Boney Kapoor: శ్రీదేవిది సహజ మరణం కాదు, అప్పట్లో పన్ను విరిగిందని నాగార్జున చెప్పారు: బోనీ కపూర్
2018లో అతిలోకసుందరి శ్రీదేవి మరణించింది. ఆ మరణానికి భర్త బోనీ కపూరే కారణమని పుకార్లు వెల్లువెత్తాయి. ఇన్నాళ్ల తర్వాత శ్రీదేవి మరణంపై తన మనసులోని మాటలను బయటపెట్టారు బోనీ కపూర్.
కొందరు సినీ సెలబ్రిటీలు త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినా.. తమ అభిమానుల మనసుల్లో ఎప్పుడూ ఉంటారు. ఇప్పటివరకు వయసు అయిపోయి, ఆరోగ్య సమస్యలతో మరణించిన సినీ తారలు ఎంతమంది ఉన్నారో.. హఠాత్తుగా, అనుమానస్పదంగా మరణించినవారు కూడా అంతే మంది ఉన్నారు. అలాంటి వారిలో శ్రీదేవి ఒకరు. తన అందంతో, అభినయంతో అతిలోకసుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి మరణం.. తన అభిమానులను మాత్రమే కాదు.. సినీ ప్రేక్షకులనే షాక్‌కు గురిచేసింది. అంత హఠాత్తుగా తను ఎలా చనిపోయింది అంటూ ఒక్కసారిగా అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఇక శ్రీదేవి మరణం గురించి తాజాగా తన భర్త బోనీ కపూర్ పలు వ్యాఖ్యలు చేశారు.
ఫైనల్‌గా మనసు విప్పారు..
బోనీ కపూర్, శ్రీదేవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యూన్యంగా ఉండేవారు. కానీ శ్రీదేవి హఠాన్మరణం గురించి బోనీ కపూర్ ఒక్కసారి కూడా స్పందించడానికి ఇష్టపడలేదు. ఇక తను మరణించిన ఇన్నేళ్ల తర్వాత బోనీ కపూర్ మనసులోని మాటలను బయటపెట్టారు. శ్రీదేవి చాలా కఠినమైన డైట్‌ను మెయింటేయిన్ చేసేదాన్ని, దానికోసం తను సరిగా ఉప్పు కూడా తినేది కాదని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. దాని కారణంగానే శ్రీదేవికి అప్పుడప్పుడు బ్లాక్‌ఔట్స్ అయ్యేవని బయటపెట్టారు. అలా ఒకసారి హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడం వల్ల శ్రీదేవికి పన్ను కూడా పోయిందని అన్నారు.
నేచురల్ కాదు..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్.. ‘‘అది నేచురల్ మరణం కాదు. యాక్సిడెంటల్ మరణం. నేను దానిగురించి మాట్లాడకూడదని డిసైడ్ అయ్యాను ఎందుకంటే నన్ను విచారిస్తున్న సమయంలో దానిగురించి దాదాపు 24 లేదా 48 గంటలు మాట్లాడుతూనే ఉన్నాను. ఇండియన్ మీడియా నుండి చాలా ఒత్తిడి ఉంది కాబట్టి ఇలా చేస్తున్నామని ఆఫీసర్లు స్వయంగా అన్నారు. దీంట్లో ఏ తప్పు జరగలేదని వారే తెలుసుకున్నారు. నేను లై డిటెక్టర్ టెస్ట్‌తో సహా ప్రతీ టెస్టులో పాల్గొన్నాను. ప్రతీ రిపోర్టులో ఇదొక యాక్సిడెంటల్ మరణం అనే తేలింది.’’ అని శ్రీదేవి మరణం తర్వాత తను ఎదుర్కున్న పరిస్థితుల గురించి బయటపెట్టాడు.
నాగార్జునకు ముందే తెలుసు..
‘‘తను ఒక్కొక్కసారి ఆకలితోనే ఉండిపోయేది. అందంగా కనిపించాలని అనుకునేది. ఆన్ స్క్రీన్‌పై అందంగా కనిపించడం కోసం మంచి షేప్‌లో ఉండాలని ఎప్పుడూ తపన పడేది. నాతో పెళ్లి అయిన తర్వాత నుండి పలు సందర్భాల్లో తనకు బ్లాక్ ఔట్స్ కూడా అయ్యాయి. తనకు లో బీపీ సమస్య ఉందని డాక్టర్ ఎప్పుడూ చెప్తుండేవారు.’’ అని శ్రీదేవికి ఉన్న ఆరోగ్య సమస్యల గురించి బయటపెట్టారు బోనీ కపూర్. ఒకసారి నాగార్జునతో సినిమా షూటింగ్ సమయంలో కూడా శ్రీదేవి ఇలాగే లో బీపీతో బాత్రూమ్‌లో పడిపోయిందని, అప్పుడు ఆమె పన్ను కూడా విరిగిపోయిందని చెప్పారని బోనీ కపూర్ వెల్లడించారు. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా తనకు చెప్పారని పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలను శ్రీదేవి ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని బోనీ కపూర్ వాపోయారు. 2018 ఫిబ్రవరీ 24న దుబాయ్‌లోని ఒక హోటల్ రూమ్‌లో బాత్ టబ్‌లో పడి శ్రీదేవి చనిపోయింది.
Also Read: స్టాఫ్ బైక్‌పై నాగచైతన్య ఆటోగ్రాఫ్ - వైరల్ అవుతున్న వీడియోలో సమంత జ్ఞాపకాలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial