Bigg Boss Keerthi Bhatt: శివరాత్రి వేళ దేవుడిపై బిగ్‌బాస్ కీర్తి భట్ సంచలన కామెంట్స్ - రేప్‌లు జరుగుతుంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు?
Keerthi Bhat: శివరాత్రి వేళ బిగ్‌బాస్ ఫేం కీర్తి భట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రేప్‌లు జరుగుతుంటే ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Bigg Boss Keerthi Bhat Sensational Comments: శివరాత్రి వేళ బిగ్‌బాస్ ఫేం, టీవీ నటి కీర్తి భట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రేప్‌లు జరుగుతుంటే ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. కీర్తి భట్ సెల్ఫీ వీడియో షేర్ చేసింది. మనం ప్రతి రోజులు దేవుడిని వేడుకుంటాం. శివరాత్రి అనే కాదు. ఎప్పుడైన దేవుడుకి పూజాలు చేస్తాం. ఎందుకు అందరు బాగుండాలనే కదా. మంచి జరగాలనే కదా. కానీ దేశంలో మహిళలపై ఆరాచాకాలు, అఘాత్యాలు జరుగుతుంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు. "మాట్లాడాదామా, వద్దా అని అనుకుంటూనే ఫోన్ చూస్తున్న. ఈ రోజు మహాశివరాత్రి. దేవుడు కోసం అది ఇది అన్ని చేస్తాం. నైవేద్యాలు పెడతాం. పూజలు చేస్తాం. ఈ రోజే కాదు.ఇంకేరోజైన దేవుడికి పూజలు చేస్తాం.
అవన్ని ఎందుకు.. అందరు బాగుండాలి అందరికీ మంచి జరగాలనే కదా? అని ప్రశ్నించింది. కానీ ఆ మంచి జరగడం లేదు. ఒక చిన్నారిని గ్యాంగ్ రేప్ చేశారు. అప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. పెద్దవాళ్లు అయితే ఏదోఒకళా తప్పించుకోవడం వంటివి చేస్తారు. అదీ చిన్న పిల్లా. అంతమంది క్రూరంగా దానిపై దాడి చేశారు. ఆ చిన్నది ఏం చేస్తుంది. ఇలాంటి ఘటనలను దేవుడు ఆపకుండా ఏం చేస్తున్నాడు. చూస్తూ ఊరుకుంటున్నాడు. ఆ సమయంలో ఆ చిన్నారి ఎంత నరకయాతన అనుభవించి ఉంటుంది. అప్పుడు ఆమెను దేవుడు కాపాడాలి, లేదా ఆ చిన్నారికి అలాంటి ఘటనే ఎదురవకుండ చూడాలి. రేప్ నుంచి తప్పించుకునేలా చేయాలి. కానీ ఏం చేయకుండ చూస్తూ కూర్చున్నాడు.
కనీసం తప్పించుకోవడానికైనా సాయం చేయొచ్చు కదా.. అలాంటి టైంలో కాపాడలేని దేవుడు ఎందుకు? పసిపిల్లలంటే దేవునితో సమానం అంటారు కదా.. మరి ఆ పసిపిల్లలపై రేప్‌లు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇందుకేనా రోజు దేవుడికి పూజలు చేయాలి? ఇది చాలా దారుణం కదా.. ఇవన్నీ చూస్తుంటే అసలు దేవుడే లేడనిపించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు పేదవాళ్లు పేదవాళ్లగానే ఉంటున్నారని, ధనికులు మరింత ధనవంతులను అవుతున్నారని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కీర్తి కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం అంతా ఆమె వ్యాఖ్యల గురించే చర్చించుకుంటున్నారు. కొందరు కీర్తిని సపోర్టు చేస్తుంటే.. మరికొందరు దేవుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని, అదీ కూడా మహాశివరాత్రి రోజు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటున్నారు.
View this post on Instagram
చూస్తుంటే ఆమె కామెంట్స్ కొందరి మనోభవాలను దెబ్బతీసేలా ఉన్నాయి. మని మునుముందు ఆమె కామెంట్స్ ఎలాంటి రచ్చకు దారితీస్తాయో చూడాలి. కాగా కీర్తి బిగ్‌బాస్ 6 సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. హౌజ్‌లో కీర్తి తనదైన ఆటతీరుతో టఫ్ కాంపిటిషన్ ఇస్తూ టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. ఎలాంటి విషయాన్ని కీర్తి నిర్మోహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. ఈ క్రమంలో ఆమె హౌజ్‌లో మిగతా వారి నుంచి వ్యతిరేకత కూడా ఎదుర్కొంది. కానీ, కీర్తి మాత్రం తగ్గేదే లే అంటూ తన ఆట, పర్ఫామెన్స్ దూసుకుపోయింది. ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే కీర్తి పెళ్లిపీటలు ఎక్కింది. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ఓ సీరియల్‌లో లీడ్ రోల్ పోషిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

