By: ABP Desam | Updated at : 04 Jun 2023 05:20 PM (IST)
'భోళా శంకర్'లో చిరంజీవి
'వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా... మనమొస్తేనే స్విచ్ ఆన్ గోల' అని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అంటున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు సినిమాలో తొలి పాట 'భోళా మేనియా'ను విడుదల చేశారు.
దేవి శ్రీ విడుదల చేసిన భోళా మేనియా
'భోళా మేనియా' పాటను రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ''మెగాస్టార్ చిరంజీవి గారి 'భోళా శంకర్' చిత్రంలో పాటను విడుదల చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా సోదరుడు మహతి స్వర సాగర్ కు ఈ సాంగ్ పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను. తమ్ముడు... జస్ట్ డూ కుమ్ముడు'' అంటూ దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.
''థాంక్యూ తమ్ముడు... ఈ పాట 'అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు' కంటే డబుల్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చిరంజీవి ట్వీట్ చేశారు. పాట విడుదల చేసిన దేవి శ్రీకి ఆయన థాంక్స్ చెప్పారు.
''అదిరే స్టైల్ అయ్యా...
పగిలే స్వాగ్ అయ్యా...
యుఫోరియా నా ఏరియా
భోళా మేనియా!
ఎగస్ట్రాలు వద్దయ్యా...
కొలెస్ట్రాల్ వద్దయ్యా...
ఎవ్వడైనా గూబ గుయ్యా
భోళా మేనియా''
అంటూ ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. రేవంత్ పాడారు. శేఖర్ మాస్టర్ పాటకు కొరియోగ్రఫీ అందించారు. 'వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా... మనమొస్తేనే స్విచ్ ఆన్ గోల' అంటూ లిరిక్స్ సాగింది.
Also Read : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!
ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో కీలక పాత్ర పోస్తున్నారు. చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తున్నారు.
Also Read : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!
రఘు బాబు, మురళీ శర్మ, రవి శంకర్, 'వెన్నెల' కిశోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, 'హైపర్' ఆది, 'వైవా' హర్ష, రష్మీ గౌతమ్, ప్రదీప్, బిత్తిరి సత్తి, సత్య, 'గెటప్' శ్రీను, వేణు టిల్లు (బలగం దర్శకుడు వేణు ఎల్దండి), 'తాగుబోతు' రమేష్, ఉత్తేజ్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు : మార్తాండ్ కె వెంకటేష్, కథా పర్యవేక్షణ : సత్యానంద్, మాటలు : తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్ : రామ్ - లక్ష్మణ్ & దిలీప్ సుబ్బరాయన్ & కాచే కంపాక్డీ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కిషోర్ గరికిపాటి, ఛాయాగ్రహణం : డడ్లీ, సంగీతం : మహతి స్వర సాగర్, నిర్మాణ సంస్థ : ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత : రామ బ్రహ్మం సుంకర, కథనం, దర్శకత్వం : మెహర్ రమేష్.
The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్క్లూజివ్ రిలీజ్!
Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్
Sreeleela Rashmika : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?
Mangalavaram Movie Release : నవంబర్లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
TS TET 2023 Results: టీఎస్ టెట్-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు
/body>