అన్వేషించండి

Ram Pothineni: దూకుడు మీదున్న రామ్ పోతినేని 'బుల్లెట్', రికార్డుల వేటలో వారియర్

రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతున్న ఊర మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'ది వారియర్'. ఇందులో ఫస్ట్ సాంగ్ 'బుల్లెట్...' విడుదలైన సంగతి తెలిసిందే. ఆ పాటకు 60 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి.

యువ కథానాయకుడు ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ది వారియర్'. ఆల్రెడీ ఇందులో 'బుల్లెట్...' సాంగ్ విడుదల అయ్యింది. ఇప్పుడు ఆ పాట మంచి దూకుడు మీద ఉంది. యువ తమిళ హీరో, క్రేజీ స్టార్ శింబు ఆ పాటను పాడిన సంగతి తెలిసిందే.

'బుల్లెట్...' సాంగ్‌కు యూట్యూబ్‌లో మంచి దూకుడు మీద ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఆ పాటకు 60 మిలియన్ ప్లస్ వ్యూస్ (The Warriorr Movie - Bullet Song Records) వచ్చాయి. అంటే... ఆరు కోట్లకు పైమాటే అన్నమాట. దేవిశ్రీ ట్యూన్, శింబు వాయిస్‌కు రామ్, వేసిన స్టెప్పులు తోడు కావడంతో ప్రేక్షకులు విపరీతంగా పాటను చూస్తున్నారు. హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) అందం కూడా యాడ్ అయ్యింది. యూట్యూబ్ గ్లోబల్ టాప్ మ్యూజిక్ ఛార్ట్స్‌లో కూడా 'బుల్లెట్...' సాంగ్ చోటు దక్కించుకుంది. 

సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో 'బుల్లెట్...' సాంగ్‌ను తెరకెక్కించారని దర్శకుడు లింగుస్వామి (Lingusamy) తెలిపారు. నిర్మాత ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదని ఆయన పేర్కొన్నారు. సినిమాలో 'బుల్లెట్...' సాంగ్ విజువల్స్ ఆడియన్స్‌ను స‌ర్‌ప్రైజ్‌ చేస్తాయని యూనిట్ టాక్.

Also Read: పాకిస్తానీ సినిమాకు Cannes 2022లో అవార్డులు - 'జాయ్ ల్యాండ్' ప్రత్యేకత ఏంటి?

'ది వారియర్'లో రామ్ సరసన కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 14న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రామ్ మీద తెరకెక్కించిన ఇంట్రడక్షన్ సాంగ్‌తో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి.

Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

View this post on Instagram
 
A post shared by Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget