Biker Collection: శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ డే కలెక్షన్స్... ఇండియాలో నెట్ ఎంతో తెలుసా?
Biker Box Office Collection Day 1: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బైకర్'. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?

Sharwanand Biker Movie First Day Collection: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 'బైకర్'. కథానాయకుడి తండ్రిగా, కీలక పాత్రలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ యాక్ట్ చేశారు. బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీ తనయుల మధ్య కథతో తెరకెక్కిన చిత్రమిది. గురువారం పెయిడ్ ప్రీమియర్లతో సినిమా విడుదలైంది. శుక్రవారం వరల్డ్ వైడ్ రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇండియాలో ఎంత నెట్ వచ్చింది? అంటే...
ఇండియాలో 'బైకర్' ఫస్ట్ డే నెట్ ఎంతంటే?
Biker India Net First Day Collection: 'బైకర్' సినిమాకు ఇండియాలో మొదటి రోజు రూ. 2.10 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. థియేటర్లలో ఈ సినిమా ఆక్యుపెన్సీ 22 శాతం ఉందని తెలిసింది. ఫస్ట్ డే నెట్ కలెక్షన్లలో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు వచ్చాయి. తమిళనాడు నుంచి ఐదు లక్షలు వచ్చినట్టు టాక్. మొదటి రోజు గ్రాస్ కలెక్షన్ అటు ఇటుగా రూ. 2.40 కోట్లు ఉంటుందని సాక్‌నిల్క్ పేర్కొంది. ఓవర్సీస్ కూడా యాడ్ చేస్తే మూడు కోట్ల రూపాయలకు దగ్గరలో ఉండొచ్చు.
View this post on Instagram
శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు అప్రిసియేషన్!
'బైకర్'కు మోడరేట్ పాజిటివ్ టాక్ లభించింది. బైక్ రేసింగ్ కంటే ఈ సినిమాలో తండ్రీ తనయుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలకు మంచి టాక్ లభించింది. మరీ ముఖ్యంగా శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఆ బాడీ మేకోవర్ చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. రెండో రోజు ఎలా ఉంటుంది? సినిమాకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనేది చూడాలి.
View this post on Instagram
'బైకర్'ను యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించగా... 'లూజర్' వెబ్ సిరీస్, 'మా నాన్న సూపర్ హీరో' ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. శర్వా సరసన మాళవికా నాయర్ నటించారు. అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు.
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















