస్ రాహుల్ కేసులో బల్దియాకు చిక్కులు, అలా ఎలా వదిలేశారు సార్?