అన్వేషించండి

'ఈగల్' కోసం డోస్ పెంచుతున్న రవితేజ - అదే జరిగితే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ!

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'ఈగల్' మూవీ కోసం కామెడీ డోస్ పెంచమని మూవీ టీం కి రవితేజ సూచనలు ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యకాలంలో తన మార్క్ ఆఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ని వదిలేసి ప్రయోగాలు చేస్తున్నారు. అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో రవితేజ చేసిన 'రామారావు ఆన్ డ్యూటీ', 'ఖిలాడి', 'రావణాసుర' లాంటి సినిమాలన్నీ ఈ కోవకు చెందినవే. వీటి తరువాత వచ్చిన 'ధమాకా' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. డైరెక్టర్ త్రినాధరావు ఈ సినిమాలో రవితేజ మార్క్ ఆఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించాడు. అందుకే ధమాకా లో స్టోరీ పెద్దగా లేకపోయినా రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ తోనే సినిమా పెద్ద హిట్ అయింది.

రవితేజ సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే కచ్చితంగా ఆయన మార్క్ ఆఫ్ కామెడీ ఉంటుందని ఆడియన్స్ అంతా భావిస్తుంటారు. కానీ గత కొద్ది కాలంగా అది కనిపించడం లేదు. ఆ రీజన్ తోనే ఇటీవల విడుదలైన 'టైగర్ నాగేశ్వరావు' మూవీ కూడా అనుకునంత స్థాయిలో ఆకట్టుకులేకపోయింది. సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు కాబట్టి కలెక్షన్స్ కి కొదవలేదు. అది వేరే విషయం. కానీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ రవితేజ నుంచి కోరుకునే ఎంటర్టైన్మెంట్ సినిమాలో లేదు. అయితే తాజాగా ఈ విషయం తెలిసి రవితేజ అలర్ట్ అయ్యారట. దాంతో తన తదుపరి చిత్రంలో కామెడీ డోస్ కాస్త పెంచమని మూవీ టీం కి సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

అంతేకాకుండా తరువాత అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ తో కామెడీ అండ్ యాక్షన్ మూవీస్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రవితేజ 'ఈగల్' బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతోంది. సినిమాటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కొన్ని కారణాలవల్ల ఈ మూవీ రిలీజ్ వాయిదా పడబోతుందని, జనవరి 26న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

వీటిపై తాజాగా ఈగల్ టీం స్పందిస్తూ అవన్నీ రూమర్స్ అని, ముందుగా అనుకున్న తేదీకి సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' తో పాటు మహేష్ బాబు 'గుంటూరు కారం', వెంకటేష్ 'సైంధవ్' తేజ సజ్జా 'హనుమాన్', విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' తదితర సినిమాలు పోటీ పడబోతున్నాయి. వీటిలో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటాయో చూడాలి.

ఇక 'ఈగల్' విషయానికొస్తే.. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నవదీప్, మధుబాల తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ విభిన్న తరహా పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

Also Read : షారుక్ బర్త్ డే గిఫ్ట్ - ఫన్ అండ్ ఎమోషనల్​గా 'డంకీ' టీజర్, మీరు చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Saripoyaru Iddaroo: 'శతమానం భవతి' దర్శకుడి కొత్త సినిమా... టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
'శతమానం భవతి' దర్శకుడి కొత్త సినిమా... టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
Dada Movie Update : దాదా సెట్స్‌లో బాలయ్య - గాయం తర్వాత కీలక సీన్స్ షురూ
దాదా సెట్స్‌లో బాలయ్య - గాయం తర్వాత కీలక సీన్స్ షురూ
Maremma OTT: రెండు ఓటీటీల్లోకి 'మారెమ్మ'... రవితేజ ఫ్యామిలీ హీరో మాధవ్ భూపతిరాజు సినిమా స్ట్రీమింగ్ ఎందులోనంటే?
రెండు ఓటీటీల్లోకి 'మారెమ్మ'... రవితేజ ఫ్యామిలీ హీరో మాధవ్ భూపతిరాజు సినిమా స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Romantic Movie OTT : ట్రెండింగ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ - పెద్దలకు మాత్రమే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ - పెద్దలకు మాత్రమే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget