Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
నటి తాప్సీపై కేసు నమోదైంది. హిందూ దేవుళ్ల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించినందుకు ఆమెపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
![Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు Complaint against Taapsee Pannu for allegedly hurting religious sentiments Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/28/efd215d11319f018ae8c15356ff30b1f1680014567182239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సినీ నటి తాప్సీపై కేసు నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా, అశ్లీలతను వ్యాప్తి చేసేలా ప్రవర్తించినందుకు ఆమెపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌర్ ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో మార్చి 14, 2023 న ఒక వీడియోను అప్‌లోడ్ చేసిందని గౌర్ తెలిపారు. ఈ వీడియోలో తాప్సీ అభ్యంతరకర దుస్తులతో పాటు, లక్ష్మీ దేవి లాకెట్ ఉన్న నెక్లెస్ ను ధరించినట్టు బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే...
టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోన్న యాక్ర్టెస్ తాప్సీ పన్ను.. తనకిచ్చిన క్యారెక్టర్ ను న్యాయం చేసేందుకు శత విధాలా ప్రయత్నించడంలో ఎప్పుడూ ముందుంటారు. హీరో మంచు మనోజ్ నటించిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత వచ్చిన ప్రతీ ఛాన్స్ నూ వదులుకోకుండా ఇండస్ట్రీలో కష్టపడుతూ వస్తున్నారు. ఈ తరుణంలోనే తాప్సీ రీసెంట్ గా ఓ ఫ్యాషన్ వీక్ లో పాల్గొని వివాదాల్లో చిక్కుకున్నారు. మార్చి 12న ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తాప్సీ ర్యాంప్ వాక్‌లో పాల్గొని, అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్నారు. ఈ ఫ్యాషన్ షోలో ఆమె రెడ్ డ్రెస్ వేసుకొని, ఓ నెక్లెస్ ధరించారు. అది కూడా లక్ష్మీ దేవి పెండెంట్ ఉన్న హారం. దీంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. హిందూ దేవతలను అవమానిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.
View this post on Instagram
ఈ సందర్భంగా తాప్సీ పన్ను చేసిన ఫొటో షూట్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. అందాన్ని చూపించే క్రమంలో మితిమీరి చేసే కొన్ని ప్రదర్శనలు ఇలా ఇరకాటంలో పడేస్తాయనడానికి ఇదే రుజువు. దీనిపై గత కొన్నిరోజుల నుంచి ట్రోల్స్, మీమ్స్ హల్ చల్ చేస్తుండగా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి చెందిన హిందూత్వ సంస్థ హింద్ రక్షక్ సంఘటన్ తాప్సీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందువులను అవమానించేలా, అశ్లీలతను వ్యాప్తి చేసేలా సినీ నటి తాప్సీ పన్ను ప్రదర్శన ఉందని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ సందర్భంగా సినీ నటి తాప్పీపై బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు, హింద్ రక్షక్ సంఘటన్ కన్వీనర్ ఏకలవ్య గౌర్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
View this post on Instagram
ఈ ఏడాది మార్చి 14న తాప్పీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారని, ఆ వీడియో ఒక ఫ్యాషన్ షోకు చెందినదని, అందులో తాప్సీ అసభ్యకరమైన దుస్తులు ధరించారని గౌర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్యకరమైన దుస్తులు ధరించడంతోపాటు తన మెడలో లక్ష్మీదేవి అమ్మవారి లాకెట్‌ను తాప్సీ ధరించారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోలీసులకు అందచేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
Read Also: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)