అన్వేషించండి

Chiranjeevi Family Photo: విదేశాల్లో ఫ్యామిలీతో చిరంజీవి హాలిడే ట్రిప్ - మెగా ఈవెంట్ కోసం సిద్ధమంటూ ట్వీట్

Chiranjeevi shares Family Photo: చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత తాజాగా ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కు వెళ్లారు. లండన్ పార్కులో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు.

Chiranjeevi Latest Telugu News: టాలీవుడ్ సీనియర్ హీరోల్లో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండేది ఎవరంటే చాలామందికి గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. చిరు ఎక్కువగా తన సోషల్ మీడియాలో ప్రొఫెషనల్ కంటే పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలనే షేర్ చేసుకుంటారు. తన ఫ్యామిలీకి సంబంధించిన హ్యాపీ మూమెంట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. ప్రస్తుతం చిరంజీవి.. ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వారు దిగిన ఒక క్యాండిడ్ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు మెగాస్టార్. అసలు ఫారిన్ ట్రిప్ ఎందుకు అనే విషయాన్ని ఆయన బయటపెట్టారు.

లండన్ పార్క్‌లో చక్కర్లు..

మెగాస్టార్ షేర్ చేసిన ఫోటోలో చిరంజీవితో పాటు తన భార్య సురేఖ, రామ్ చరణ్‌తో పాటు తన భార్య ఉపాసన ఉన్నారు. వీరితో పాటు మెగా వారసులరాలు క్లిన్ కారా కూడా ఈ ఫోటోలో కనిపిస్తోంది. కానీ ఎప్పటిలాగానే క్లిన్ కారా మొహం కనిపించకుండా కవర్ అయ్యేలా ఫోటో తీసి షేర్ చేశారు చిరంజీవి. ‘ఫ్యామిలీతో కలిసి, నా మనవరాలు క్లిన్ కారాతో కలిసి లండన్‌లోని హైడ్ పార్క్‌లో ఒక ప్రశాంతమైన మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. రేపు ప్యారిస్‌కు ప్రయాణమవుతున్నాను. 2024 సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం ఎదురుచూస్తోంది’ అంటూ ఈ ఫారిన్ ట్రిప్‌కు ఒలింపిక్స్ ప్రారంభోత్సవమే కారణమని క్లారిటీ ఇచ్చారు చిరు.

వరుసగా షూటింగ్..

చిరంజీవి షేర్ చేసిన ఫోటోలో ఆయనతో పాటు రామ్ చరణ్ కూడా చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ మెగా హీరోలు ఇద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. చిరంజీవి అయితే కమర్షియల్, రీమేక్ సినిమాలను పక్కన పెట్టి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో బిజీ అయ్యారు. ఇప్పటికే ఇదొక ఫ్యాంటసీ డ్రామా అని మేకర్స్ స్పష్టం చేశారు. అందుకే బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకెళ్తోంది ‘విశ్వంభర’ టీమ్. బ్రేక్ లేకుండా చాలారోజుల పాటు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత చిరు మొదటిసారి ఫ్యామిలీతో కలిసి ఈ బ్రేక్ తీసుకున్నారు.

క్లారిటీ లేదు..

రామ్ చరణ్ విషయానికొస్తే.. గత కొంతకాలంగా తన అప్‌కమింగ్ సినిమాల నుండి ఎలాంటి అప్డేట్ లేదు. శంకర్ దర్శకత్వంలో చరణ్ ప్రారంభించిన ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్‌కు బ్రేక్ పడడంతో తన ఇతర చిత్రాలను ప్రారంభించడానికి కూడా టైమ్ తీసుకున్నాడు ఈ మెగా హీరో. ఫైనల్‌గా ఈ మూవీ డిసెంబర్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయని నిర్మాత దిల్ రాజు తాజాగా హింట్ ఇచ్చారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ ఫిక్స్ అవ్వగానే బుచ్చిబాబుతో ఓకే చేసిన ప్రాజెక్ట్‌లో అడుగుపెడతాడు చెర్రీ. ఆ తర్వాత సుకుమార్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది.

Also Read: ‘ఇంద్ర’ విడుదలై 22 ఏళ్లు - మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న సినిమా, రీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget