అన్వేషించండి

Bubble Gum Song : మెగాస్టార్ చేతుల మీదుగా 'బబుల్ గమ్' సాంగ్ రిలీజ్ - 'ఇజ్జత్' సాంగ్ విన్నారా?

Chiranjeevi : రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న 'బబుల్ గమ్' మూవీ సెకెండ్ సింగల్ ని మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు.

Bubble Gum Izzat Song : రోషన్ కనకాల హీరోగా నటించిన 'బబుల్ గమ్'(Bubble Gum) మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. 'ఇజ్జత్'(Izzat) అనే లిరిక్స్ తో సాగే ఈ పాట యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. డీటెయిల్స్ లోకి వెళితే.. బుల్లితెర అగ్ర యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ 'బబుల్ గమ్'(Bubble Gum) అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇటీవలే మ్యూజికల్ ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ 'హాబీబీ' సాంగ్ సినీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సాంగ్ లో రోషన్ తన ప్రెజెన్స్ తో పాటు డాన్స్ తో అదరగొట్టాడు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. 'ఇజ్జత్'(Izzat) అంటూ సాగే ఈ పాటని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయడం విశేషం. శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఫుల్ ఎనర్జిటిక్ మోడ్ లో సాగింది. హైదరాబాది ర్యాప్ సాంగ్స్ తరహా లో ఉన్న ఈ పాటలో రోషన్ తన లుక్స్, ఎనర్జీతో అదరగొట్టాడు. ముఖ్యంగా కొన్ని షాట్స్ లో డాన్స్ ఇరగదీశాడు. ఈమధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ర్యాప్ సాంగ్స్ లాగే 'ఇజ్జత్' సాంగ్ ఉండడం విశేషం. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా శ్రీ చరణ్ పాకాల ఈ సాంగ్ ని కంపోజ్ చేయగా హరి లిరిక్స్ రాసి పాడారు. తెలంగాణ స్లాంగ్ లో క్యాచీ లిరిక్స్ తో ఈ పాట సాగింది.

ముఖ్యంగా యువతను ఆకట్టుకునే అంశాలన్నీ ఈ పాటలో ఉండడంతో ఈ సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు 'బబుల్ గమ్' మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు సుమ తన కొడుకును హీరోగా లాంచ్ చేసే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే కొడుకు సినిమాని ప్రమోట్ చేయడం కోసం స్టార్ సెలబ్రిటీస్ ని అప్రోచ్ అవుతోంది. ఇప్పటికే బబుల్ గమ్ ఫస్ట్ లుక్ ని దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ మూవీ లేటెస్ట్ సాంగ్ ని మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

ఇక త్వరలో ట్రైలర్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి సుమ ఎవరెవరిని తీసుకొస్తుందో చూడాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్నారు. 'క్షణం', 'కృష్ణ అండ్ హిస్ లీలా' వంటి సూపర్ హిట్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరేపు ఈ సినిమాని తెరకెక్కించారు. రోషన్ సరసన మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : ఓటీటీలోకి ‘భగవంత్ కేసరి‘ - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

టాప్ హెడ్ లైన్స్

Rudravanam PS Web Series Review - రుద్రవనం పీఎస్ రివ్యూ: అడవిలో తల లేని మొండెం - రుద్రవనంలో హత్యల మిస్టరీ సిరీస్ ఎలా ఉందంటే?
రుద్రవనం పీఎస్ రివ్యూ: అడవిలో తల లేని మొండెం - రుద్రవనంలో హత్యల మిస్టరీ సిరీస్ ఎలా ఉందంటే?
OTT Crime Thriller: రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
Anil Ravipudi: అతిథి పాత్రలో అనిల్ రావిపూడి... బుల్లితెర నుంచి వెండితెరకు!
అతిథి పాత్రలో అనిల్ రావిపూడి... బుల్లితెర నుంచి వెండితెరకు!
సారా అలీ ఖాన్‌పై ఫత్వా, ఆమె ఇకపై కేదార్‌నాథ్ ఆలయంలో పూజ చేసుకోలేరా? భారత చట్టం ఏం చెబుతోంది?
సారా అలీ ఖాన్‌పై ఫత్వా, ఆమె ఇకపై కేదార్‌నాథ్ ఆలయంలో పూజ చేసుకోలేరా? భారత చట్టం ఏం చెబుతోంది?

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
OTT Crime Thriller: రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
సారా అలీ ఖాన్‌పై ఫత్వా, ఆమె ఇకపై కేదార్‌నాథ్ ఆలయంలో పూజ చేసుకోలేరా? భారత చట్టం ఏం చెబుతోంది?
సారా అలీ ఖాన్‌పై ఫత్వా, ఆమె ఇకపై కేదార్‌నాథ్ ఆలయంలో పూజ చేసుకోలేరా? భారత చట్టం ఏం చెబుతోంది?
Embed widget