Chiranjeevi Nayanthara Movie Update: చిరు కోసం హైదరాబాద్ వచ్చిన నయన్ - ఇవాళ్టి నుంచి సాంగ్ షూట్ షురూ!
Mana Shankara Vara Prasad Garu Update: మెగాస్టార్ చిరంజీవికి జంటగా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. ఈ మూవీ షూట్ కోసం హైదరాబాద్ వచ్చింది నయన్.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu Movie). ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
హైదరాబాద్ వచ్చిన నయనతార
'మన శంకర్ వర ప్రసాద్ గారు' సినిమాలో చిరంజీవి నయనతార కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కోసం నయన్ హైదరాబాద్ వచ్చింది. ఇవాళ్టి నుంచి హీరో హీరోయిన్స్ మీద ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు.
Also Read: ఇట్స్ అఫీషియల్ - 46 ఏళ్ల తర్వాత కమల్ రజినీకాంత్ మల్టీ స్టారర్ మూవీ... థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమే
మాస్ అప్పీల్ ఉన్నటువంటి చార్ట్ బస్టర్ ట్రాక్‌లను అందించడంలో పాపులరైన భీమ్స్ సిసిరోలియో చిరంజీవి సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ రెడీ చేశారు. ప్రజెంట్ షూటింగ్ చేస్తున్న పాటకు డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
సంక్రాంతి 2026కి సినిమా విడుదల
Mana Shankara Vara Prasad Garu Release Date: 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రాన్ని సుష్మిత కొణిదెల నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి షైన్ స్క్రీన్స్ సంస్థపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పకురాలు. సాంగ్ కంప్లీట్ అయ్యాక మేజర్ స్టార్ కాస్ట్ మీద కీలకమైన టాకీ పార్ట్ షూటింగ్ చేయనున్నారు. ఇటీవల అనౌన్స్ చేసినట్లు 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయనున్నారు.
Also Read: 'ఢీ' షో To బిగ్ బాస్ హౌస్ - ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ గురించి ఈ విషయాలు తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో వీటీవీ గణేష్, కేథరిన్ త్రేసా తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: అనిల్ రావిపూడి, నిర్మాతలు: సాహు గారపాటి & సుస్మిత కొణిదెల, నిర్మాణ సంస్థలు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, సమర్పణ: శ్రీమతి అర్చన, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్, కూర్పు: తమ్మిరాజు, రచయితలు: ఎస్ కృష్ణ - జి ఆది నారాయణ.





















