Bigg Boss Seson 7 Telugu: తేజ వీక్ కంటెస్టెంట్, అందుకే అందరూ అలా చేస్తున్నారు: ప్రిన్స్ సోదరుడి వ్యాఖ్యలు
ప్రిన్స్ యావర్‌ను ఇతర కంటెస్టెంట్స్ టార్గెట్ చేస్తున్నట్టుగా తన సోదరుడికి అనిపిస్తుంది అన్న విషయం తాజాగా బయటపెట్టాడు. అంతే కాకుండా టేస్టీ తేజపై పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు.
బిగ్ బాస్ సీజన్ 7లోకి వచ్చిన చాలామంది కంటెస్టెంట్స్.. ఇంతకు ముందు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్నవారు కాదు. కొందరు సీనియర్ నటీనటులు తప్పా.. చాలామంది జూనియర్స్ ఎవరో, ఏంటో బిగ్ బాస్ ప్రేక్షకులకు తెలియదు. కానీ ఒక్కసారి బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ హౌజ్.. ఎవరినైనా సెలబ్రిటీలుగా మార్చేస్తుంది. కంటెస్టెంట్స్.. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంతకాలం బయట ఉన్న వారి ఫ్యామిలీ చుట్టూ సోషల్ మీడియా తిరుగుతూనే ఉంటుంది. హౌజ్‌లో ఉన్నవారు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, దానిపై వారి స్పందన ఏంటి అని కంటెస్టెంట్స్ ఫ్యామిలీలను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి.. వారి సమాధానాలను వైరల్ చేస్తుంటారు. తాజాగా ప్రిన్స్ యావర్ సోదరుడు ఇచ్చిన సమాధానాలు కూడా అలాగే వైరల్ అయ్యాయి.
బిగ్ బాస్ సీజన్ 7 మొదలవ్వకముందు ప్రిన్స్ యావర్ అంటే ఎవరో చాలామందికి తెలియదు. ఒక మోడల్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన యావర్.. ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ బిగ్ బాస్ హౌజ్‌లోకి మాత్రం గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. యావర్‌కు తన ఫిజిక్కే బలం. అందుకే ఎప్పటికప్పుడు తన బలం ఏంటో ప్రేక్షకులకు చూపించుకునే ప్రయత్నం చేశాడు. అలాంటి ప్రయత్నాల్లో చాలావరకు సక్సెస్ అయ్యాడు కూడా. ఫిజికల్ టాస్కుల విషయంలో యావర్‌తో ఇతర కంటెస్టెంట్స్ తలపడడానికి భయపడేలా చేశాడు. కానీ ఓటమిని అంగీకరించలేని తన గుణం.. కంటెస్టెంట్స్‌ను తనకు దూరం చేసింది. కోపం వచ్చిన ప్రతీసారి యావర్ ప్రవర్తన.. కంటెస్టెంట్స్‌కు మాత్రమే కాదు చాలామంది ప్రేక్షకులకు కూడా విసుగు వచ్చేలా చేసింది. దీంతో హౌజ్‌లో యావర్ ప్రవర్తనపై, అసలు బిగ్ బాస్ షోపై తన సోదరుడు కామెంట్స్ చేశాడు.
బిగ్ బాస్‌లో హౌజ్‌మేట్స్ అంతా కలిసి ప్రిన్స్ యావర్‌ను టార్గెట్ చేస్తున్నారు, ప్రతీ గేమ్‌లో ఓడిపోయేలా చేస్తున్నారు, బిగ్ బాస్‌లో రాజకీయాలు జరుగుతున్నాయి అని అనుకుంటున్నారా అని యావర్ సోదరుడిని అడగగా.. ‘‘బిగ్ బాస్ హౌజ్ అన్యాయమైన హౌజ్, అక్కడ న్యాయం లేదు. అక్కడ అందరూ బాగా ఆడుతున్నారు. అందరూ గెలవడానికే వచ్చారు. అందరూ కలిసి యావర్‌ను వీక్ అంటున్నారు. కానీ అతనే చాలా స్ట్రాంగ్. అందుకే వాళ్లు తనను నామినేట్ చేయాలని చూస్తున్నారు. నామినేట్ చేసిన తర్వాత ఎలిమినేట్ అయిపోతే వాళ్లంతా బాగా ఆడుకోవచ్చని అనుకుంటున్నారు. వాళ్లు టేస్టీ తేజను కాపాడారు. టేస్టీ తేజ.. గతవారమే ఎలిమినేట్ అయిపోయి ఉండేవాడు. అవ్వలేదు. ఈ వారం తను నామినేషన్స్‌లో లేడు. ఒకవేళ ఉండుంటే.. తేజ లేదా దామినిలో ఒకరు వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ వారు తేజను కాపాడారు. ఎందుకంటే తను అందరిలో చాలా వీక్. ఇప్పుడు యావర్‌ను ఎలిమినేట్ చేస్తే.. భవిష్యత్తులో తేజను ఎలిమినేట్ చేయడం సులభం అనుకున్నారు. అందరూ వారి మెదడుతో ఆడుతున్నారు. కానీ మా అన్న మాత్రం చిన్నపిల్లవాడు. అతడి ప్రవర్తన అలాగే ఉంది. అతడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు.’’ అన్నాడు యావర్ సోదరుడు.
మామూలుగా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క కుటుంబ సభ్యులు.. ఎవరికి వారే సపోర్ట్ ఇచ్చుకుంటారు. ప్రిన్స్ యావర్ సోదరుడు కూడా అదే చేశాడు. కానీ బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయిన మొదటి వారంలో ప్రిన్స్ యావర్ అనేవాడు ఎవరో కూడా ప్రేక్షకులకు సరిగా తెలియలేదు. కానీ ఇతర కంటెస్టెంట్స్ అంతా కలిసి తను స్ట్రాంగ్ అని, తనను టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతుంటే.. యావర్‌లో కోపం ఎక్కువయ్యింది. ఆ కోపంలో తను మాట్లాడుతున్న మాటలు, తన ప్రవర్తన.. ప్రేక్షకుల వరకు వెళుతోంది. దీంతో చాలాసేపు ప్రేక్షకులకు కనిపించే అవకాశం యావర్‌కు దక్కుతోంది. దీని ద్వారా తనే కరెక్ట్ అనుకునే ఫ్యాన్స్ కూడా యావర్‌కు ఎక్కువయ్యారు.
Also Read: ఆ వీడియోలు చూపిస్తే పరిస్థితి ఏమిటీ? నీ కాళ్లు పట్టుకోనా రతిక: శివాజీ - వీరి మధ్య ఏమైంది?