అన్వేషించండి

Indra Re Release: ‘ఇంద్ర’ విడుదలై 22 ఏళ్లు - మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న సినిమా, రీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Indra Re Release: చిరంజీవి హీరోగా నటించిన ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’ విడుదలయ్యి 22 ఏళ్లు పూర్తయ్యింది. దీంతో ఈ సినిమా రీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.

Indra Re Release Date: ఇప్పటికీ టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం చాలావరకు హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నా వాటి విడుదలకు మాత్రం సమయం పడుతోంది. అందుకే వారి కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిపోయిన చిత్రాలను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. అలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ‘ఇంద్ర’. ఇక ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఇదే కరెక్ట్ టైమ్ అని భావించిన మేకర్స్.. తాజాగా ‘ఇంద్ర’ను మళ్లీ థియేటర్లలో విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.

22 ఏళ్లు పూర్తి..

తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న వైజయంతీ మూవీస్.. అప్పట్లో పలు క్లాసిక్ చిత్రాలను నిర్మించింది. అందులో ఒకటి చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంద్ర’. ఇక వైజయంతీ మూవీస్ బ్యానర్.. తాజాగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక ‘ఇంద్ర’ రిలీజ్ అయ్యి కూడా 22 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ మూవీ రీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు మేకర్స్. ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నాడు ‘ఇంద్ర’. దీంతో ఫ్యాన్స్ అంతా మరోసారి ఈ క్లాసిక్ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇండస్ట్రీ హిట్..

బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇంద్ర’.. అప్పట్లో ఎన్నో రికార్డులను తిరగరాసింది. 2002 జులై 24న విడుదలయిన ఈ చిత్రం.. ఎన్నో సెంటర్లలో 50 రోజులు, 100 రోజులు కూడా ఆడింది. అంతే కాకుండా అత్యధిక కలెక్షన్స్ సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా రికార్డ్ అందుకుంది. అందుకే ఈ మూవీ రీ రిలీజ్‌ను చాలా స్పెషల్‌గా అనౌన్స్ చేసింది. ‘మెగా బ్లాక్‌బస్టర్ ఇంద్ర 22 ఏళ్లను పూర్తిచేసుకుంది. సినిమాపై మాత్రమే కాకుండా మన మనసుల్లో కూడా ఇది చెరగని ముద్ర వేసుకుంది. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్రాండ్‌గా రీ రిలీజ్ అవ్వనుంది’’ అని వైజయంతీ మూవీస్ ప్రకటించింది.

బెస్ట్ యాక్టర్ అవార్డులు..

‘ఇంద్ర’కు అప్పట్లో మూడు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. ఇక ఈ మూవీలో హీరోగా చిరంజీవి యాక్టింగ్‌కు బెస్ట్ యాక్టర్‌కు తనకు ఈ రెండు అవార్డులు వరించాయి. చిరంజీవి, వైజయంతీ మూవీస్ కాంబినేషన్‌లో పలు బ్లాక్‌బస్టర్స్ వచ్చినా ‘ఇంద్ర’ మాత్రం ల్యాండ్‌మార్క్‌గా మిగిలిపోయింది. ముఖ్యంగా మణిశర్మ అందించిన సంగీతాన్ని ఇప్పటికీ చాలామంది మర్చిపోలేరు. ఇందులో చిరు స్టెప్పులను ఇప్పటికీ ఫ్యాన్స్ ఇమిటేట్ చేస్తుంటారు. ‘ఇంద్ర’లో చిరంజీవికి జంటగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించారు.

Also Read: పవన్ కళ్యాణ్‌తో అనసూయ స్పెషల్ సాంగ్ - అది ఏ సినిమాలోనో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Kurnool News: నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
East Godavari: తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రులో ప్రమాదం- ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌- నలుగురు యువకులు మృతి
తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రులో ప్రమాదం- ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌- నలుగురు యువకులు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP DesamRishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP DesamInd vs NZ 3rd Test Highlights | భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా వైట్ వాష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Kurnool News: నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
East Godavari: తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రులో ప్రమాదం- ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌- నలుగురు యువకులు మృతి
తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రులో ప్రమాదం- ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌- నలుగురు యువకులు మృతి
Narne Nithin Engagement: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం - సైలెంట్‌గా చేసుకున్న ‘ఆయ్’ హీరో!
ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం - సైలెంట్‌గా చేసుకున్న ‘ఆయ్’ హీరో!
Jr NTR and Venkatesh are Relatives Now : ఎన్టీఆర్​, వెంకీ మామ చుట్టాలైపోయారుగా.. ఇంతకీ నార్నె నితిన్​కు కాబోయే భార్య ఎవరంటే?
ఎన్టీఆర్​, వెంకీ మామ చుట్టాలైపోయారుగా.. ఇంతకీ నార్నె నితిన్​కు కాబోయే భార్య ఎవరంటే?
Canada News: కెనడాలో దారుణం- ఆలయంలో హిందువులపై దాడి- ఖలిస్తానీలు గీత దాటారంటూ ఎంపీ వార్నింగ్
కెనడాలో దారుణం- ఆలయంలో హిందువులపై దాడి- ఖలిస్తానీలు గీత దాటారంటూ ఎంపీ వార్నింగ్
APTET Results: ఏపీ టెట్‌ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి, ఇలా చూసుకోండి
ఏపీ టెట్‌ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి, ఇలా చూసుకోండి
Embed widget