అన్వేషించండి

Bheemla Nayak Controversy: చిక్కుల్లో 'భీమ్లా నాయక్', సినిమాలో ఆ సీన్ డిలీట్ చేయాలని కుమ్మరి కులస్థుల డిమాండ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా చిక్కుల్లో పడింది. సినిమాలో ఓ సన్నివేశం డిలీట్ చేయాలని కుమ్మరి కులస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ, ఈ వివాదం ఏమిటి? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే... 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాపై కుమ్మరి కులస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పతాక సన్నివేశాల్లో తమ మనోభావాలను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ, వివాదం ఏమిటి? సినిమాలో ఏయే సన్నివేశాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళితే...

'భీమ్లా నాయక్' సినిమాలో పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి మధ్య చిత్రీకరించిన యాక్షన్ దృశ్యాల్లో... ఓ చోట కుమ్మరులు పవిత్రంగా భావించే సారెను (చక్రాన్ని) కాలితో రానా తన్నారని, ఇది తమ వర్గాన్ని అవమానించేలా ఉందని కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షకులు డా. మానేపల్లి వీవీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. ఇంకా సినిమాలో పలు సన్నివేశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలిగించాలని డిమాండ్‌ చేయడంతో పాటు గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు.

Also Read: 'సాహో' దర్శకుడితో పవన్ 'తేరి' రీమేక్ చేస్తున్నారా? అసలు నిజం ఏంటంటే?

'భీమ్లా నాయక్' సినిమాలో సన్నివేశం కుమ్మరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్న వీవీఎస్ఎన్ మూర్తి... హీరోలు పవన్‌, రానాతో పాటు చిత్ర దర్శకుడు సాగర్ కె. చంద్ర, నిర్మాత సూర్య దేవర నాగవంశీపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తమ వర్గాన్ని అవమానించిన కుమ్మర శాలివాహనులకు పవన్ కల్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Also Read: 'ఇది పవన్ పై దాడి కాదు, థియేటర్ వ్యవస్థపై దాడి' నిర్మాత ఫైర్!

View this post on Instagram
 
A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget