Bhediya 2: 2025లో ‘భేడియా 2’ రిలీజ్: వరుణ్ ధావన్ క్రేజీ అప్ డేట్
అమర్ కౌశిక్ దర్శకత్వంలో గతేడాది బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన ‘బేడియా’ సీక్వెల్ పై అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ 2025లో విడుదల కానుంది.
Bhediya 2: గతేడాది ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ అండ్ సస్పెన్స్ క్రియేట్ చేసిన ‘బేడియా’చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్.. తాజాగా దాని సీక్వెల్ ‘బేడియా2’పై అప్ డేట్ ఇచ్చాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటించనున్న కామెడీ అండ్ హారర్ ఫిల్మ్ కు సంబంధించిన ‘బేడియా2’లోగో టైటిల్ ను స్ర్కీన్ పై ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘బద్లాపూర్’, ‘స్ట్రీట్ డ్యాన్సర్’ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో వరుణ్ ధావన్ బాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన సినిమాలు గత కాలంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయినా.. వరుణ్ అలుపెరుగని స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఆయన నటించిన 'జగ్‌జగ్ జీయో', 'బేడియా'లు కూడా అంతగా హిట్ కాకపోయినా.. నష్టాలను మాత్రం చూడకపోవడం కాస్త ఊరటనిస్తోంది. అంతే కాదు 'బేడియా1'లో వరుణ్ నటనకు ప్రత్యేక ప్రశంసలు కూడా అందుకున్నాడు.
ఎప్పుడూ రొమాంటిక్ సినిమాలే కాకుండా.. కాస్త విభిన్నంగా ట్రై చేసే నటుల్లో వరుణ్ ధావన్ ఒకడు. అదే తరహాలో గత సంవత్సరం 2022లో అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బేడియా1' ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీగా బేడియాను తెరకెక్కిన ఈ మూవీని జియో స్టూడియోస్ (Jio Studious) సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. ఆ తర్వాత సర్ ప్రైజింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ కలిగి ఉన్న ఈ మూవీకి మొదట్లో మంచి టాక్ వచ్చినా.. రిలీజ్ తర్వాత కాస్త నిరాశే మిగిల్చింది.
హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజైంది. అందులో భాగంగా తెలుగులో తోడేలు అనే పేరుతో విడుదలైంది. మరో ముఖ్య విషయమేమిటంటే ఈ సినిమా త్రీడీ ఫార్మాట్ లోనూ రిలీజైంది. అరుణాచల్ అడవుల నేపథ్యంగా బేడియా కథను డైరెక్టర్ కాస్త భిన్నంగా తీసినా.. ప్రేక్షకుల నుంచి మార్కులు కొట్టేయలేకపోయింది. కానీ ఈ సినిమా నష్టాలను మాత్రం మిగల్చలేకపోవడం మేకర్స్ కు కాస్త ఊరటనిచ్చింది.
View this post on Instagram
ఇక తాజాగా ‘బేడియా 2’ టైటిల్ ను హీరో వరుణ్ ధావన్ అనౌన్స్ చేశారు. ఈ వీడియోలో భూమి చీల్చుకుని అగ్ని పర్వతం నుంచి లావా ఉబికి వస్తున్నట్టుగా ఉండగా.. పక్కనుంచి ‘బేడియా 2’అనే టైటిల్ పడడం.. వరుణ్ దాన్ని అనౌన్స్ చేస్తూ చూపించడం అందర్నీ ఆకర్షిస్తోంది. దాంతో పాటు ఈ సినిమా 2025లో థియేటర్లలో రిలీజ్ కానుందని వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను రియల్ బాలీవుడ్ హంగామా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దాంతో పాటు హీ ఈజ్ బ్యాక్.. ‘బేడియా 2’ను వరుణ్ ధావన్ ప్రకటించాడంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చారు. ఇక ఈ వీడియోపై సినీ అభిమానులు, వరుణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బేడియా 1’అంతగా ఆకట్టుకోకపోయినా.. దీని సీక్వెల్ మాత్రం ఖచ్చితంగా హిట్ కొడుతుందంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మొగుళ్ళు బాధలే 'సేవ్ ద టైగర్స్' - 'భార్యల నుంచి కాపాడుకుందాం' అంటున్న ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ